Podarillu Today Episode February 17th: నిన్నటి ఎపిసోడ్ లో.. కన్నా మహాలక్ష్మి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.. ఇంకా భోజనం చేద్దామని కన్నా అడగడంతో మహాలక్ష్మి కూడా భోజనం చేద్దామని అంటుంది. కేశవ ఇంటికి వస్తాడు అయితే మహాలక్ష్మిని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకతనాల పారిపోతున్నాడు. అతను మళ్లీ సాయంత్రమే ఇంటికి రావాలి కదా అని మహా అడుగుతుంది.. మీపై అరిచాడు కదా ఇక ఇప్పటిలో రాడు అని కన్నా అంటాడు. మనము తినడానికి ఆమ్లెట్ వేసుకోమని చెప్పాడు.. మీరు వేస్తారని అడిగితే నాకు ఆమ్లెట్ తినడం ఇష్టం కానీ వేయడం రాదు అని మహాలక్ష్మి అంటుంది.. ఓ మీకు ఇది కూడా వేయడం రాదా అయితే నేను వేస్తాను మీరు ఉల్లిపాయలు కట్ చేయండి అని కన్నా అంటాడు.. అయితే మహాలక్ష్మి కట్ చేస్తుంటే ఇట్లా కట్ చేస్తే సాయంత్రం అవుతుందేమో నేను కట్ చేస్తాను ఇవ్వండి అని చకచకా కట్ చేసి ఆమ్లెట్ వేస్తాడు.. కన్నా ఫ్యామిలీ స్టోరీ విని మహాలక్ష్మి ఎమోషనల్ అవుతుంది. ఇక తర్వాత కేశవ మహాలక్ష్మికి ఇచ్చిన గిఫ్ట్ చూసి తను చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఆది మహాలక్ష్మి పరిస్థితిని ఇంట్లో వివరించి బాధపడతాడు. లళిత కూడా తన కూతురు అలాంటి ఇబ్బందులు పడుతుందని బాధపడుతుంది. మహాలక్ష్మికి మస్కిటో కాయిల్ ఆల్ అవుట్ అలాగే బ్యాటు అన్ని తెచ్చి చెక్రి ఇస్తాడు. వాటిని మళ్లీ బయటకు తీసుకొచ్చిన మహా వాళ్ళందరూ ముందే ఇవ్వడంతో అందరూ కలిసి చక్రిని కొడతారు. ఇక తర్వాత రోజు మహాలక్ష్మి బయట బట్టల ఆరెస్తూ ఉంటె తాయారు అక్కడికి వస్తుంది.. మహాలక్ష్మి ని ఎలాగైనా సరే ఇంట్లో విషయాలు అని చెప్పి బయటికి పంపించాలని అనుకుంటుంది. ఆ ఇంటి గురించి ఊర్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్న విషయాన్ని మహాలక్ష్మి బయటపెడుతుంది.. అయితే తాయారు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతేనే నీ జీవితం బాగుంటుంది అని చెప్పడంతో అది విన్న నారాయణ తాయారు పై గ్లాస్ విసిరేస్తాడు..
నా కోడలికి లేనిపోనివి నూరిపోస్తున్నావా నీకు కొంచమైనా బుద్ధి లేదా అని నారాయణ తాయారుని తిడతాడు.. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు ఫస్ట్ నీ మొగుడు దుబాయ్ లో ఏం చేస్తున్నాడో అది ఆలోచించు. ఆ తర్వాత మా గురించి ఏం చేయాలో ఆలోచించవచ్చు అని అంటాడు.. ఆ మాటతో తాయారు నా మొగుడు ఎలాంటోడు నాకు తెలుసు ముందు నీ ఇంటి గురించి నీ కోడలికి చెప్పు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తాడు తెగిపోవడంతో మహాలక్ష్మి దాన్ని కడుతూ ఉంటుంది. అక్కడికి వచ్చిన కేశవ నేను కడతాను అని అంటాడు..
ఆ తర్వాత మాధవ చక్రీని ఎక్కడికి వెళ్ళలేదు ఏంటి అని అడుగుతాడు. కేశవ నువ్వు ఇప్పుడు ఒంటరి వాడివి కాదు పెళ్లయింది ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకుండా ఉంటేనే బాగుంటుంది అని అంటాడు.. నాకు ఆ విషయం తెలుసు కానీ ఇప్పుడు నువ్వు నా గురించి ఏమీ అనొద్దు అని అనగానే.. నువ్వెందుకు ఇప్పుడు డ్రైవర్ గా పోలేదురా అని మాధవి అడుగుతాడు. ఈ సిచువేషన్ కి సింక్ అయ్యేలా పెట్టిన పాట అందరిని అలా కనెక్ట్ ఎలా చేస్తుంది.. ఏంటి ఉద్యోగం పోయిందా ఎందుకురా ఏమి ఏం చేసావ్ మల్లి అని మాధవ్ అడుగుతాడు.. నేనేమీ చేయలేదన్నయ్యా ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఆ కారేశ్వర్ కి వారిని కి ఇచ్చాడట..
