BigTV English

Gundeninda GudiGantalu Today episode: పుట్టింట్లో గుండెలనిండా భాదను నింపుకున్న మౌనిక.. సంజూ పై సువర్ణ సీరియస్..

Gundeninda GudiGantalu Today episode: పుట్టింట్లో గుండెలనిండా భాదను నింపుకున్న మౌనిక.. సంజూ పై సువర్ణ సీరియస్..

Gundeninda GudiGantalu Today episode February 17th: నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్ పనిచేస్తున్న షో రూమ్ అనగానే ప్రభావతికి ఫ్యూజులు అవుట్ అవుతాయి. మనోజ్ కు ఈ విషయం చెప్పాలని ప్రభావతి శత విధాల ప్రయత్నిస్తుంది. కానీ మనోజ్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చెయ్యడు. వీడు కొంప కొల్లేరు చేసేలా ఉన్నాడే అని ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. మా అమ్మ మీద అలిగాను ఫోన్ లిఫ్ట్ చెయ్యను అని అంటాడు. ఇక మౌనిక జాబ్ కి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళ అత్తయ్య వచ్చి ఏమైందమ్మా మీ ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారా అని అడుగుతుంది. లేదు అత్తయ్య జాబ్ కి రమ్మని అంటున్నారు. పెళ్లికి ముందైతే ఆయన చేసుకోవచ్చని అన్నాడు అత్తయ్య ఇప్పుడైతే మరియు ఒప్పుకుంటాడో లేదో అనగానే ఇక సువర్ణ కూడా వాడు ఇప్పుడు ఒప్పుకుంటాడు అంటావా అనేసి అంటుంది అప్పుడే. సంజు అక్కడికి వచ్చి ఏంటి మీరిద్దరి ముచ్చట్లు పెట్టుకున్నారు అనగానే సువర్ణ జాబ్ కి వెళ్లాలనుకుంటుంది రా అనగానే  అవసరం లేదు. ఇంట్లో పనిమనిషి మాన్పిచ్చి అన్ని పనులు చేయించు నేను వచ్చిన వాళ్ళు ఎలాగో పనిమనిషి అనుకున్నారని అంటాడు. నేను జాబ్ చేస్తానంటే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీరు చేయొచ్చు అని అన్నారు కదా మరి ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నారు అంటే. ఇప్పుడు నిన్ను ట్రాప్ చేయడానికి నేను ఏదో అలా వాగేసాను. ఇప్పుడు అవసరం లేదు మొగుడు ఖాళీగా ఉంటే నువ్వు జాబ్ చేయడానికి వెళుతున్నావంటే ఆఫీసులో నీకు నచ్చిన వాడు ఎవడో ఉన్నాడా అని అనుమానపడతాడు.. నీకు నచ్చిన వాడెవడో ఉన్నాడు కదా అందుకే ఆఫీస్ కి వెళ్ళాలి అనుకుంటున్నావా అలాంటివేమి అవసరం లేదు నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని అంటాడు దానితో మౌనిక కన్నీళ్లు పెట్టుకుంటుంది.. రవి, శృతిని ఎలాగోలా మ్యానేజ్ చేస్తాడు మనోజ్.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మనోజ్ రవి, శృతి లను మ్యానేజ్ చేస్తాడు. మనోజ్ ఇంటికి వస్తాడు. ప్రభావతి కాఫీ తెచ్చేస్తుంది అలాగే కారాలు మిరియాలును నూరుతుంది. త్వరలోనే జాబ్ తెచ్చుకోకపోతే నీ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు మేనేజ్ చేయడానికి కూడా నావల్ల కాదు ఇంక నీ ఇష్టం అనేసి అంటుంది. నీకు జాబ్ లేదన్న విషయం ముందు శృతికి తెలిస్తే రోహిణికి నీకు ముందు తానే విడాకులు ఇప్పిస్తుంది అన్నట్లు ప్రభావతి వార్నింగ్ ఇస్తుంది. ఇక బాలు గదిలో ఉండడం చూసి మీనా ఏమైందండీ అప్పుడే వచ్చేశారు ట్రిప్ కు వెళ్లలేదా అని అడుగుతుంది. లేదు మౌనిక ఆఫీస్ దగ్గరికి వెళ్లాను అనగానే మరి మౌనికతో మాట్లాడారాఅని అడుగుతుంది.. ఎలా ఉన్నావ్ మౌనిక కానీ మౌనిక జాబ్ చేయట్లేదు. జాబ్ మానేసింది అంట అని అనగానే అవునా జాబ్ అంటే మౌనికకి ఇష్టం కదా మరి ఎందుకు మానేసింది అని మీనా అంటుంది. ఇక మౌనికను ఎలాగైనా చూడాలని బాలు బయటికి వెళ్తాడు. ఇంట్లోని వాళ్ళందరూ బాలుని ఆపడానికి ప్రయత్నం చేస్తారు..

