Gundeninda GudiGantalu Today episode January 27th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా రోహిణి ప్రగ్నెన్సీ గురించి చెప్పిందని తెలుసుకొని ప్రభావతి ఆగ్రహంతో ఊగిపోతుంది. మీనా ఇంట్లో గొడవలు పెట్టిందని కొట్టబోతుంది..బాలు ప్రభావతి చేయి పట్టుకుంటాడు.. రోహిణి మాత్రం మీనా కరెక్ట్ గా దొరికింది. ఇప్పుడు గనక మనం క్లాస్ పీకకపోతే మరోసారి ఇలాంటి పనులు చేస్తుంది అని అనుకుంటుంది.. ఎందుకు మీనా నీకు నేనంటే అంత కక్ష. ఎప్పుడూ ఏదో ఒకటి నా గురించి చెప్తూనే ఉంటావా అని రోహిణి అంటుంది. మొదటినుంచి మీనాకు డబ్బున్న వాళ్ళ అన్న.. చదువుకున్న వాళ్ళ అన్న ఇష్టం లేదు. అలా నా మీద అందుకే ఇలాంటి పగని పెంచుకొని అబద్ధాలు చెప్తుంది అని రోహిణి అంటుంది..నువ్వు పైకి కనిపించే అంత మంచి దానివి కాదు అని రోహిణి మీనా అనే దారుణంగా తిడుతుంది. ఇలాంటి దానితో ఎలా ఉండాలి అత్తయ్య రేపు ఇంకొకటి చెప్తే మీరు నమ్ముకున్న ఉండరు కదా అని రోహిణి అంటుంది. మీనా చెప్పడం వల్లే ఇంట్లో తెలిసింది అది గుర్తుపెట్టుకోండి అంటూ బాలు అందరికి వార్నింగ్ ఇస్తాడు. మాత్రం మీనాకు రోహిణి బండారం బయట పెడతానని అంటాడు.. అది విన్న రోహిణి ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని ఇంట్లోంచి పంపించాలని అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. సుమతికి ఇంట్లో జరిగిన విషయాన్ని మీనా చెప్తుంది. సుమతిని డాక్టర్ వెళ్లిపొమ్మని చెప్తుంది. నువ్వు మన హాస్పిటల్ రేపటేషన్ ని తగ్గించేసావు నిన్ను ఎలా ఇక్కడ పెట్టుకోవాలి నేను నీ వల్ల నాకు ఒక పేషెంట్ పోయారు అని డాక్టర్ సుమతిని తిడుతుంది.. వచ్చిన వారం రోజుల్లో పై ఇలాంటి పని చేస్తావని అస్సలు అనుకోలేదు. పేషెంట్ నాకు ఫోన్ చేసి మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని ఎలా లీక్ చేస్తారు అంటూ తిట్టేసింది.. మీ హాస్పిటల్ కి ఇంకొకసారి రాను అని చెప్పింది నీ వల్ల నాకు లక్షలు నష్టం వచ్చాయి అని నువ్వెక్కడి నుంచి వెళ్ళిపో అని డాక్టర్ అంటుంది.. మా అమ్మ నన్ను చాలా కష్టపడి చదివించింది మేడం ఈ జాబ్ వచ్చిందని చాలా సంతోషంగా ఉంది.. నన్ను తీసేయకండి మేడం ఇక మీదట ఎవరి జోలికి వెళ్ళను మేడం అని అంటుంది.. సుమతి అంతగా బ్రతిమలాడడంతో డాక్టరు ఈనెల సగం శాలరీతో ఇక్కడ పని చేయొచ్చు అని ఆఫరిస్తుంది..
ఇక మీనా కోసం వాళ్ళ బస్తి వాళ్ళు వస్తారు.. ఒక పెళ్లికి పూలమాలలు కళ్యాణమాలలు కట్టాలంట నువ్వు ఈ రాత్రికి మాకు సాయం చేయాలి అని అడుగుతారు. అయినా ఇంట్లోకి రాకుండా ఇక్కడే మాట్లాడుతున్నారు ఏంటి అక్క ఇంట్లోకి వెళ్దాం పదండి అని మీనా అంటుంది. కుక్క నా ఇంటికి మీ అత్త ఉన్న ఇంటికి నేను రాలేనమ్మ అని ఒక ఆవిడ అనడంతో మిగతా వాళ్ళు నవ్వుతారు.. నువ్వు ఇంతకీ వస్తావా రావా అని అడగ్గాని మా ఆయన ఇంటికి వస్తాను ఎవరు వండి పెట్టరు.. నేను పెట్టకుండా ఉంటే అలసిపోయి అలాగే పడుకుండిపోతారు. నేను రాలేనక్క అని అంటుంది.. మొన్నటి వరకు మీ ఆయన నువ్వు గొడవ పడ్డారు ఇప్పుడు మాత్రం వడ్డించుకుని పెట్టాలా ఏంటి ఒకసారి ఫోన్ చేసి అడుగు అని ఎంతగా వాళ్ళు చెప్పిన సరే మీనా మాత్రం బాలు వదిలిపెట్టి రాను అని అంటుంది.
