E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతి మాటతో ఇంట్లోని వాళ్లు షాక్.. అడ్డంగా ఇరుక్కున్న రోహిణి.. నెక్స్ట్ ట్విస్ట్ ఇదే..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతి మాటతో ఇంట్లోని వాళ్లు షాక్.. అడ్డంగా ఇరుక్కున్న రోహిణి.. నెక్స్ట్ ట్విస్ట్ ఇదే..

Gundeninda GudiGantalu Today episode February 17th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా ఎలాగైనా సరే శివకు బుద్ధి చెప్పాలని అనుకుంటుంది. తన తల్లికి వాడి సంగతి నేను చూసుకుంటాను అని గుణ దగ్గరికి వెళ్తుంది.. పార్వతి వద్దు మీనా వాడు ఒక రౌడీ గాడు దుర్మార్గుడు వాడి దగ్గరికి నువ్వు వెళ్లి వాడితో గొడవ పడతావా ఏంటి అల్లుడు గారికి ఈ విషయం తెలిస్తే నిన్ను ఇంట్లోకి కూడా రానివ్వడు అని పార్వతి అంటుంది.. నాకేం పర్వాలేదు అమ్మ నేను చూసుకుంటాను ముందు వాడు సంగతి ఏదో తెలుస్తానని మీనా వెళ్తుంది. మీనా నువ్వు అసలు మారవా నా తమ్ముడిని ఎందుకురా ఇలా మార్చేస్తున్నావు అని నేను అంటుంది. మొదట చాలా మర్యాదగా మాట్లాడిన గుణ ఆ తర్వాత మీనా మాటలకి రెచ్చిపోతాడు. అక్కని మర్యాదగా మాట్లాడుతున్న సరే మీదా మాత్రం నా తమ్ముడు జోలికి వస్తే మర్యాదగా ఉండదు. ఎవర్రా నీకు అక్క అని ఇంకాస్త గట్టిగా అరుస్తుంది..నీకు దమ్ముంటే నీ తమ్ముని ఆపుకో.. వాడిని నా దగ్గరికి రాకుండా చేసుకో.. అంతే కానీ ఇలా నా దగ్గరికి వస్తే అరుస్తావ్ ఏంటి ఏం మాట్లాడుతున్నావే అని గుణ అనడంతో మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది.

నీకు ఇలా కాదురా నీకు బుద్ధి చెప్పాల్సిందే అని మీనా గుణాన్ని కొడుతుంది. గుణ నన్నే కొడతావే నువ్వు నీకెంత ధైర్యం ఉంది అని అంటాడు. నన్నే ఏ అంటావా రా అని మీనా వాడిని ఇంకా కొట్టడానికి ముందుకు వస్తుంది. కానీ వాడు మాత్రం మీనాని ఒక్కసారిగా తోసేయడంతో మీనా వెళ్లి అక్కడున్న ర్యాక్ కి గుద్దుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన బాలు నా పెళ్ళాన్ని కొడతావ్ రా నీ అంత చూస్తాను రా.. అని గుణ చేతులు విరగ్గొడతాడు. ఆ తర్వాత శివ మీనాకు గుణతో మాట్లాడనని మాట ఇస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మీనా కట్టుతో వచ్చిందని చూసిన ప్రభావతి ఏమైంది అని అడుగుతుంది.. ఏంటి ఇది కొత్తరకం డ్రామానా ఏంటి అని ప్రభావతి వచ్చి రాగానే అడుగుతుంది.. ఏం మాట్లాడుతున్నావ్ ప్రభ మీనా బండి మీద నుంచి కింద పడిపోయింది తలకి దెబ్బ తగిలింది. ఎప్పుడైనా మనిషిలాగ మాట్లాడు అని సత్యం అంటాడు. బండి ఉంది కదా అనేసి ఓవర్ గా వెళ్తే ఇలానే ఉంటుంది. పెద్ద దెబ్బ తగిలిందా ఏంటి అని వెటకారంగా మాట్లాడుతుంది ప్రభావతి.. మీనాని మొదటిసారి అలా అడగడంతో అందరూ షాక్ అవుతారు.. ఏంటి ఇలా జరిగింది ఏంటి ఈవిడ ఇలా అడుగుతుంది ఏంటి అని బాలు కూడా షాక్ అవుతాడు. అయితే మీనా మీద ఇలాంటి కాన్సల్ చూపించడంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా ఇంత మార్పు ఏంటి అని ఆలోచనలో పడతారు.

