BigTV English

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ ను ఇరికించిన ప్రభావతి.. బాలు ప్రేమకు మీనా ఫిదా..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ ను ఇరికించిన ప్రభావతి.. బాలు ప్రేమకు మీనా ఫిదా..

Gundeninda GudiGantalu Today episode February 18th: నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్ రవి, శృతి లను మ్యానేజ్ చేస్తాడు. మనోజ్ ఇంటికి వస్తాడు. ప్రభావతి కాఫీ తెచ్చేస్తుంది అలాగే కారాలు మిరియాలును నూరుతుంది. త్వరలోనే జాబ్ తెచ్చుకోకపోతే నీ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు మేనేజ్ చేయడానికి కూడా నావల్ల కాదు ఇంక నీ ఇష్టం అనేసి అంటుంది. నీకు జాబ్ లేదన్న విషయం ముందు శృతికి తెలిస్తే రోహిణికి నీకు ముందు తానే విడాకులు ఇప్పిస్తుంది అన్నట్లు ప్రభావతి వార్నింగ్ ఇస్తుంది. ఇక బాలు గదిలో ఉండడం చూసి మీనా ఏమైందండీ అప్పుడే వచ్చేశారు ట్రిప్ కు వెళ్లలేదా అని అడుగుతుంది. లేదు మౌనిక ఆఫీస్ దగ్గరికి వెళ్లాను అనగానే మరి మౌనికతో మాట్లాడారాఅని అడుగుతుంది.. ఎలా ఉన్నావ్ మౌనిక కానీ మౌనిక జాబ్ చేయట్లేదు. జాబ్ మానేసింది అంట అని అనగానే అవునా జాబ్ అంటే మౌనికకి ఇష్టం కదా మరి ఎందుకు మానేసింది అని మీనా అంటుంది. ఇక మౌనికను ఎలాగైనా చూడాలని బాలు బయటికి వెళ్తాడు. ఇంట్లోని వాళ్ళందరూ బాలుని ఆపడానికి ప్రయత్నం చేస్తారు.. సత్యం మాత్రం బాలుని వెళ్లడానికి వీలు లేదని చెప్తాడు. మీకు ఒక్కరికైనా మౌనికను చూడాలని ఉందా పెళ్లి చేసి చేతులు దులుపుకున్నారు ఆ తర్వాత ఎలా ఉంది ఇంతకీ ఆ మనిషి ఎలా చూసుకుంటున్నాడు ఇలాంటివన్నీ అడిగే పనే లేదు కదా అనేసి అందరినీ పేరుపేరునా తిట్టిపోస్తాడు. మరో వైపు సడన్గా మౌనిక పుట్టింటికి రావడంతో.. షాక్ అవుతారు. ఈ సమయంలో అత్తవారింట్లో ఎలా ఉందని, సంజు ఎలా చూసుకుంటున్నాడని అడుగుతారు. అసలు విషయం చెప్పకుండా మౌనిక దాచిపెడుతుంది. తనని మహాలక్ష్మిలా చూసుకుంటున్నారని అబద్దం చెబుతుంది. ఈ సమయంలో బాలు తన చెల్లెలితో మాట్లాడుతూ.. జాబ్ ఎందుకు మానేశావని అడుగుతాడు. ఇది ఇంటికి వెళ్ళగానే సంజూ మౌనికను ప్రశ్నలు వేస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మౌనికా తిరిగి అత్తవారింటికి వెళ్లగానే భర్త సంజూ ఎక్కడికి వెళ్లావని అడుగుతాడు. మౌనిక బయటికి వెళ్లానని చెప్తుంది. కానీ సంజూ మాత్రం పుట్టింటికా? ఇంకెవరినో కలిసేందుకా? అని అనుమానిస్తాడు.. గుడికి వెళ్లిందని సువర్ణ చెప్తుంది. చేతులు పూలు గాని కొబ్బరికాయ గాని ఏమీ లేదు మరి ఎలా గుడికి వెళ్ళింది అనేసి అనుమానిస్తాడు సంజు.. కానీ కారు డ్రైవర్ మాత్రం గుడికే వెళ్లిందని, పూలు, కొబ్బరికాయలున్న బుట్టను తీసుకొచ్చి చూపిస్తాడు. దాంతో నమ్మిన సంజూ, మామ చెప్పి వెళ్లాలని తెలియదా? ఇంకోసారి ఎక్కడికి వెళ్లినా నేను చెప్పేవరకు వెళ్లకూడదని కండీషన్ చెప్తాడు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే రవి శృతిలు మనోజ్ గురించి సీక్రెట్ తెలిసిందంటూ బాంబ్ గెలుస్తారు.. మేము కార్ షోరూం కి వెళ్తే మీ హస్బెండ్ పేరే తెలియదని అక్కడ వాళ్ళు అన్నారని శృతి, రోహిణితో చెప్తుంది.. అక్కడ తెలియని వాళ్ళతో మనోజు ఇంగ్లీషులో తెగ అరిచేసాడు అందరూ షాక్ అయ్యారు అంత గొప్ప వాళ్ళు అనేసి రవి శృతిలు మనోజ్ గురించి గొప్పగా పొగిడేస్తారు. మీ ఆయన సేల్స్ మేనేజర్ గా కాదు ఏకంగా షోరూం కి హెడ్ గా ఉండొచ్చు అనేసి శృతి అంటుంది. దానికి ప్రభావతి అవును కదమ్మా ఒక షో రూమ్ పెట్టించొచ్చు కదా మీ నాన్నకు చెప్పేసి అంటుంది.. ఇక సత్యం మీ అత్తయ్య ఇన్ని రోజులు అడుగుతుంది.. దానికి రోహిణి అవునండి మా ఎప్పుడు ఇక్కడికి రాలేదు కదా అందుకే నేను కూడా ఫోన్ మాట్లాడడం మానేశాను ఆయనకి దూరంగా ఉండాలని అనుకుంటున్నాను అని అంటుంది.

