Brahmamudi serial today Episode: అందరి రియాక్షన్ ఊహించుకున్న రాజ్ షాక్ అవుతాడు. ఇప్పుడేం చేద్దాం మరి అని కావ్యను అడుగుతాడు. ఆ వంద కోట్ల నిజాన్ని మనమే దిగమింగాలని కావ్య చెప్తుంది. స్టెల్లా చేసిన వంటను దిగమింగినట్టు దిగమింగాలి. తర్వాత ఏం చేద్దాం.. అని అడుగుతాడు. పగలంతా ఆఫీసులో వర్క్ చేద్దాం.. రాత్రిళ్లు ఆ ఎండీ గాడిని వెతుకుదాం.. అదృష్టం బాగుండి వాడు దొరికితే ఆ డబ్బులు మొత్తం వాడితో కక్కించి బ్యాంకు వాళ్లకు డబ్బులు కట్టి ప్రశాంతం పడుకుందాం అంటుంది కావ్య. ఒకవేళ వాడు దొరక్కపోతే అంటాడు రాజ్. కావ్య కోపంగా చూస్తుంది.
ఒక్కటైనా పాజిటివ్‌గా ఆలోచించరా.. వాడు దొరకాలి.. దొరికితేనే వంద కోట్ల అప్పు కట్టడం మనకు రాదు. అంటుంది నిజమే కానీ వాడి అదృష్టం బాగుండి.. మన దురదృష్టం ఇంకా బాగుండి వాడు దొరక్కపోతే ఎలా అంటాడు రాజ్. రోజు ఆఫీసుకు వెళ్లి అప్పు తీర్చడం కోసం గొడ్డులా కష్టపడి అప్పు తీర్చాలి.. అప్పటి వరకు ఇంట్లో వాళ్లు తిడుతూ ఉంటే నీళ్లలో బిస్కట్లు అద్దుకుని తినాలి అంటుంది కావ్య.. అంతా బాగానే ఉంది కానీ ఇంట్లో వాళ్లు మనల్ని తిడుతుంటే.. మనం నీళ్లలో బిస్కట్లు అద్దుకుని తినే కాన్సెఫ్టే బాగాలేదు అంటాడు రాజ్. దీంతో కావ్య కోపం నశాళానికి ఎక్కుతుంది. ఏవండి నేను ఇంత మ్యాటర్ చెప్తుంటే.. బిస్కెట్ గురించి చెప్తారేంటి..? అంటుంది. సరే ఒకే ఇంకేం అనను అంటాడు రాజ్.
రుద్రాణి, రాహుల్, ధాన్యలక్ష్మీ ముగ్గురు మీటింగ్ పెట్టుకుంటారు. ఉదయాన్నే లేచి హడావిడిగా రెడీ అయి రాజ్ ఒక బ్యాగ్.. కావ్య ఒక మేకప్ బాగ్ పట్టుకుని ఎవరినో ఉద్దించడానికి వెళ్తున్నట్టు బిల్డప్ ఇచ్చారు. కట్ చేస్తే ఐదు లక్షల కోసం కూడా నగలు తాకట్టు పెట్టారు అంటుంది రుద్రాణి. ఎవరితో కూడా మాట్లాడేవారు కాదు మమ్మీ అంటాడు రాహుల్. ఎందుకు మాట్లాడుతారురా.. మాట్లాడితే ఫ్లో లో అన్ని నిజాలు భయటపడిపోతాయి కదా అంటుంది రుద్రాణి. అసలు ఐదు లక్షలు కూడా ఇంట్లో లేకపోవడం ఏంటి మామ్ అంటాడు రాహుల్.
