BigTV English

Gundeninda GudiGantalu Today episode: శృతికి క్లాస్ పీకిన రవి.. బాలుకు చివాట్లు పెట్టిన మీనా..

Gundeninda GudiGantalu Today episode: శృతికి క్లాస్ పీకిన రవి.. బాలుకు చివాట్లు పెట్టిన మీనా..

Gundeninda GudiGantalu Today episode January 21st : నిన్నటి ఎపిసోడ్ లో.. రవి, శృతిల శోభనం కోసం ప్రభావతి హడావిడి చేస్తుంది. అస్సలు ఇష్టం లేదన్నట్టు ప్రవర్తిస్తాడు బాలు. మీనా నచ్చచెప్పి బాలుని ప్రతిసారి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇక బాలు రవి శృతిల శోభనం ఎలాగైనా జరక్కుండా ఆపాలని కంకణం కట్టుకుంటాడు.. గదిలో స్వీట్లు పూలు అన్నీ రెడీ చేసి ప్రభావతి పెట్టేస్తుంది. ఈ బండోడు శోభనం గదిలోకి తీసుకెళ్లాల్సిన పాలను తాగినట్టే అక్కడ ఉన్న స్వీట్లు పండ్లు అన్ని తినేసాడేమో నేను వెళ్లి ఒకసారి చూసి వస్తానని ప్రభావతి అంటుంది. పైకెళ్లగానే ప్రభావతికి షాక్ తగులుతుంది. బాలు గదికి తాళం వేసుకొని బయటకు వెళ్ళిపోతాడు. మీనా ప్రభావతి దగ్గరికి వెళ్లి ఎందుకు అత్తయ్య అలా అరిచారని అడుగుతుంది. నీ గదిని ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పచ్చు కదా ఎందుకిలా నువ్వు తాళం వేసుకున్నావ్ అనేసి అరుస్తుంది ప్రభావతి. మీనా నేను మాత్రం వేయలేదు అత్తయ్య నాకు తెలియదు ఒకవేళ మీ అబ్బాయి ఏమైనా వేసారేమో అని అనుకుంటారు. మొత్తానికి సత్యం కీ తీసుకురమ్మని బాలుకు చెప్తాడు. బాలును రమ్మని చెప్తాడు మీనాను తీసుకు రమ్మని చెబుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రవి శృతిలను అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోమని ప్రభావతి కిందకు తీసుకొస్తుంది. బాలు ఎక్కడ అంటే బాలు బయట ఉన్నాడు మామయ్య అని మీనా అంటుంది. బాలుని మీనా బలవంతంగా లోపలికి తీసుకొని వస్తుంది. వాళ్లని ఆశీర్వదించాలి అని సత్యం అంటాడు. అది విన్న బాలు మీరందరూ ఉన్నారు కదా మంచివాళ్లు మీరు ఆశీర్వదిస్తే చాల్లే నేను ఎందుకు అని అనగానే శృతి మీరందరూ ఆశీర్వదించారు కదా ఇంకెవరి ఆశీర్వాదాలు కోసం నేను అడుక్కోవాల్సిన అవసరం నాకు లేదు అని శృతి అంటుంది. దానికి ఇంట్లోని వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇక బాలు కోపం రెట్టింపు అవుతుంది. ఆంటీ అంకుల్ మీరు ఆశీర్వదించారు మాకు అదే చాలు. మేము ఆశీర్వాదాలు కోసం వేరే వాళ్ళని బెగ్ చేయాల్సిన అవసరం మాకు లేదని శృతి పొగరుగా అంటుంది.. ఇక బాలు మాత్రం చూశారా ఆ సురేంద్రకు చీర కట్టినట్టే ఎలా ఉందో పొగరుగా మాట్లాడుతుంది డబ్బులు మానేసి అంటారు.. ఇక అందరూ కలిసి శృతి, రవి లను ఆశీర్వదిస్తారు.