ఇక మనోజ్ కి మసాలా వాసన వస్తుందని అంటాడు దాన్ని చూసిన బాలు నువ్వు కుక్కవైపు పుట్టాల్సింది రా మనిషివై పుట్టావు ఏదో జన్మలో ముక్కు బాడీ అక్కడ వదిలేసి కుక్క ముక్కు మాత్రమే తెచ్చుకున్నట్టున్నావు అనేసి అంటాడు. తన భార్య మీర కోసం తీసుకొచ్చానంటూ బాలు సమాధానం ఇస్తాడు. ఈక్రమంలో ఎవరి కడుపు వారు చూసుకుంటున్నారంటూ.. నా భార్య మాత్రం తింటుందా లేదా అని ఎవరూ అడగటం లేదని ప్రశ్నిస్తారు. వెంటనే మీనాను వాళ్ల బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లి చికెన్ తినమని చెబుతుంటాడు. భార్యభర్తలుగా ఒకరిపై ఒకరు ప్రేమ వర్షాన్ని కురిపించుకున్నారు. కట్ చేస్తే.. ప్రభావతి-సత్యం మధ్య చిన్న ఘర్షణ మొదలైంది. ఉగాదికి వాళ్ల అమ్మగారి ఇంటికి వెళ్లాలి అంటూ ప్రభావతి తో చెప్పారు. అదే సమయంలో మనోజ్-రోహిణిని కూడా తప్పకుండా రావాలంటాడు తండ్రి సత్యం. కానీ వారిద్దరూ తటపటాయిస్తూ సరే అంటారు. రోహిణి మాత్రం పార్లర్ వదిలిపెట్టి అన్ని రోజులు అంటే కష్టం అంటి అనేసి అంటుంది. అదేముందమ్మ పనులు చూసుకుంటారులే అని రోహిణి అనగానే నేనే అక్కడ ఒక పని దానిలాగా పని చేస్తున్నాను ఇన్ని రోజులు ఉంటే నా ఉద్యోగం పోతుంది నేను ఏమని అది చెప్పుకోవాలి అనేసి అంటుంది.


ఈ విషయాన్ని శృతిరవిలకు కూడా చెప్పాలి వాళ్ళని కూడా ఎలాగైనా రమ్మని చెప్పాలి పెళ్లయిన తర్వాత ఎక్కడికి తీసుకుపోలేదు కదా ఇది అలా వెళ్ళినట్టు ఉంటుందనేసి అంటాడు సత్యం. పొట్టి బట్టలతో హాల్ లోకి దోమల బ్యాట్ తీసుకొచ్చి దోమలు తెగ ఇబ్బంది పెడుతున్నాయంటూ వాటిని చంపేస్తాననంటూ పరోక్షంగా బెదిరిస్తూ ఉంటుంది. కానీ ఆమె బట్టలపై మీనా అభ్యంతరం తెలుపుతుంది. శృతికి మాత్రం అలాంటి బట్టలే కంఫర్ట్ గా ఉంటాయని తెగేసి చెప్పింది. అత్త ప్రభావతి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు. ఇక మీనా పక్కకు తీసుకెళ్లి అర్థమయ్యేలా చెప్పింది. అత్తవారింట్లో ఉన్నప్పుడు కాస్తా పద్ధతిగా ఉండాలని, దాని ద్వారా మనకే మరింత మర్యాద పెరుగుతుందని చెబుతుంది. పుట్టింట్లో మెదిలినట్టు ఉంటే కుదరదని, చూసేవాళ్లకు కూడా ఇబ్బంది ఉండకూడదని, మనల్ని ఎవరూ తక్కువ చేసి చూడకూడదని చెప్పుకొస్తుంది.. ఇక మీనా మాట విని శృతి తన డ్రెస్ ని మార్చుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో శృతి మీనాకు డబ్బులు ఇస్తుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Nindu Noorella Saavasam Serial Today August 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను తిట్టిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌

Gundeninda GudiGantalu Today episode: నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Big Stories

×