E-Paper
Advertisement

Mexico: మెక్సికో సాకర్ మైదానంలో దారుణం.. 11 మంది మృతి, ఆ ముఠా పనే?

Mexico: మెక్సికో సాకర్ మైదానంలో దారుణం.. 11 మంది మృతి, ఆ ముఠా పనే?
Advertisement

Mexico: మెక్సికోలో దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సాకర్ ఫుట్‌బాల్ మ్యాచ్ ముగిసిన తర్వాత దుండగులు జరిపిన కాల్పుల్లో 11 మంది మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు. ఆ దేశంలోని గ్వానాజువాటో‌లోని సలమాంకా సిటీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దీని వెనుక ఆర్గనైజ్డ్ క్రైమ్ ముఠాల ప్రమేయముందని అధికారుల మాట.

మెక్సికో సాకర్ మైదానంలో దారుణం

Advertisement

గ్వానాజువాటో‌లోని సలమాంకా సిటీలో స్థానిక కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఫుట్‌బాల్ మ్యాచ్ సాగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కొందరు వ్యక్తులు తుపాకులతో మైదానంలోకి దూసుకొచ్చారు. వెంటనే క్రీడాభిమానులపై విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. ఈ దాడిలో 11 మంది అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడినవారిని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు.

మరికొందరు చికిత్స పొందుతూ ఈ లోకాన్ని విడిచిపెట్టారు. 12 మందికి వరకు గాయాలు పాలయ్యారు. ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హింసాత్మక ఘటనపై సలమాంకా మేయర్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఈ ఘటన వెనుక ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగ్ ఉందన్నారు.

Advertisement

కాల్పుల ఘటనలో 11 మంది మృతి, ఆ ముఠా పనే?

ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడానికి ప్రభుత్వం సహాయం చేయాలని, నేర ముఠాలు అధికారులను లొంగ దీసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో వెనుకడుగు వేసేది లేదని కుండబద్దలు కొట్టేశారు.

సలమాంకా సిటీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. మెక్సికోలో అత్యధిక హత్యలు జరిగే ప్రాంతంగా గ్వానాజువాటో మారింది. ఆయిల్ ముఠాలు-డ్రగ్స్ ముఠాల మధ్య ఆధిపత్య పోరు తీవ్రంగా ఉంది. ఆధిపత్యం కోసం ఘటనకు పాల్పడినట్టు దర్యాప్తు బృందాలు చెబుతున్నయి. కాల్పుల జరిగిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ALSO READ: బంగ్లా వస్త పరిశ్రమ కొత్త డిమాండ్.. భారత్‌పై ఒత్తిడి, డ్యూటీ ఫ్రీ ఇష్యూ

ఈ ఏడాదిలో FIFA ప్రపంచ కప్ జరగనుంది. అమెరికా-కెనడా-మెక్సికో అతిథ్యం ఇస్తున్నాయి. టోర్నీ ప్రారంభానికి కొన్ని నెలల ముందు ఈ దాడి జరగడం వెనుక ఏదో ఉందని అంటున్నారు. కాల్పుల్లో మరణించినవారికి ఆ ముఠాలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా జోరుగా దర్యాప్తు సాగుతోంది.

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×