E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రాజేష్ ఇంటికి వెళ్లిన బాలు, మీనా.. బాలుకు క్లాస్ పీకిన మీనా.. రోహిణిని టార్గెట్ చేసిన దినేష్..

Gundeninda GudiGantalu Today episode: రాజేష్ ఇంటికి వెళ్లిన బాలు, మీనా.. బాలుకు క్లాస్ పీకిన మీనా.. రోహిణిని టార్గెట్ చేసిన దినేష్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode February 12th: నిన్నటి ఎపిసోడ్ లో.. తన ఫ్రెండ్స్ తో రాజేష్ ఫంక్షన్ గురించి మాట్లాడుతూ ఉంటాడు.. మీన రావడంతో ఏమైనా అమ్మాయిలా వచ్చావు మీరిద్దరేమైనా గొడవపడ్డారా అని అడుగుతాడు.. నేను మీకు ఒక సొంత చెల్లెలు లాగా మాట్లాడుతున్నాను అన్నయ్య మీరు తప్పుగా మాత్రం అనుకోవద్దు. ఆయన డబ్బులు ఇస్తానని మీకు చెప్పాడు కదా.. మీరు అప్పు ఇవ్వడానికి మళ్లీ చాలా కష్టపడాలి ఇది మీరు ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్తాడు.. బాలు రాజేష్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఫంక్షన్ కోసం ఏర్పాట్లు అని జరుగుతున్నాయా? నువ్వు డబ్బులు కావాలని అడిగావు కదరా ఇదిగో డబ్బులు అని బాలు ఇస్తాడు.. అది చూసిన రాజేష్ షాక్ అవుతాడు. ఇప్పుడు నాకు ఈ డబ్బులు వద్దురా అని బాలుతో రాజేష్ అంటాడు. నిన్ననే కదరా డబ్బులు కావాలి అని అడిగావు ఇప్పుడెందుకు వద్దు అని అంటున్నావు అని బాలు అంటాడు. రోహిణి, విద్య కలిసి మనోజ్ ను దారుణంగా మోసం చేశారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఉదయం లేవగానే బాలు రాజేష్ వాళ్ళ అమ్మానాన్న షష్టిపూర్తికి వెళ్తున్నానని చెప్పగానే మీ నాన్న కూడా తీసుకెళ్లాలని సత్యం అంటాడు. సత్యం చెప్పడంతో మీనాని ఇష్టం లేకపోయినా బాలు అక్కడికి తీసుకొని వెళ్తాడు. ఎక్కడున్నావ్ వాళ్ళందరికీ మీనాని పరిచయం చేస్తాడు.. ఆ తర్వాత ఫస్ట్ పూర్తి జరగాల్సిన దంపతులు ఎలా ఉన్నారు ఏంటి అని బాలు వాళ్ళని అడుగుతాడు.. మీ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు మీ ఫ్రెండుకి తెలీదు. మీరు వెళ్లి ఒకసారి ఆయననే అడగండి అని రాజేష్ భార్య చెప్తుంది. మాకు ఎటువంటి ఫంక్షన్ వద్దు ఆకలేస్తుంది కాస్త భోజనం పెట్టండి అని రాజేష్ వాళ్ళ అమ్మానాన్న బాధగా అడుగుతారు.. ఏంటిది కనీసం భోజనం కూడా పెట్టట్లేదా ఏం జరుగుతున్న అమ్మాయి ఇక్కడ అని బాలు రాజేష్ భార్య ని అడుగుతాడు..

Advertisement

రాజేష్ ఏం చేస్తున్నాడు మీకు తెలియదన్నయ్య ఒకసారి మీరు వెళ్లి చూడండి.. భోజనం దగ్గరికి ఆడవాళ్లు వెళ్లేలా కనిపించడం లేదు. మీరే వెళ్లి వాళ్ళకి భోజనం తెచ్చి పెట్టండి అన్నయ్య అని ఆమె అంటుంది. ఇక మీనా బాలు ఇద్దరు కలిసి పెద్ద వాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం పదండి అని మీనా అంటుంది.. ఇక అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం పదండి అని మీనా బాలు బయటికి వెళ్తారు. అక్కడ అందరూ మందు తాగుతూ తూలుతూ కనిపించడంతో బాలు కోపంతో రగిలిపోతాడు. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.. అని ఆలోచిస్తూ ఉండగా.. మీనా వాళ్లకు ముందు భోజనం పెట్టాలి మీరు వెళ్లి భోజనం తీసుకురండి అని అంటుంది.. బాలు వెళ్లి భోజనం పెట్టగానే వాళ్ళు ఆకలికి ఉండలేకపోతున్నాం బాబు మీరు భోజనం పెట్టారు చాలా సంతోషంగా ఉంది మీ పేరు ఈ జన్మలో మర్చిపోము అని వాళ్ళు అంటారు.

