E-Paper
Advertisement

Ilaiyaraaja Copyright: మాస్ట్రో ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ.. ఏం జరిగిందంటే?

Ilaiyaraaja Copyright: మాస్ట్రో ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ.. ఏం జరిగిందంటే?
Advertisement

Ilaiyaraaja Copyright: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు కాపీరైట్ వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు నుండి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తన అనుమతి లేకుండా తన సంగీతాన్ని వాడుతున్నారని గతంలో ఆయన పలువురిపై చట్టపరమైన చర్యలు తీసుకోగా, ఈసారి ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ‘సరిగమ’ దాఖలు చేసిన కేసులో కోర్టు ఆయనకు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 130 చిత్రాలకు సంబంధించిన పాటలను ఇళయరాజా వాణిజ్యపరంగా ఉపయోగించుకోకుండా, ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు లైసెన్స్‌లు ఇవ్వకుండా కోర్టు నిషేధం విధించింది.

Read also-Illu illaalu pillalu Prema : ‘ఇల్లు పిల్లలు పిల్లలు ‘ ప్రేమ ఆస్తులు విలువ ఎంతంటే..?.. బాగా సౌండే మావా..

Advertisement

సరిగమ సంస్థ వాదన ప్రకారం, గతంలో సినిమా నిర్మాతలు తమ చిత్రాలలోని పాటల హక్కులను (కాపీరైట్) ఒప్పందం ప్రకారం తమ సంస్థకు శాశ్వతంగా కట్టబెట్టారు. అయితే ఇళయరాజా ఆ పాటలపై తనకు హక్కులు ఉన్నాయని చెప్పుకుంటూ అమెజాన్ మ్యూజిక్, ఐట్యూన్స్, జియోసావన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లకు లైసెన్స్‌లు ఇస్తున్నారని, దీనివల్ల తమకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతోందని సరిగమ కోర్టును ఆశ్రయించింది. 1957 కాపీరైట్ చట్టం ప్రకారం ఒప్పందంలో వేరేలా పేర్కొంటే తప్ప, సాధారణంగా నిర్మాతకే మొదటి హక్కులు ఉంటాయని కోర్టు అభిప్రాయపడింది.

Read also-Horror Comedy OTT : పెళ్ళాం పోయాక సంతోషపడే మొగుడు… చచ్చినా వదలని ఆత్మ… క్లైమాక్స్ వరకు నవ్వులే

Advertisement

గతంలో కూడా ‘ఎన్ ఇనియ పొన్ నిలవే’ వంటి పాటల విషయంలో ఇళయరాజాకు, సరిగమకు మధ్య వివాదం నడిచింది. అప్పుడు కూడా కోర్టు సరిగమకే అనుకూలంగా తీర్పునిచ్చింది. తాజాగా వెలువడిన ఈ తీర్పుతో తన సంగీతంపై తనకే పూర్తి హక్కులు ఉండాలని పోరాడుతున్న మాస్ట్రోకు పెద్ద చిక్కు వచ్చి పడింది. ప్రస్తుతానికి వందకు పైగా సినిమాల పాటలపై ఆయనకు నియంత్రణ లేకుండా పోయింది, ఇది ఆయన న్యాయపోరాటంలో ఒక కీలక మలుపుగా మారింది. ఇంతకు ముందు ఇళయరాజా పలువురు తమ పాటలను వాడుకున్నారని వారికి నోటీసులు పంపిన విషయం తెలిసిందే.

Related News

నోరు జారితే అంతే.. నెక్స్ట్ స్కిట్‌లో నో ఛాన్స్! జబర్దస్త్ సీక్రెట్ లీక్ చేసిన నటి సత్యశ్రీ

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

Big Stories

Advertisement
×