సత్యం మాత్రం బాలుని వెళ్లడానికి వీలు లేదని చెప్తాడు. మీకు ఒక్కరికైనా మౌనికను చూడాలని ఉందా పెళ్లి చేసి చేతులు దులుపుకున్నారు ఆ తర్వాత ఎలా ఉంది ఇంతకీ ఆ మనిషి ఎలా చూసుకుంటున్నాడు ఇలాంటివన్నీ అడిగే పనే లేదు కదా అనేసి అందరినీ పేరుపేరునా తిట్టిపోస్తాడు. మరో వైపు సడన్గా మౌనిక పుట్టింటికి రావడంతో.. షాక్ అవుతారు. ఈ సమయంలో అత్తవారింట్లో ఎలా ఉందని, సంజు ఎలా చూసుకుంటున్నాడని అడుగుతారు. అసలు విషయం చెప్పకుండా మౌనిక దాచిపెడుతుంది. తనని మహాలక్ష్మిలా చూసుకుంటున్నారని అబద్దం చెబుతుంది. ఈ సమయంలో బాలు తన చెల్లెలితో మాట్లాడుతూ.. జాబ్ ఎందుకు మానేశావని అడుగుతాడు. సత్యం కూడా ఈ విషయంపై మాట్లాడుతూ పెళ్లికి ముందు జాబ్ చేసుకోవచ్చని చెప్పారు కదా ఇప్పుడు ఇలా చేయడం ఏంటి అని ప్రశ్నిస్తాడు. మరోవైపు శృతి మాట్లాడుతూ సంజు సైకో లాగా ప్రవర్తించడం లేదు.. కదా అని డైరెక్ట్ గా అడిగి చేస్తుంది. ఇలా వరుసగా ఒకరి తర్వాత మౌనిక అత్తగారి ఇంటి గురించి అడిగి తెలుసుకుంటారు.


రోహిణి, శృతి.. మౌనికా నిజంగానే అత్తవారింట్లో బాగుంటుందా అని ప్రశ్నించారు. అందరికీ తాను బాగానే ఉన్నానంటూ సర్దిచెప్పుతుంది. ఇక బాలు మాత్రం చెల్లెలుతో మాట్లాడకుండా అలాగే ఉంటాడు. అసలు నువ్వు జాబ్ ఎందుకు మానేవ్ అని అడుగుతాడు. అత్తవారింట్లోనే తమ బిజినెస్ అకౌంట్స్ చూస్తున్నానని.. అందుకే జాబ్ మానేసినట్టు చెప్తారు. పుట్టింటిలో భోజనం చేసి బయల్దేరుతుంది.. అందరితో సరదాగా గడిపుతుంది. ఇకగుండెనిండా బాధను పెట్టుకొని పుట్టింటి వారికి ఒక్క మాట కూడా చెప్పకుండా తిరిగి వెళ్లిపోతుంది మౌనికా. కానీ మనస్సులో మాత్రం బాలు అన్న చెప్పినా వినకుండా పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పు అయ్యిందని భావిస్తుంది. ఇక మౌనికా తిరిగి అత్తవారింటికి వెళ్లగానే భర్త సంజూ ఎక్కడికి వెళ్లావని అడుగుతాడు. మౌనిక బయటికి వెళ్లానని చెప్తుంది. కానీ సంజూ మాత్రం పుట్టింటికా? ఇంకెవరినో కలిసేందుకా? అని అనుమానిస్తాడు..

గుడికి వెళ్లిందని సువర్ణ చెప్తుంది. చేతులు పూలు గాని కొబ్బరికాయ గాని ఏమీ లేదు మరి ఎలా గుడికి వెళ్ళింది అనేసి అనుమానిస్తాడు సంజు.. కానీ కారు డ్రైవర్ మాత్రం గుడికే వెళ్లిందని, పూలు, కొబ్బరికాయలున్న బుట్టను తీసుకొచ్చి చూపిస్తాడు. దాంతో నమ్మిన సంజూ, మామ చెప్పి వెళ్లాలని తెలియదా? ఇంకోసారి ఎక్కడికి వెళ్లినా నేను చెప్పేవరకు వెళ్లకూడదని కండీషన్ చెప్తాడు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే రవి శృతిలు మనోజ్ గురించి సీక్రెట్ తెలిసిందంటూ బాంబ్ గెలుస్తారు.. మేము కార్ షోరూం కి వెళ్తే మీ హస్బెండ్ పేరే తెలియదని అక్కడ వాళ్ళు అన్నారని శృతి, రోహిణితో చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో శృతి మీనాకు డబ్బులు ఇస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×