BigTV English

Gundeninda GudiGantalu Today episode: శృతి టెంట్ గురించి ఇంట్లో రచ్చ.. ప్రభావతి పై సత్యం సీరియస్..

Gundeninda GudiGantalu Today episode: శృతి టెంట్ గురించి ఇంట్లో రచ్చ.. ప్రభావతి పై సత్యం సీరియస్..

Gundeninda GudiGantalu Today episode January 29th: నిన్నటి ఎపిసోడ్ లో… సత్యం షాకింగ్ డెసిషన్ తీసుకుంటారు. తాను ఇకనుండి హాల్లోనే పడుకుంటానని, తనకు రూమ్ అవసరం లేదని తెగేసి చెప్తాడు. ఇంట్లో వారు వద్దని చెప్పిన సత్యం వినడు. రవికి తాము రూమ్ ఇస్తామని బాలు చెప్పినా.. తాను ఇక నుండి హాల్లోనే ఉంటానని చెప్తాడు. దీంతో బాలు తన రూమ్ లో ఉన్న బెడ్ తీసుకువచ్చి ఇస్తాడు. మరోసారి మీనా తమ రూం ఇస్తామని అంటుంది. దీంతో ప్రభావతి వాళ్ళే రూమ్ ఇస్తారని అంటున్నారు కదా.. మనం వాళ్ళ రూమ్ లోకి వెళ్దాం అంటుంది. నీకు కష్టంగా అయితే.. నువ్వు వెళ్ళు నేను మాత్రం ఇక్కడనే ఉంటా అని సత్యం తెగేసి చెప్తాడు. ఇక బాలు మీనాని లోపలి రమ్మని పిలుస్తాడు. అత్తయ్య, మామయ్య ఈ రూమ్ కి రమ్మని మీరే చెప్పొచ్చు కదా అంటే.. సత్యం ఏం చెప్పినా వినని ఈ పరుపుని తీసుకెళ్లి వాళ్ళకు ఇద్దామని అంటాడు. ఇక బాలు తీసుకెళ్లి సత్యం కు పరుపుని ఇస్తాడు.. మీనా బాలు ఎంత చెప్పినా సత్యం వినకుండా మీరు నా మాటని కాదనలేరనేసి అంటాడు. ఇక రవి శృతి అప్పుడే ఇంట్లోకి వస్తారు. ఏమైంది అంటే నిన్ను కన్నందుకు నువ్వు లేచిపోయి నాన్న పరువు తీసినందుకని బాలు పొందను లేకుండా మాట్లాడుతాడు.. శృతి బాలు నోరు మూయిస్తుంది. ఇక మొత్తానికి ప్రభావతి వాళ్ళ రూమ్ ని రవి వాళ్ళకి ఇస్తారు. మీనా మాత్రం బాలు పై కోపంగా ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శృతి రవిని నిద్రలేపి పైకి తీసుకెళ్తుంది.. అక్కడున్న టెంట్ హౌస్ ని చూపిస్తుంది. మీ అన్నయ్య తాళం వేసుకొని వెళ్ళిపోయారు అన్నారు కదా.. అందుకే నేను మధ్యాహ్నం షాపింగ్ కి వెళ్ళినప్పుడు దీన్ని కొన్నాను ఇక్కడ చాలా బాగుంటుంది నాకు ఇక్కడ నీతో ఉండాలని అనిపిస్తుంది అని శృతి అంటుంది. ఇక ఉదయం లేవగానే ప్రభావతి శృతికి రవికి కాఫీ తీసుకొని వస్తుంది. కానీ అక్కడ శృతిరవిలు ఉండరు. ఇక మనోజ్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి పైకి వెళ్తారు. అక్కడ టెంట్ చూసి షాక్ అవుతాడు ఏంటి కొంపతీసి టెంట్లో దొంగలు ఏమైనా ఉన్నారా? వీళ్ల దగ్గర మారనాయుధాలు ఉన్నాయా నేను ఒక్కడినే కాదు ఇంట్లో వాళ్ళందరిని పైకి తీసుకొస్తాను అని మనోజ్ కిందికి వెళ్తాడు.. ఇంట్లో వాళ్ళందరికీ ఈ విషయాన్ని చెప్పి అందరిని పైకి తీసుకొని వస్తారు. టెన్షన్ పడుతూనే ఆ టెంటులో ఎవరున్నారో తెలుసుకోవడానికి రెడీ అవుతారు..