అయితే ఇప్పుడు వంట ఏం చేస్తున్నావు అని అడగడంతో సత్యం ప్రభా ఎలాంటి పరిస్థితిలో ఉందో నువ్వు ఆలోచించవా అని అడగడంతో.. సరే సరే అర్థమైంది ఆ వంట ఏదో చేసుకుంటాను.. ఎక్కడికి వెళ్లకుండా ఒక నాలుగు రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పండి. ఇప్పుడు వెళ్లి పడుకోమని చెప్పండి నేను వంట సంగతి చూస్తాను అని ప్రభావతి అనడంతో సత్యం ఇంత మంచి బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపోతాడు.. ప్రభావతి ఇంకా వంట గదిలోకి వెళ్లి వచ్చి ఏడాది కూడా అవలేదు వంటగది మొత్తాన్ని మార్చేసింది అని మీనా పై ఒకవైపు ప్రశంసలు కురిపిస్తూనే మరోవైపు ఎత్తి పొడుస్తుంది.

వంట గదిలో ఏవి ఎక్కడున్నాయో తెలుసుకొని వంట చేసే లోపల సత్యం ఎన్ని కష్టాలు. వచ్చాయి మీనా ఒక్క రోజు లేకుండా ఉంటే నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావా అని వెటకారంగా మాట్లాడతాడు. నువ్వు ఒక్కదానివే చేయడం ఎందుకు నీ ఇద్దరు కోడలు ఉన్నారు కదా మీనా కి బాగా లేనప్పుడైనా చెయ్యొచ్చు కదా అని సత్యం అంటాడు. వాళ్లు గొప్పింటి నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎలా చేస్తారండి అని సత్యంతో అంటుంది. ఆ తర్వాత మీనా కోసం పార్వతి బాధ పడిపోతూ ఉంటుంది.. ఏంటి ఇలా జరిగింది నా కూతురికి అని అనుకుంటుంది. శివ కి గుణ ఫోన్ చేసినా సరే తను ఎత్తకుండా ఉంటాడు. ఎందుకు శివ నా ఫోన్ ఎత్తడం లేదు ఇకమీదట నుంచి రాడా అని గుణ అనుకుంటాడు.

ఇక రోహిణి దినేష్ ని కలవడానికి వెళ్తుంది. అక్కడ దినేష్ ను ఎందుకు నా వెంట పడుతున్నావు అని నిలదీస్తుంది.. అయితే ఎప్పుడూ నువ్వు ఒంటరిగా రావా..? నీకు తోకగా ఈవిడ రావాల్సిందేనా అని రోహిణిని అడుగుతాడు దినేష్.. నా సంగతి పక్కన పెట్టు నువ్వేంటి నా కొడుకు దగ్గరికి వెళ్లావు. ఇంకొకసారి నా కొడుకు జోలికి వస్తే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇస్తుంది రోహిణి. నీ కొడుకు దగ్గరికి నేను వెళ్ళను నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. జైల్లో ఉన్నన్ని రోజులు నేను చాలా ఇబ్బందులు పడ్డాను ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత నాకు డబ్బుతో చాలా అవసరం పడింది. నా కొడుకుని వదిలిపెట్టి నన్ను వదిలిపెట్టాలంటే నీకేం కావాలో అడుగు అని రోహిణి అంటుంది..