అతనికి కేవలం యాక్సిడెంట్ చేసి బిల్లులు పెట్టే వాళ్ళు మాత్రమే కావాలంట నాలాగా జాబ్ చేసే వాళ్ళు అవసరం లేదట. పోనీలే అన్నయ్య ఇది కాకపోతే ఇంకొకటి వస్తుంది అని చక్రి అంటాడు.. ఒకప్పుడంటే నువ్వు ఖాళీగా ఉన్న అన్నయ్య ఇచ్చేవాడు కానీ ఇప్పుడు నీ జీవితంలో ఒక అమ్మాయి ఉంది ఆ సంగతి నువ్వు మర్చిపోతున్నావేమో అని కేశవ అంటాడు. నీ రిసెప్షన్ కి ఎంత ఖర్చయిందో తెలుసా? అలాంటిది ఇప్పుడు నువ్వు జాబ్ మానేసి ఇంట్లో కూర్చుంటే అది ఎలా తీరుతుంది ఆలోచించవా అని కేశవ అంటాడు. నా రిసెప్షన్ నేను చేయమని అడగలేదు కదా మరి ఎందుకు చేశారు అని చక్రి కేశవ తో గొడవకి దిగుతాడు. ఇద్దరూ కలిసి ఇంట్లోని వస్తువులను విసురుకుంటూ బాగా గొడవపడతారు. మహాలక్ష్మి వస్తుందని తెలుసుకున్న వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటున్నట్లు నటిస్తారు.
ఇక తర్వాత నేను కర్ణ తో బయటికి వెళ్లాలనుకుంటున్నాను అని చక్రితో అంటుంది మహా.. కన్నా ని తీసుకుని బయటికి వెళ్లి ఒక సిమ్ కావాలని అడుగుతుంది. అక్కడ ఐడి ప్రూఫ్ అడగ్గానే నా దగ్గర లేవు అని అంటుంది. అయితే కన్నా నా దగ్గర ఉన్నాయి నా ప్రూఫ్ తో సిమ్ తీసుకోండి అని అంటాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి రాగానే అప్పుడే నారాయణ అక్కడ తినేసి వంటగది మొత్తం చండాలంగా తయారు చేసి వెళ్తాడు. అది చూసిన మహా ఏంటి ఇంత ఇదిగా చేయాలా తిన్న తర్వాత ఎక్కడో అక్కడ పెట్టాలని మీ నాన్నకు తెలియదా అని అరుస్తుంది.. మా నాన్న గురించి తెలిసింది కదా వదినా అందుకే మేము ఎవరు పట్టించుకోము నేను చదువుతాను అని అనగానే.. నేను కూడా నీకు సాయం చేస్తాను అని మహా అంటుంది..
Also Read:<పల్లవి ప్లాన్ గ్రాండ్ సక్సెస్.. హాస్పిటల్ లో అభి.. పల్లవికి కొత్త టెన్షన్..
సిమ్ యాక్టివేట్ అయినట్లు మెసేజ్ రావడంతో మహాలక్ష్మి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. వెంటనే వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తే వాళ్ళ నాన్న నా కూతురు ఒకప్పుడు ఉండేది అమ్మ ఇప్పుడు లేదు ఆమె చచ్చిపోయింది అని చెప్పగానే మహాలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయితే ఇంట్లోనే వాళ్ళందరూ కూడా మహాలక్ష్మి ఏ కష్టం వచ్చి ఫోన్ చేసిందో అర్థం చేసుకోరా అని ప్రతాప్ ని ఎంతగా బ్రతిమిలాడినా సరే.. అతను మాత్రం ఇక చాలు ఆపండి అని కోపంగా అంటాడు. మహా తన వాళ్లు అన్న విషయాన్ని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది.. చక్రి మహా దగ్గరికి వచ్చి ఏమైందో అని అడుగుతాడు ఆ విషయం చెప్పి తను చాలా ఫీల్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో మాధవ్ పెళ్లిచూపులు గురించి మహాలక్ష్మి మాట్లాడుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..