Sudigali Sudheer:సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer).. మల్టీ టాలెంటెడ్ గా పేరు దక్కించుకున్న ఈయన గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మెజీషియన్ గా కెరియర్ మొదలుపెట్టి.. మ్యాజిక్ చేస్తూ అందరి మనసులు దోచుకున్నారు. జబర్దస్త్ (Jabardast) లోకి అడుగుపెట్టి అక్కడ తన టాలెంట్ నిరూపించుకున్న ఈయన.. కమెడియన్ గా, యాంకర్ గా, హీరోగా కూడా భారీ పాపులారిటీ అందుకున్నారు. ఒక స్టార్ అయినా సరే చాలామంది లాగే ఈయన కూడా కష్టాలు పడి పైకి వచ్చారు. ఇక ఇప్పుడు భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇప్పటికే నాలుగైదు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన సుధీర్ ఇప్పుడు ‘ గోట్ ‘ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ క్రమంలోనే గత నాలుగు రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. దానిని లెక్కచేయకుండా తన సీనియర్ నటుడైన ధనరాజ్ (Dhanraj) నటించి, దర్శకత్వం వహించిన ‘రామం, రాఘవం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు.
నా మొదటి సంపాదన ఎలా వచ్చింది? ఏం చేశానంటే?
ఇక ఈ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన సుధీర్ ను యాంకర్ ప్రశ్నిస్తూ.. మీ నాన్నతో మీకున్న మోస్ట్ మెమర్బుల్ మూమెంట్ ఏంటి? అని అడిగారు. ఎందుకంటే ఈ సినిమా తండ్రీకొడుకుల కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో సముద్రఖని (Samudra khani) ధనరాజ్ మరొకసారి తమ నటనతో ప్రేక్షకులను మెప్పించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే యాంకర్ ఈ ప్రశ్న అడిగారు. ఇక దీనికి సుధీర్ సమాధానం చెబుతూ..” నేను మ్యాజిక్ నేర్చుకున్నాక.. మొదటిసారి ఒక స్కూల్లో మ్యాజిక్ షో చేశాను. అప్పుడు పిల్లలందరి దగ్గర నుంచి ఆల్మోస్ట్ నాకు 93 రూపాయలు వచ్చాయి. షో అయ్యాక ఇంటికి రిక్షాలో వెళ్లి డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం అని.. నడుచుకుంటూనే నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. ఇక ఆ 93 రూపాయలను నేను మా నాన్నకు ఇచ్చాను. అదే నా లైఫ్ లో మర్చిపోలేని మూమెంట్” అంటూ తెలిపారు సుధీర్. అలా పిల్లలందరూ కలిసి ఇచ్చిన అమౌంట్ దగ్గర నుంచి ఇవాళ లక్షలు, కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగారు సుధీర్. మొత్తానికి అయితే సుధీర్ చేసిన కామెంటు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా పిల్లలు అందించిన ఆ డబ్బే ఆశీర్వాదంగా మారి.. ఆయనకు అదృష్టం వరించింది. అవే ఇప్పుడు కోటేశ్వరుడిని చేశాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సుధీర్ సినిమాలు..
సుధీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం హీరోగా గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్) అనే సినిమా చేస్తున్నారు. ఇందులో తమిళ బ్యూటీ దివ్యభారతి (Divyabharathi) హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్,సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే సుధీర్ నుంచి వచ్చే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక సుధీర్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా ఏళ్లు అవుతున్నా.. పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు. ఇప్పటికే తన తమ్ముడికి పెళ్లయి, పిల్లలు కూడా పుట్టారు. దీంతో సుధీర్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని అభిమానులు సైతం చాలా ఆత్రుతగా ప్రశ్నిస్తూ ఉంటారు.