నాకు పెద్దగా ఏమీ వద్దు ఎప్పటిలాగే నాకు నువ్వు డబ్బులు అవసరం అని తీర్చాలి. ఇదంతా కాదు ప్రతిసారి చిల్లర్ లాగా అడుక్కోవడం కాదు ఒకేసారి నాకు లైఫ్ సెటిల్మెంట్ అయ్యేలా చేయాలి అని దినేష్ అంటాడు. మరి నీకు ఎంత కావాలి అని రోహిణి అడుగుతుంది. ఈ చిన్నాచితగా డబ్బులు కాకుండా ఒకేసారి నాకు 30 లక్షలు కావాలని దినేష్ అనగానే రోహిణి దిమ్మ తిరిగిపోయే షాక్ అవుతుంది. ఏంటి 30 లక్షల నేను ఏమన్నా బ్యాంకు కి కన్నాలు వేస్తున్నానని అనుకుంటున్నావా..? ఏం మాట్లాడుతున్నావ్ కొంచమైనా ఆలోచించవా అని దినేష్ పై సీరియస్ అవుతుంది రోహిణి.. నువ్వేం చేస్తావో నాకు తెలియదు నీకు కొద్ది రోజులు మాత్రమే టైం ఇస్తున్న నాకు 30 లక్షలు ఇవ్వు ఆ తర్వాత నీ జోలికి రాను అని దినేష్ అంటాడు.

Also Read : మహాకు నిజం చెప్పిన తాయారు..కొట్టుకున్న చక్రీ, కేశవ.. మహేకు షాకిచ్చిన ఆది..

దినేష్ వెళ్ళిపోయిన తర్వాత విద్యా రోహిణి 30 లక్షల గురించి మాట్లాడుకుంటారు.. లక్ష రెండు లక్షలు అంటే మనోజ్ ని బురిడి కొట్టించి ఎలాగోలాగా తెచ్చి ఇవ్వచ్చు. ఎంతైనా నీ తింగరి మొగుడు కనిపెట్టేవాడు కాదు. 30 లక్షలు అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తావ్ ఏం చేస్తావ్? ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మీకే వచ్చి పడుతున్నాయని విద్య వెటకారంగా మాట్లాడుతుంది.. ఇదంతా కాదే ముందు వెళ్లి ఆ గుణాన్ని కలిసి అతని దగ్గర డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తాను అని రోహిణి అంటుంది. వీడ పీడ విరగడైపోతే మనోజ్ తో నేను చాలా సంతోషంగా ఉంటాను అని రోహిణి అంటుంది. ఇక రాత్రి భోజనానికి కూర్చున్న అందరూ కూడా ప్రభావతి వంటను చూసి ఏంటి ఇలా ఉంది అని అంటారు. మీ నాకు దెబ్బ తగిలింది కదరా ఈరోజు మీ అమ్మే వంట చేసింది అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అమ్మావతి వంట తినాలంటే అదృష్టం ఉండాలి రా అని బాలు అంటాడు.. శృతి మాత్రం ఎప్పటిలాగే ప్రభావతి వంటపై సెటైర్లు వేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

 

Related News

Bramhamudi Rudraani : ‘ బ్రహ్మముడి ‘ రుద్రాణి ఆస్తులు ఎన్ని కోట్లు..? హీరోయిన్లు సరిపోరు..

Podarillu Lalitha : ‘పొదరిల్లు’ మహా తల్లి రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Gundeninda GudiGantalu Today episode: పాపం ప్రభావతి.. బాలును అరెస్ట్ చేసిన పోలీసులు.. మనోజ్ ను కొట్టిన పోలీసులు..

Podarillu Today Episode : అడ్డంగా బుక్కయిన ప్రతాప్.. మాధవ్ దెబ్బకు మైండ్ బ్లాక్.. అన్నదమ్ముల సీన్ హైలెట్..

Illu Illalu Pillalu Today Episodes: గుడ్డిగా నమ్మిమోసపోయిన ధీరజ్.. పోలీస్ స్టేషన్ లో ధీరజ్.. నర్మదకు అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవని కోసం కన్నీళ్లు పెట్టుకున్న ఆరాధ్య.. నిజం చెప్పిన మీనాక్షి.. పల్లవికి కమల్ వార్నింగ్..

Karthika Deepam 2 Serial Today Episode June 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సుమిత్ర బర్తుడే పార్టీకి వెళ్లిన దక్షిణమూర్తి

Brahmamudi Serial Today Episode June 4th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సీఈవోగా ఇందు – ప్రకటించిన రేఖ 

Big Stories

×