ఆ తర్వాత అక్కడ వాళ్లకి భోజనం వడ్డించాలని ఎంత చెప్తున్నా సరే.. వాళ్లు మాత్రం మందులో తూలుతూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు.. ఒక్కొక్కరు అక్కడ మటన్ లేదు అది లేదు ఇది లేదు అంటూ గొడవకి దిగుతారు. అంత గ్రాండ్ గా ఫంక్షన్ చేసిన సరే రాజేష్ ని దారుణంగా అవమానించేలా మాట్లాడుతారు. బాలుని కొట్టబోతుంటే మీనా వాళ్ళందరిని పక్కకు తోసేసి బాలుని తీసుకొని బయటకు వస్తుంది. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు అని బాలు అంటాడు. రాజేష్ భార్య ఎంత చెప్తున్నా సరే బాలు అక్కడి నుంచి వచ్చేస్తాడు.

Advertisement

ఇంటికి రాగానే బాలు మీనాలు మాట్లాడుకుంటూ ఉంటారు.. నేను డబ్బులు ఇవ్వనని ఎందుకన్నాను ఇప్పుడు అర్థమైందా..? భార్య మాట వినాలని ఎంత చెప్తున్నా సరే మీరు మాత్రం ఎందుకు? నీకెందుకు అన్నట్లు మాట్లాడుతున్నారు. ఇప్పుడు జరిగిందా మీకు.. డబ్బులు ఇచ్చి అవమానంతో వెనక్కి వచ్చేసారు అని అనగానే అప్పుడే సత్యం అక్కడికి వస్తాడు. ఏంట్రా ఫంక్షన్ బాగా జరిగిందా అని అడుగుతాడు.. ఇక మీనా ఫంక్షన్ చాలా బాగా జరిగింది మామయ్య ఈయనకి వద్దన్నా సరే మటన్ వడ్డించి మరి పెట్టారు.. ఇందాకటి వరకు అత్తయ్య గారు వేయవన్నట్లు ఈయనకు రా తేన్పులు వేస్తున్నారు..

మీరు చూడలేదు ఇలాంటి ఫంక్షన్ ని ఎప్పుడు చూడలేదు అని మీనా కావాలని వెటకారంగా మాట్లాడుతుంది.. సత్యం భార్యతో వెళ్తే విలువ వేరేలా ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్లినా ఈసారి భార్యతోనే వెళ్ళు అని సలహా ఇస్తాడు.. అయితే మీనా ఏంటి అక్కడ జరిగిందానికి వెటకారంగా మాట్లాడుతున్నావా అని బాలు అంటాడు.. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఇలాంటివి ఇంకొకసారి జరగకుండా చూసుకోండి అని మీనా స్వీట్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది..

Also Read : శ్రీవళ్లి కి దిమ్మతిరిగే షాక్.. సాగర్ కు మైండ్ బ్లాక్.. శ్రీవల్లి ఫుల్ హ్యాపీ..

రోహిణి కొడుకు దగ్గరికి దినేష్ వెళ్తాడు.. అక్కడ ఫోటో తీసుకొని రోహిణికి పంపిస్తాడు.. అది చూసిన రోహిణి నా కొడుకు దగ్గరికి వస్తే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇస్తుంది.. ముందు నా కొడుకుని వదిలేసి వెళ్ళిపో అని ఎంత చెప్తున్నా సరే.. రోహిణి మాట వినకుండా దినేష్ నిన్ను కలవాలి రా అని లొకేషన్ పంపిస్తాడు.. ఇక తర్వాత బాలు తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ మందు తాగడానికి పైకి వెళ్తాడు.. తనలోని అంతరాత్మ బయటకు వచ్చి మీనా చెప్పింది వినకపోతే నీకు ఇలానే జరుగుతుంది అని పెద్ద క్లాస్ పీకుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

 

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×