E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలుకు సత్యం వార్నింగ్.. బాలుకు కోపం తెప్పించిన శృతి..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు సత్యం వార్నింగ్.. బాలుకు కోపం తెప్పించిన శృతి..
Advertisement

Gundeninda GudiGantalu Today episode January 20th : నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు పాలు తాగడంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. తమ్ముడు శోభనానికి ఎందుకురా ఇంతగా అడ్డుపడుతున్నాడని అంటుంది. దానికి కోపడ్డ బాలు వాడిని ఇంట్లోకి రానీయడమే ఎక్కువ మళ్ళీ ఇదొకట అది కూడా నా.. నా రూమ్ లోనే అని శోభనం అనేసి వెళ్ళిపోతాడు. నేను పైకి వెళ్తున్నాను మీ చావేదో మీరు చావండి అని బాలు పైకి వెళ్ళిపోతాడు. బాలు దగ్గరికి రవి వస్తాడు. చూడగానే బాలు కోపంతో మాట్లాడుతాడు. నీవల్లే ఇదంతా జరిగింది మా పరువును తీసేసావ్ నాన్నకు గుండెపోటు రావడానికి నువ్వే కారణం అని నోటికి వచ్చినట్లు తిట్టేస్తాడు. కొట్టడానికి ట్రై చేస్తాడు అంతలోకే మనోజ్ వచ్చి రవికి సపోర్ట్ చేస్తాడు.. నీవల్లే ఇంట్లో గొడవలు జరిగేది నువ్వు తాగొచ్చి నాన్నను రెచ్చగొట్టుకున్న అంటే అది జరిగేది కాదు అని మనోజ్ రవిని సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు. అది విన్న మనోజ్ ని కూడా కలిపి తిడతాడు. నీకు ఈ రోజు శోభనం కాదురా జరిగేది వేరేది జరుగుతుందని తన గదికి తాళం వేసుకొని బయటకు వెళ్ళిపోతాడు బాలు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. రవి, శృతిల శోభనం కోసం ప్రభావతి హడావిడి చేస్తుంది. అస్సలు ఇష్టం లేదన్నట్టు ప్రవర్తిస్తాడు బాలు. మీనా నచ్చచెప్పి బాలుని ప్రతిసారి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇక బాలు రవి శృతిల శోభనం ఎలాగైనా జరక్కుండా ఆపాలని కంకణం కట్టుకుంటాడు.. గదిలో స్వీట్లు పూలు అన్నీ రెడీ చేసి ప్రభావతి పెట్టేస్తుంది. ఈ బండోడు శోభనం గదిలోకి తీసుకెళ్లాల్సిన పాలను తాగినట్టే అక్కడ ఉన్న స్వీట్లు పండ్లు అన్ని తినేసాడేమో నేను వెళ్లి ఒకసారి చూసి వస్తానని ప్రభావతి అంటుంది. పైకెళ్లగానే ప్రభావతికి షాక్ తగులుతుంది. బాలు గదికి తాళం వేసుకొని బయటకు వెళ్ళిపోతాడు. మీనా ప్రభావతి దగ్గరికి వెళ్లి ఎందుకు అత్తయ్య అలా అరిచారని అడుగుతుంది. నీ గదిని ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పచ్చు కదా ఎందుకిలా నువ్వు తాళం వేసుకున్నావ్ అనేసి అరుస్తుంది ప్రభావతి. మీనా నేను మాత్రం వేయలేదు అత్తయ్య నాకు తెలియదు ఒకవేళ మీ అబ్బాయి ఏమైనా వేసారేమో అని అనుకుంటారు.

Advertisement

మీనా ప్రభావతిలు ఇద్దరు అసలు ఈ తాళం ఎవరేసారు ఎందుకేసారు వాళ్ళు వచ్చే టైం అయింది ముహూర్తానికి టైం అయినప్పుడు ఇలా జరిగింది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. గదికి తాళం వేసుకొని వెళ్లిపోతాడు ఇంట్లో వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా బాలు లిఫ్ట్ చేయడు. చివరకు సత్యం వచ్చి ఫోన్ చేస్తే బాలు ఫోన్ మాట్లాడుతాడు. తాళం చెవిని మీనాక్షిస్తాడు. తాళం తెరిచి అన్ని సిద్ధం చేస్తారు ప్రభావతి మీనా. ఇక బయటకు వెళ్ళిపోతాడు బాలు.. రవి శృతిలను అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోమని ప్రభావతి కిందకు తీసుకొస్తుంది. బాలు ఎక్కడ అంటే బాలు బయట ఉన్నాడు మామయ్య అని మీనా అంటుంది. బాలుని మీనా బలవంతంగా లోపలికి తీసుకొని వస్తుంది. వాళ్లని ఆశీర్వదించాలి అని సత్యం అంటాడు. అది విన్న బాలు మీరందరూ ఉన్నారు కదా మంచివాళ్లు మీరు ఆశీర్వదిస్తే చాల్లే నేను ఎందుకు అని అనగానే శృతి మీరందరూ ఆశీర్వదించారు కదా ఇంకెవరి ఆశీర్వాదాలు కోసం నేను అడుక్కోవాల్సిన అవసరం నాకు లేదు అని శృతి అంటుంది. దానికి ఇంట్లోని వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇక బాలు కోపం రెట్టింపు అవుతుంది. ఆంటీ అంకుల్ మీరు ఆశీర్వదించారు మాకు అదే చాలు. మేము ఆశీర్వాదాలు కోసం వేరే వాళ్ళని బెగ్ చేయాల్సిన అవసరం మాకు లేదని శృతి పొగరుగా అంటుంది.. దానికి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు ఇక బాలు దానికి ఇంకా రెచ్చిపోయి అందరిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తాడు. ఇలా సపోర్ట్ చేయడం వల్లే ఈ పొగరు గల ఆవిడ ఇలా మాట్లాడుతుందని అంటాడు. పెద్ద చిన్న నేను మర్యాద కూడా లేకుండా ఎంత పొగరుగా సమాధానం ఇచ్చిందో చూసారా నాన్న అని అంటాడు. ఆ సురేంద్ర పొగరు కనిపిస్తుంది సురేంద్ర ముక్కు నుంచి ఊడి పడినట్లే ఉంది. మీకు కావాల్సింది ఇదే కదా అని బాలు సత్యం ను నిలదీస్తాడు. ఇక రవి కూడా శృతిని అరుస్తాడు. రవి శృతిలను అందరూ ఆశీర్వదిస్తారు. సత్యం ముగ్గురు కోడలను ముగ్గురు కొడుకులను సపరేట్గా చేసి మీరందరూ అక్క చెల్లెలు లాగా ఉండాలని సొంత కడుపున పుట్టకపోయినా సొంత తల్లి బిడ్డ లాగే కలిసి పోవాలని అంటాడు. ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో బాలు రవిని గదిలోంచి గెంటేస్తాడు. ఏం జరుగుతుందో చూడాలి..

Related News

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Big Stories

Advertisement
×