ఆ తర్వాత సత్యం ముగ్గురు కోడళ్ళను ఒక దగ్గరకు రమ్మని చెప్పి ఒద్దిగగా ఉండాలని చెబుతాడు. ముగ్గురు తోడికోడళ్ళు గా కాకుండా అక్క చెల్లెలు కలిసి ఉండాలని, ఏ సమస్య వచ్చినా కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తాడు.దీంతో మీనా.. సరే మామయ్య ఇకనుండి మేము కలిసి ఉంటాం అంటూ మాట ఇస్తుంది. రోహిణి మాట్లాడుతూ.. ఇలాంటి పెద్ద కుటుంబంలోకి కోడలుగా రావడం తన కూడా సంతోషంగా ఉందని, ఇది తన అదృష్టమని ఓ రేంజ్ లో మాట్లాడుతుంది. ఇక శృతి.. తన మామయ్య సత్యం మాటలకు ఫిదా అవుతుంది. రియల్ గా హానెస్ట్ గా మాట్లాడారంటూ తన మామయ్యను అందరిముందు హగ్ చేసుకుంటుంది. అది చూసిన అందరూ షాక్ అవుతారు ఇక మాకు టైం అయింది ఇప్పటికే లేట్ అయింది ఆంటీ మేము వెళ్ళిపోతామని రవిని తీసుకొని శృతి రూమ్ కి వెళ్ళిపోతుంది. ఇక రవి లోపలికి వెళ్ళగానే క్లాస్ తీసుకుంటాడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయో మామ గారిని మామగారిలాగే చూడాలి ఎదిరించి మాట్లాడకూడదు నువ్వు అలా హగ్ చేసుకోవడం అందరికీ ఇబ్బందిగా అనిపించింది అని అంటాడు దానికి శృతి ఇది శోభనం గదినా లేకపోతే క్లాస్ రూమ్ నా నువ్వు క్లాస్ తీసుకుంటున్నావ్? నేను ఇలాగే ఉంటాను అందులో తప్పేమిటి నాకు సంతోషం వస్తే మా నాన్నని ఎలా హగ్ చేసుకుంటాను అలాగే హగ్ చేసుకున్నాను అనేసి అంటుంది.


ఇక మీనా పాలు తీసుకొచ్చి ఇస్తుంది. మీ నాకు ఇద్దరు థాంక్స్ చెప్తారు. మీనా బాలు దగ్గరికి వెళ్తుంది. బాలు పాటలు పాడుకుంటూ ఏదో దీన వ్యధలో ఉంటాడు. మీనా ఏం గుర్తొస్తుంది అని అంటే నువ్వు అనుకున్న అలాంటిది కాదమ్మా అనేసి ఉంటాడు బాలు.. అటు ప్రభావతి పాల గ్లాస్ తో లోపలికి వెళ్తుంది సత్యంని చూసి సిగ్గుపడుతుంది. పాల గ్లాస్ పట్టుకోగానే నాకు కాళ్లు రావట్లేదండి మన శోభనం గుర్తుకొస్తుంది అని అంటుంది. ఇక సత్యం కూడా ముగ్గురు కొడుకుల్ని ముగ్గురు కోడల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు కూడా అలానే సమానంగా చూడు ముగ్గురు కోడలను మైంటైన్ చేయడం మామూలు విషయం కాదు అని ప్రభావతికి సలహాలు ఇస్తాడు. ఇక రోహిణి కూడా శృతిరవిలను మనకు పెట్లో పెట్టుకోవాలని కన్నింగ్ ప్లాన్ ఏస్తుంది. మనోజ్ అదంతా నేను చూసుకుంటాలే నువ్వేం ఆలోచించకు వాళ్ళది ఎంత మీ నాన్నకు ఉన్న దానితో కాసంతే కదా అనేసి అంటాడు. ఇక శృతి రవి ల మధ్య రొమాన్స్ మొదలవుతుంది.. బాలుకు మాత్రం నిద్ర రాకపోతే నిద్రపోతున్న మీనా ను పైకి తీసుకుని వెళ్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో రవికి బాలు షాక్ ఇస్తాడు.. ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Big Stories

×