E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: శ్రీవళ్లి కి దిమ్మతిరిగే షాక్.. సాగర్ కు మైండ్ బ్లాక్.. శ్రీవల్లి ఫుల్ హ్యాపీ..

Illu Illalu Pillalu Today Episode: శ్రీవళ్లి కి దిమ్మతిరిగే షాక్.. సాగర్ కు మైండ్ బ్లాక్.. శ్రీవల్లి ఫుల్ హ్యాపీ..
Advertisement

Illu Illalu Pillalu Today Episode February 12th: నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మదా పూజ కోసం ఇంట్లోని వల్ల పేర్లందరివి చెప్తుంది. అలాగే అమూల్య పేరు కూడా చెప్పడంతో వేదవతి సీరియస్ అవుతుంది.. శ్రీవల్లి పొర్లు దండాలు పెడితే దేవుడు కరుణించి మన కష్టాలను తీరుస్తాడు అని భాగ్యం ఆనందరావు అతి కష్టంగా పొర్లు దండాలు పెట్టిస్తారు.. అప్పుడే గుడి లోకి ఎంటర్ అయిన విశ్వక్ అమూల్యలతో పూజ చేయించాలని జానకమ్మ విశ్వక్ని మోకాళ్ళ మీద ప్రదక్షిణాలు చేయమని అంటుంది.. నానమ్మ ఏది చెప్తే అది చేయాలి అని విశ్వక్ కూడా ఏమీ మాట్లాడకుండా ప్రదర్శనలు చేస్తాడు. అటు పొర్లు దండాలు పెడుతున్న శ్రీవల్లిని విశ్వక్ గుద్దుకుంటాడు.. ఇదంతా నీ వల్లే జరిగింది రా దొంగ సచ్చినోడా అని శ్రీవల్లి విశ్వక్ని దారుణంగా తిట్టేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు గొడవ పడుతుంటారు. ధీరజ్ ప్రేమకు తన మనసులో ఉన్న ప్రేమని బయట పెడదామని అనుకుంటాడు. నీ అక్కడ అమూల్యను చూసి రామరాజును తీసుకొని వెళ్ళిపోవాలని అనుకుంటాడు. ఈ ఆ తర్వాత శ్రీవల్లి విశ్వం అమూల్య మెడలో తాళి కట్టకపోతే ఎవరు కట్టారు అని ఆలోచిస్తూ ఉంటుంది. దండాలు పెట్టడం వల్ల నొప్పులు వచ్చాయని బాధ పడిపోతూ ఆ బాధను మర్చిపోవాలని దోశలు వేసుకుంటూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. గుడి చుట్టూ పళ్ళు దండాలు పెట్టడం వల్ల నాకు బాగా ఆకలేస్తుంది బాబా ఏదైనా వేసుకొని తినాలి అని శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది.. వంట గదిలోకి వెళ్ళిన శ్రీవల్లి దోశలు వేసుకుని తినాలి. ఫుల్లుగా లాగించాలి ఆకలి నుంచి బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే శ్రీవల్లి దోశలు వేసుకుంటుంటే ఆనందరావు కూడా నాక్కూడా ఆకలేస్తుంది. తమ్ముడు ఒక రెండు దోసలు వేయవ అని అంటే నువ్వు నా దోసెలను మధ్యలోకి వస్తే మర్యాదగా ఉండదు అని శ్రీవల్లి అంటుంది. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు అని నర్మదాప్రేమ అక్కడికి వస్తారు.. దీంట్లో మీ పంచాయతీ ఏంటక్కా అని ప్రేమ అడుగుతుంది.. పంచాయతీ నా పిండాకూడా ఆకలేస్తుంటే దోసలు వేసుకుని తింటున్నాను అని శ్రీవల్లి అంటుంది.

Advertisement

మీరు ఎంతగా ఏది తిన్నా కూడా నర్మదక్క మీ టైం ఫిక్స్ చేసేంత వరకే.. మీ నిజాన్ని ఎప్పుడైతే బయట పెడుతుందో అప్పుడు మూట ముళ్ల సర్దుకుని బయటికి వెళ్లాల్సిందే అని ప్రేమ అంటుంది.. అయినా మేమెందుకు బయటకు వెళ్లాలి.. మెడలో విశ్వం తాళి కట్టలేదంట కదా అని శ్రీవల్లి అనగానే నర్మదాప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఏం మాట్లాడుతున్నావ్ అమూల్య మెడలో విశ్వక్ తాళికట్టక పోతే ఆ తాళి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు కట్టారు. అమూల్యనే వేసుకుందా? అసలు నీకు ఈ విషయాన్ని ఎవరు చెప్పారు అని ప్రేమ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది.

