Watch: ప్రపంచంలో ఎన్నో రకాల క్రీడలు ఉన్నాయి. చాలామందికి ఫుట్ బాల్ అంటే ఇష్టం. అయితే మన ఇండియాలో మాత్రం క్రికెట్ అంటే పడి చచ్చిపోతారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు క్రికెట్ చూడడానికి అలాగే ఆడటానికి ఆసక్తి చూపిస్తారు. దీనికి తగ్గట్టుగానే ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా క్రికెట్ ను ఎంకరేజ్ చేస్తున్నాయి. దీంతో గ్రామస్థాయిలో కూడా క్రికెట్ కు ఆదరణ లభిస్తుంది. ప్రతి ఏరియాలో కూడా గ్రౌండ్లో ఉండడంతో చాలా మంది క్రికెట్.. ఆడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read: RCB- IPL 2025: RCB కోసం.. మహా కుంభమేళాలో ఏం చేశారో చూడండి ?
అయితే ఇలాంటి నేపథ్యంలో… తాత వయసులో ఉన్న ఓ వ్యక్తి… క్రికెట్ ( Cricket) ఆడుతూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు.. రోహిత్ శర్మ ( Rohit sharma ) అలాగే విరాట్ కోహ్లీ ( Vira Kohli) ఇంటర్నేషనల్ క్రికెట్ లో… ఆడుతున్న తరహాలోనే…. ఈ వ్యక్తి కూడా అదిరిపోయే షాట్లతో దుమ్ము లేపాడు. ఫ్రంట్ ఫుట్, లెగ్ సైడ్, స్ట్రెయిట్ డ్రైవ్ ఇలా ఎన్నో రకాల షాట్లు ఆడుతూ ఈ ముసలాయన… రచ్చ చేస్తున్నాడు. ముసలోడే కానీ.. మహా ముదురు అనేలా… క్రికెట్ ఆడుతున్నాడు.
అతను ఆడేది గల్లి క్రికెట్ అయినప్పటికీ… ఇంటర్నేషనల్ ప్లేయర్ తరహాలోనే… షాట్స్ ఆడుతున్నాడు ముసలాయన. ఆయన పేరు వివరాలు తెలియదు కానీ… వీడియో మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. క్రికెట్ వీక్షించే ఛాన్స్ ను… ఆకట్టుకుంటుంది ఆయన ఆడిన క్రికెట్ షాట్స్ వీడియో. అందుతున్న సమాచారం ప్రకారం… అందరినీ ఆకట్టుకుంటున్న ఈ ముసలాయన ( Old Man ) కరీంనగర్ జిల్లాకు ( Karim Nagar ) చెందిన వాడని తెలుస్తోంది.
కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం… యాకిన్ పూర్ కు ( Yakeen pur ) చెందిన వాడని సమాచారం అందుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రీల్ ప్రకారం అతనిది… యాకిన్ పూర్ అని సమాచారం. గల్లీలో చిన్న కుర్రాళ్ళతో.. ఆ ముసలాయన ( Old Man ) క్రికెట్ ఆడుతూ… అద్భుతమైన క్రికెట్ షాట్లు ఆడాడు. దీంతో… ఆడుతున్న క్రికెట్ వీడియోను ఆ విలేజ్ యాకిన్ పూర్ కు ( Yakeen pur ) సంబంధించిన కొంతమంది కుర్రాళ్ళు సోషల్ మీడియాలో పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: Klaasen: SRHకు బిగ్ షాక్.. క్లాసెన్ కోసం పెట్టిన 23 కోట్లు దండగే ?
ఇప్పటివరకు ఈ వీడియోకు 63 వేల లైకులు వచ్చాయి. ఇక ఈ వీడియోను చూసిన.. క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వయసు అనేది ఒక నెంబర్ మాత్రమేనని… మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడని…. కామెంట్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. అంతేకాదు.. యాకిన్ పూర్ కు ( Yakeen pur ) చెందిన ఆ ముసలాయనకు ఫిట్ నెస్ ఉంటే.. కచ్చితంగా టీమిండియాలోకి తీసుకురావాలని అంటున్నారు. రోహిత్ శర్మ ( Rohit sharma ) అలాగే విరాట్ కోహ్లీ ( Vira Kohli)లను తీసేసి.. అతన్ని జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">