BigTV English
Advertisement

Thamballapalle Politics: పెద్దిరెడ్డి చిచ్చు.. టీడీపీలోకి గలాట..

Thamballapalle Politics: పెద్దిరెడ్డి చిచ్చు.. టీడీపీలోకి గలాట..

Thamballapalle Politics: తంబళ్లపల్లె నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి జయచంద్రారెడ్డి వర్సెస్ తెలుగు తమ్ముళ్ల మధ్య యుద్దం తారా స్థాయికి చేరింది. చంద్రబాబుపై రాళ్ల దాడి చేయడంతో పాటు యువ నేత నారా లోకేష్‌పై బూతు పురాణంతో విరుచుకుపడిన వ్యక్తులను పార్టీలోకి చేర్చుకుంటున్న ఇన్చార్జ్‌పై తంబళ్లపల్లె తమ్ముళ్లు రగిలిపోతున్నారంట. రాష్ట వ్యాప్తంగా కూటిమి ప్రభంజనం వీడిననప్పటికీ తంబళ్లపల్లెలో టీడీపీ ఓటమికి పెద్దిరెడ్డి కుటుంబంతో జయచంద్రారెడ్డి చేసుకున్న లోపాయికారీ ఒప్పందమే కారణమని పార్టీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. అయితే పార్టీ ఇన్చార్జ్ మాత్రం తనను సొంత వారే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా ప్రస్తుతం అక్కడ పార్టీకి పెద్ద దిక్కులేకుండా పోయాడంటున్నారు.


చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం టీడీపీలో వర్గ విబేధాలు తారాస్థాయికి చేరాయి‌. తంబళ్లపల్లె నియోజవర్గం తెలుగుదేశం ఆవిర్భావం నుంచి టీడీపీకి బలమైన నియోజకవర్గాల్లో ఒకటిగా ఉండేది. కాని‌ ప్రస్తుతం సరైన నాయకుడు లేని పరిస్థితి ఎదుర్కొంటోంది. 2009లో లక్ష్మీ దేవి కూమారుడు ప్రవీణ్ కూమార్‌రెడ్డి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. అయితే మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డితో పాటు ప్రవీణ్ కూడా వైసీపీలో చేరిపోయారు. 2014లో వైసీపీ తరపున పోటీచేసిన ప్రవీణ్ ను అప్పుడే టిడిపిలో చేరిన శంకర్ యాదవ్ ఓడించారు.

సరిగ్గా అప్పుడే మాజీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూపు తంబళ్లపల్లెపై కూడా పడింది. 2019లో శంకర్ యాదవ్ పై వైసిపి అభ్యర్దిగా పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిచారు. అ ఎన్నికల్లో ఓటమి తర్వాత తంబళ్లపల్లెలో టీడీపీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. పెద్దిరెడ్డి పెత్తనానికి దడిచి జిల్లా అగ్ర నాయకులు ‌కనీసం అటు వైపు దృష్టి సారించలేదంటారు. గత ఎన్నికల ముందు అభ్యర్థి విషయంలో చివరి దాకా అగినా.. అధిష్టానం చివరికి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కాదని జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చింది.


జయచంద్రారెడ్డి అభ్యర్ధిత్వాన్ని శంకర్ వర్గం వ్యతిరేకించింది. ఎన్నికల్లో జయచంద్రరెడ్డి రెడ్డి ఓడిపోయారు. అంతకు ముందు ఎన్నికల్లో సాధించిన మెజార్టీలో నాలుగో వంతు మెజార్టీ సాధించిన పెద్దిరెడ్డి ద్వారకనాధ్ రెడ్డి రెండో సారి ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి నుంచిజయచంద్రరెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు శంకర్ అనుచరులకు ఇప్పుడు లోకల్ టీడీపీ కేడర్ కూడా తోడైంది.

ఈ మధ్య రెండు వర్గాల మధ్య అధిపత్యపోరు పిక్స్ చేరిందంటున్నారు. ముఖ్యంగా జయచంద్రరెడ్డి తీరును అసలు తమ్ముళ్లు తట్టుకోలేక పోతున్నారంట‌‌. 2019 ఎన్నికల్లో దాదాపు 47 వేల ఆధిక్యతతో గెలిచిన పెద్దిరెడ్డి తమ్ముడు గత ఎన్నికల్లో పది వేల మెజార్టీతో గట్టెక్కారు. దానికి పెద్దిరెడ్డి ఫ్యామిలీతో జయచంద్రారెడ్డి చేసుకున్న లోపాయికారీ ఒప్పందమే కారణమన్న ఆరోపణలున్నాయి. దానికి తగ్గట్లే ఎన్నికల తరువాత పెద్దిరెడ్డి అనుచరులను ఆయన పార్టీలో చేర్చుకోవడం మొదలెట్టారు. తంబళ్లపల్లెలో చంద్రబాబుపై రాళ్ళ దాడి చేసివారికి సైతం టీడీపీలో చేర్చుకుని ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ఆ క్రమంలో జయచంద్రరెడ్డి తీరుపై పార్టీ పెద్దలకు ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేశారంట. ఇన్‌చార్జ్‌గా ఆయన్ని తప్పించాలని డిమాండ్ చేస్తున్నారంట.

Also Read: పాత నాయకుడే దిక్కయ్యాడా.. వైసీపీలో కనిగిరి లొల్లి

ఇదే సమయంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తంబళ్లపల్లె సెగ్మెంట్లో పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలిశాయి. జయచంద్రారెడ్డి వర్గం ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను అయన వ్యతిరేకవర్గం చింపేయడంతో.. శంకర్ వర్గం తెచ్చిన భారీ కేక్ ను నేల పాలు చేసారు జయచంద్రారెడ్డి వర్గీయులు. ఇరు వర్గాలు రోడ్డున పడి కొట్టుకునే స్థితికి రాగా వారిని సముదాయించడం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఎన్నికల ముందు శంకర్‌యాదవ్ అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించిన స్థానిక కేడర్ ఇప్పుడు జయచంద్రారెడ్డి తీరు నచ్చక శంకర్‌తో కలసి అడుగువేస్తున్నారంట‌.

జయచంద్ర రెడ్డి మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా వైసీపీ మద్దతుదారులకే సహాయం చేస్తున్నారని ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినబడుతున్నాయి. ఎన్నికల ముందు పెద్దిరెడ్డితో లోపాయికారీ ఒప్పందం గురించి ఆరోపణలు ఎదుర్కొన్న జయచంద్రారెడ్డి ఎన్నికల తర్వాత కూడా అదే తీరు ప్రద్శిస్తుండటంపై తెలుగుతమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో అక్రమ కార్యకలాపాలు పెరిగాయని దానికి కారణం జయ చంద్రారెడ్డి వెంట తిరుగుతున్న వైసీపీ మద్దతు దారులే అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు పై అంగల్లలో రాళ్లతో దాడి చేసిన వారికి సైతం ఆయన రక్షణగా ఉంటూ పచ్చ కండువా కప్పి తన వెంట తిప్పుకుంటున్నారంట. మొత్తం మీద టిడిపిలోని గొడవలను వైసీపీ శ్రేణులు తెగ ఎంజాయ్ చేస్తున్నాయంట.

 

Related News

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Proddatur: ప్రొద్దుటూరు క్యాసినో వార్

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

India VS Pakistan: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Big Stories

×