మనోజ్ రోహిణిలు మావల్ల కాదని వెనక్కి మనోజ్ రోహిణిలు మావల్ల కాదని వెనక్కి తగ్గుతారు. ఇక సత్యం మీనా ముందుకెళ్తుంటే లేదు అందరూ ఒకేసారి ముందుకెళ్దాం అని ఎవరికి తగ్గట్లు వాళ్ళు కర్రలు తీసుకొని ముందుకు వెళ్తారు. ఎవరు ఉన్నదని సత్యం బయటకు రమ్మని అడుగుతాడు. బయటకు రాగానే శృతిరవిలు షాక్ అవుతారు. మీరు పైన టెంట్ వెస్కోవాల్సిన అవసరం ఏంటి అని కిందకు తీసుకొచ్చి పెద్ద క్లాసే పీకుతారు. ఓకే చేయాలనిపిస్తే అది చేశాను తప్ప ఇందులో తప్పేంటి మా అంకుల్ అనేసి శృతి అంటుంది. ఒక గది ఇచ్చాం కదా ఆ గదిలో ఉండొచ్చు కదా ఇలా పైన టెంట్ వేసుకొని పరువు తీయాల్సిన అవసరం లేదు కదా అనేసి సత్యం అంటాడు. మీ ఇష్టాన్ని మేము ఎవరు కాదనట్లేదు అందుకు ఒక పద్ధతులు కూడా ఉంటాయని సత్యం శృతికి వార్నింగ్ ఇస్తారు.


ఇప్పుడు మనం తప్పేం చేసాం రవి? టెంటు వేసుకోవడం తప్ప అనేసి శృతి అంటుంది.. ఇక శృతి నేను పైకి వెళ్ళే టెంట్ తీసుకొని వస్తాను రవి అని పైకి వెళుతుంది ఇక ప్రభావతి రవికి క్లాస్ పీకుతుంది ఒక మంచి మర్యాద లేకుండా మీ నాన్నని బాధ పెట్టొద్దు మీ నాన్న ఆరోగ్యం అసలుకే బాగాలేదు అని నువ్వే నీ భార్యకు చెప్పుకోవాలని రవికి చెప్తుంది. ఇక శృతి పైకి వెళ్ళగానే శోభ ఫోన్ చేస్తుంది. ఈ శోభకు అసలు విషయం చెప్తుంది. అత్తారింటికి వెళ్లి రెండు రోజులు అవుతుంది. కనీసం ఫోన్ కూడా చేయలేదు. అక్కడ సంసారం ఎలా ఉంది అని ప్రశ్నిస్తోంది. తాను రెండు రోజుల నుండి ఫుల్ బిజీ అందుకే ఫోన్ చేయడం లేదని శ్రుతి సమాధానం ఇస్తుంది. సరేలే ఇప్పుడు ఏం చేస్తున్నావ్ ? ఎక్కడ ఉన్నావ్ అని అడుగుతుంది శోభ.ఈరోజు స్టూడియోకి వెళ్లలేదని, ఇంటి దగ్గరనే ఉన్నానని, దాబాపై టెంట్ సదురుతున్నానని చెబుతుంది అని శ్రుతి చెబుతుంది. టెంట్ ఏంటి ? అని శోభ ప్రశ్నించగా.. తాను నైట్ టెంట్ లోనే పడుకున్నానని, అంతముందుకు రోజు గొడవ జరిగిందని చెబుతుంది. పూర్తి విషయం తెలుసుకోకుండా శోభ ఫోన్ కట్ చేసి డైరెక్ట్ గా ఇంటికి వస్తుంది.

ప్రభావతి పై సీరియస్ అవుతుంది అగ్గిపెట్టె లాంటి ఇంట్లో నా కూతుర్ని ఉంచాల్సిన అవసరం నాకు లేదు నేను నా కూతుర్ని అల్లుడిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాను అని అరుస్తుంది. శోభ మాటలు శోభా లాగే ఉంటుంది ఇక శృతి నేను క్లారిటీ ఇస్తానని చెప్తుంది. శోభ మాత్రం లోన్ పెట్టుకొని ఇల్లు కట్టుకున్నారు కదా మరి ఇంకొక గది కట్టొచ్చు కదా ముగ్గురు కొడుకులు ఉన్నప్పుడు మూడు గదులు కట్టాల్సిన అవసరం మీకు లేదా అనేసి అంటుంది అప్పుడే బాలు ఇంట్లోకి రాబోతూ అక్కడ ఆగే మాటలు విని ఇంట్లోకి వస్తాడు.. లోన్ కోసం మా నాన్న మీనా ఇలా ఆయన కాళ్లు పట్టుకోడానికి రెడీ అయ్యాడా ఏం మాట్లాడుతుంది విన్నావా అనేసి ప్రభావతితో బాలు అంటాడు. మా ఇంట్లో గదులు లేవు సరే మీ ఇంట్లో పది గదిలో ఉన్నాయి కదా పదిమంది పిల్లల్ని ఎందుకు అనలేకపోయారు అనేసి అంటారు దానికి శోభ షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో శృతి బాలు శోభ మధ్య పెద్ద యుద్ధమే జరిగేలా కనిపిస్తుంది. శోభ రౌడీ వెధవాని బాలు అంటుంది ఇక తర్వాతే ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి..

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×