ఆ తర్వాత బాలు ఫోన్ చేసి నాకు ఒక ట్రిప్ పడింది నేను చాలా దూరం వెళుతున్నాను. రాత్రికి రాను అని చెప్పగానే మీనా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. ఏంటి నువ్వు రానని చెప్పావు నేను పూలమాలలు అల్లడానికి మా అక్క వాళ్ళు పిలిస్తే రానని చెప్పాను ఇప్పుడు వాళ్ళకి వస్తానని చెప్తాను అని అంటుంది.. వాళ్లకి ఫోన్ చేసి చెప్పగానే లేదు వేరే ఆవిడ వస్తుంది నువ్వు నీ పని చేసుకో మీనా అనేసి అంటారు.. ఇక రవి శృతి ఇద్దరు కూడా గొడవ పడతారు.. రవిని శృతి రమ్మని చెప్తుంది కానీ రవి పని ఉంది రాలేనని చెప్పగానే ఇద్దరు కలిసి గొడవ పడతారు.. నువ్వు రాత్రి ఇంటికి వస్తావు కదా తలుపు కూడా తీయను అని శృతి రవికి వార్నింగ్ ఇస్తుంది..
వెంటనే రవి మీనా కి ఫోన్ చేసి నువ్వు నన్ను కాపాడాలి వదిన ఈరోజు నువ్వే నాకు తలుపు తీయాలి అని అంటాడు.. వచ్చినప్పుడు నాకు ఫోన్ చెయ్ రవి నేను చూసుకుంటాను అని మీనా అంటుంది.. వదిన శృతిని కాస్త కూల్ చెయ్ వదిన లేకుండా ఉంటే అది నన్ను చంపేస్తుంది అని రవి అంటాడు. మీనా ఫోన్ పెట్టగానే శృతి ఇంట్లోకి వస్తుంది. ప్రవీణ్ బెదిరిస్తున్నావంట ఏంటి వాళ్ళ పనిని మనం అర్థం చేసుకోవాలి అని అనగానే.. శృతి ఇందాకే కదా ఫోన్ చేస్తాను అప్పుడే నీకు ఫోన్ చేసి చెప్పాడా ఏంటి అని అంటుంది.. అదేమీ లేదు నువ్వు అతని అర్థం చేసుకోవాలి అని అనగానే శృతి కాస్త మెల్ట్ అవుతుంది.. ఇక ఇవాళ బాలు కూడా రాడు అని అనడంతో మనం లేడీస్ నైట్ ప్లాన్ చేద్దామని శృతి అంటుంది..
మీనా అంటే ఏంటి అని అడుగుతుంది. మనిద్దరం కలిసి దెయ్యాల సినిమా చూద్దామని అంటుంది. ఇద్దరు కలిసి దెయ్యాల సినిమాని చూస్తారు. ఆ దియాలను చూసి శృతి ఎంజాయ్ చేస్తుంటే మీనా మాత్రం భయపడిపోతూ ఉంటుంది. ఏంటి శృతి దయ్యాలు చూస్తే నువ్వు ఇంతగా ఎంజాయ్ చేస్తున్నావ్ నీకు భయం లేదా అని అంటుంది.. ఇదంతా కేవలం నటన మాత్రమే మీనా నువ్వేం భయపడకు అని అనగానే ఈయన మాత్రం ఉంటుంది. అప్పుడే ప్రభావతి లైట్ ఏస్తుంది అది చూసిన మీనా దయ్యం అని భయపడుతుంది.. ఏం కాదు మీనా ఆంటీ అని అనగానే ఈ టైంలో మీరిద్దరూ ఏం చేస్తున్నారని ప్రభావతి సీరియస్ అవుతుంది.. దెయ్యాల సినిమా చూస్తున్నాము అని అంటే దెయ్యాల సినిమానా ఈ టైంలోనా మీకు కొంచెం కూడా ఇది లేదా అని ప్రభావతి అంటుంది.
Also Read :ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. ఆ 2 ఇంట్రెస్టింగ్..
అయితే ప్రభావతికి దెయ్యం అంటే భయం లేదని శృతి అడుగుతుంది.. దెయ్యాల అంటే నాకేం భయం లేదు జాతరలో నేను ఒక్కదాన్నే నడుచుకుంటూ వచ్చేదాన్ని అని గొప్పగా చెప్తుంది ప్రభావతి. దెయ్యాలు భయం లేదా ఇవాళ ఆంటీకి చుక్కలు చూపిస్తానని శృతి ప్లాన్ చేస్తుంది. ప్రభావతి వెళ్లి పడుకోగానే శృతి టెక్నాలజీని వాడి ప్రభావతిని భయపెట్టాలని అనుకుంటుంది. అన్నట్లుగానే శృతి ప్రభావతిని భయపెడుతుంది.. అయితే ఇది నా ఇల్లు అని దెయ్యం అంటున్న సరే ప్రభావతి మాత్రం ఇది నా ఇల్లు అని ఇద్దరు మాట మాట అనుకుంటారు. దెయ్యాల సౌండ్ కి ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా భయపడుతూ కిందికి వస్తారు.. అది చూసిన శృతి మీనా ఇద్దరు కూడా కాస్త నవ్వుకుంటారు. ప్రభావతి మాత్రం ఇదంతా శృతి పనా అని షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్లో శోభ కి ప్రభావతి మీ కూతుర్ని కంట్రోల్లో పెట్టండి అని అంటుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…