అసలు అమూల్య పెళ్లి ఎలా జరిగింది అన్నది కాదు మేటర్.. అమూల్యని ప్రేమించమని చెప్పింది నువ్వా కాదా అని ప్రేమ అంటుంది. అమూల్యని విశ్వక్ని ప్రేమించమని చెప్పింది. నువ్వే కదా మరి ఈ విషయం గురించి నువ్వు ఎలా తప్పించుకుంటావో అని శ్రీవల్లికి నర్మదా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.. ఇక తర్వాత ప్రేమ వీళ్ళిద్దరికీ ఆ విషయం ఎలా తెలిసి ఉంటుంది అక్క అని కంగారు పడిపోతూ ఉంటుంది.. నువ్వు మెడలో తాళి వేసుకోమని చెప్పిన విషయాన్ని అమూల్య అయితే చెప్పదు కదా.. నువ్వేం కంగారు పడకు అని నర్మదా అంటుంది.. ఇక ఆ తర్వాత రామరాజు అందరినీ పిలుస్తాడు. ఏంటి నాన్న ఏమైంది.. ఎందుకు అందర్నీ పిలుస్తున్నారు అని చందు అడుగుతాడు..

Advertisement

అమూల్య ఇలాంటి పని చేసింది అంటే నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది రా.. కూతుర్ని సరిగ్గా పెంచలేని వాడు నలుగురిలో ఎలా తిరుగుతాడు అని వాళ్ళకి మొహం చూపించలేకపోతున్నాను. ఇందాక గుడికి వెళ్ళినప్పుడే నా మొహాన్ని చూపించలేక దాచి పెట్టుకున్నాను. ఈ బాధలనుంచి బయటపడాలంటే రైస్ మిల్లు కి రాలేను… ఇకమీదట రైస్ మిల్ బాధ్యతలు అన్నీ కూడా సాగర్ తీసుకుంటాడు అని తాళాలు సాగరకి ఇస్తాడు.. కానీ సాగర్ మాత్రం నేను రైస్ మిల్లు చూసుకోలేను నాన్న అని తేల్చి చెప్పేస్తాడు.

నా తర్వాత రైస్ మిల్లు చూసుకోవాల్సింది నువ్వే కదా ఎందుకురా అలా మాట్లాడుతున్నావ్.. ఏమైందో చెప్పు అని రామరాజు గట్టిగా అడుగుతాడు.. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది నాన్న నేను ఇక మీదట రైస్ మిల్లు చూసుకోను అని సాగర్ మొహం మీదే చెప్పేస్తాడు.. ఏంట్రా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందా ఎప్పుడు ఎగ్జామ్ రాసావు ఎప్పుడు నీకు ఉద్యోగం వచ్చింది ఏవి నాన్నకు ఎందుకు చెప్పలేదు రా అని చందు అడుగుతాడు.. అప్పుడెప్పుడో ఎగ్జామ్ రాసాను రా.. అయితే అది వస్తుందని నేను కలగనలేదు వచ్చింది. నేను ఇక మీదట జాబ్ కి వెళ్ళాలి అని అంటాడు.. ఆ మాట వినగానే రామరాజు షాక్ అవుతాడు.. వేదవతి మీ నాన్నకు కూడా చెప్పకుండా నీ పెత్తనం ఏంట్రా ఇక్కడ అని అరుస్తుంది..

Also Read :మీనాక్షికి అవమానం.. పల్లవి ప్లాన్ సక్సెస్.. స్పృహలోకి వచ్చిన రాజేంద్ర..

నాకు ఇప్పుడు అర్థమైందిరా మీ మామ నిన్ను అల్లుడుగా ఒప్పుకోవాలంటే నువ్వు గవర్నమెంట్ జాబ్ చేయాలని చెప్పాడు. అందుకే నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావా? ఇల్లరికం కూడా వెళ్తావా అని రామరాజు అడుగుతాడు. నేను ఎన్నిసార్లు చెప్పాలి నాన్న మీకు. ఇల్లరికం వెళ్ళను అని.. అటు నర్మద కూడా నేను చెప్పేది వినండి మావయ్య గారు అని ఎంత చెబుతున్నా సరే రామరాజు మాత్రం వినడు.. ఇక వేదవతి నర్మదపై సీరియస్ అవుతుంది.. ఆ తర్వాత రైస్ మిల్లు బాధ్యతలని చందు నేను తీసుకుంటాను అని అంటాడు.. శ్రీవల్లి రైస్ మిల్లుకు ఓనర్ మా ఆయన ఎలాగైనా సరే మనం డబ్బులు కూడా పెట్టుకోవాలి అని ప్లాన్ చేస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×