అసలు డబ్బులు లేవన్నది పచ్చి అబద్దం. ఆ రాజ్, కావ్య కలిసి ఏదో నాటకం ఆడుతున్నారు అంటుంది ధాన్యలక్ష్మీ. కరెక్టు అత్తా కావ్య అంటేనే పడని రాజ్.. ఇప్పుడు కావ్యతోనే జత కట్టాడు. అప్పుడే నాకు డౌటు వచ్చింది అంటాడు రాహుల్. ఈ కథలో బయట కనిపించే క్యరెక్టర్స్ రాజ్, కావ్య మాత్రమే.. కానీ వెనక ఉండి స్క్రీన్ ప్లే రాస్తుందంతా సుభాష్ అన్నయ్యా.. అపర్ణ వదిన అంటుంది రుద్రాణి. ఏమంటున్నావు నువ్వు అంటూ ధాన్యలక్ష్మీ అనుమానంగా అడుగుతుంది. నీకింకా అర్థం కాలేదా..? మనం ఆస్తుల గురించి న్యాయపోరాటం ఎప్పుడైతే మొదలుపెట్టామో.. అప్పటి నుంచి వాళ్లలో మార్పు వచ్చింది.
కొడుకుతో కుమ్ముక్కై మా నాన్న మంచం ఎక్కగానే ఆస్తులన్నీ రాయించుకున్నారు. తెలివిగా డబ్బంతా సైడు ట్రాక్‌లో దాటించేస్తున్నారు. కావాలంటే నువ్వే చూడు మనకు అన్ని విషయాలు తెలియగానే వాళ్లు మాకేమీ సంబంధం లేదని చేతులు ఎత్తేస్తారు అంటుంది రుద్రాణి. చివరికి సొంత అక్క సీమంతం కూడా నార్మల్ గా జరిపించారు. పాపం స్వప్న చాలా ఫీల్ అయింది. అంటాడు రాహుల్. డబ్బు పిచ్చి పట్టాక తన మన అనేది ఉండదురా..? అందరూ నీలాగా నాలాగా మన ధాన్యలక్ష్మీ లాగా ఉండరురా అంటుంది రుద్రాణి. అలాగే రాహుల్ ను కంపెనీ అకౌంట్ నుంచి డబ్బులు ఎక్కడికి ట్రాన్స్ ఫర్ అవుతున్నాయో చూడమని చెప్తుది అలాగే మమ్ అంటూ రాహుల్ వెళ్లిపోతాడు.
మరోవైపు మందు తాగుతూ అనామిక హ్యాపీగా ఫీలవుతుంది. సామంత్ తో కలసి రాజ్, కావ్య అప్పులు కడుతున్నాడని మనం లీక్ చేస్తే బాగుంటుంది అని చెప్పగానే.. వద్దని సామంత్ అంటాడు. నాకు కంపనీ కావాలని సామంత్ అంటే ఇదేంటి నేను కంపెనీ కోసం ఇదంతా చేస్తే ఇది కాదంటుంది అంటాడు. ఇంతలో రుద్రాణికి ఫోన్ చేసి సీమంతంలో జరిగిన విషయాలు చెప్తుంది. ఆ ఇంటిని షేక్ చేసే బిగ్ వెపన్ నా దగ్గర ఉంది నీకు పంపిస్తాను అని చెప్తుంది. మరోవైపు ఇందిరాదేవి తన నగలు తీసుకెళ్లి కావ్యకు ఇస్తూ అవసరానికి ఉపయోగపడతాయి ఇవి తీసుకొమ్మా అని చెప్తుంది. కావ్య ఎమోషనల్ అవుతుంది. ఎటువంటి సమస్యలు లేవని కావ్య చెప్తుంది. దీంతో సరే అయితే నేను ఇక నిమ్మలంగా ఉంటాను అని ఇందిరాదేవి వెళ్లిపోతుంది.
హాస్పిటల్‌లో ఉన్న కళ్యాణ్ దగ్గరకు అప్పు వస్తుంది. కానీ కళ్యాణ్ మాత్రం ఎవరిని చూసినా అప్పులాగే కనిపిస్తుంది అనుకుంటాడు. అప్పు దగ్గరకు వస్తూ హాయ్ అన్నా ఏంటో నన్ను చూస్తూ హాయ్ అన్నట్టు ఉంది అనుకుంటూ వెళ్లి నీళ్లు తాగుతుంటే.. దగ్గరకు వచ్చి కళ్యాణ్‌ను గిల్లుతుంది. దీంతో కళ్యాణ్ ఆనందంతో అప్పును ఎత్తుకుని తిప్పుతుంటాడు. ఇంతలో నర్స్ వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటూ తిడుతుంది. తర్వాత సీతారామయ్య గురించి తెలుసుకుని బాధపడుతుంది అప్పు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?