Viral Video: బీహార్ ఊహించిన దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసు ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న ఓ యువకుడ్ని కిడ్నాప్ చేశారు కొందరు వ్యక్తులు. ఆ తర్వాత ఆ యువకుడికి డ్రగ్స్ ఇచ్చి మరీ వివాహం జరిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయ్యింది.
బీహార్ లో దారుణం.. ఓ యువకుడు కిడ్నాప్
బీహార్‌లోని సమస్తీపూర్ జిల్లా జోడి పఖర్ గ్రామానికి చెందినవాడు నితీశ్ కుమార్. ఈ యువకుడు బీహార్ పోలీస్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఈసారి ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని కోటి ఆశలు పెట్టుకున్నాడు. అందుకోసం గట్టిగానే ప్రిపేర్ అవుతున్నారు. ఫిజికల్ ఫిట్‌నెస్, ఎగ్జామ్ పరంగా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు.
అయితే చక్‌రాజా అలీ గ్రామానికి చెందిన శంకర్‌రాయ్ ఫ్యామిలీ కన్ను నితీశ్ కుమార్‌పై పడింది. యువకుడు అందంగా ఉంటాడని, పైగా చదువుకున్నాడని భావించింది. అతడ్ని ఇంటి అల్లుడిని చేసుకోవాలని భావించింది. ఫిబ్రవరి 7న లైబ్రరీకి వెళుతున్నాడు నితీశ్ కుమార్. సినిమా మాదిరిగా శంకర్ రాయ్ కుటుంబసభ్యులు ఎంట్రీ ఇచ్చింది.
ఉద్యోగానికి యువకుడు ప్రిపేర్.. డ్రగ్స్ ఇచ్చి పెళ్లి చేశారు
నితీష్‌ని కిడ్నాప్ చేసి కుమ్మేశారు. ఉద్యోగం తర్వాత పెళ్లంటూ మొండికేశాడు. చివరకు ఫలితం లేకపోవడంతో డ్రగ్స్ ఇప్పించింది రాయ్ ఫ్యామిలీ. మోర్వాలోని గుడి దగ్గరకు తీసుకెళ్లి శంకర్ రాయ్ కూతురు లక్ష్మీ కుమారితో బలవంతంగా వివాహం చేయించారు. ఆ తర్వాత అల్లుడ్ని ఇంట్లో బంధించారు. వివాహం జరిగినప్పుడు తీసిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
దీనిపై నితీష్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వీడియో చూసి సమస్తీపూర్ పోలీసులు శంకర్‌రాయ్ ఇంటికి వెళ్లారు. నితీష్‌ని అక్కడినుంచి విముక్తి కల్పించారు. శంకర్‌రాయ్ దంపతులను పోలీసులు విచారణ చేస్తున్నారు.
ALSO READ: 80 కిమీ వేగంతో వెళ్తేనే ఆ పాట.. ముంబై మెలోడీ రోడ్డు ప్రత్యేకతలు
बिहार के समस्तीपुर ज़िले में एक बार फिर ‘पकड़ौआ विवाह’ का मामला सामने आया है। जानकारी के अनुसार, लाइब्रेरी पढ़ने जा रहे एक युवक का अपहरण किया गया और उसे नशीला पदार्थ पिलाकर जबरन शादी करा दी गई। युवक बिहार पुलिस भर्ती की तैयारी कर रहा था। pic.twitter.com/zzWijAJ4y7
— iMayankofficial 🇮🇳 (@imayankindian) February 11, 2026