E-Paper
Advertisement

Brahmamudi Serial Today January 29th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఎంజాయ్‌ చేసిన రాహుల్‌, రుద్రాణి – ధాన్యలక్ష్మీకి చెక్‌ పెట్టిన కళ్యాణ్‌  

Brahmamudi Serial Today January 29th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఎంజాయ్‌ చేసిన రాహుల్‌, రుద్రాణి – ధాన్యలక్ష్మీకి చెక్‌ పెట్టిన కళ్యాణ్‌  
Advertisement

Brahmamudi serial today Episode: కావ్య బాధగా సుభాష్‌ దగ్గరకు వెళ్లి మీరు చెప్తే ప్రకాష్‌ మామయ్య ఆగిపోతారని అడుగుతుంది. చేసేదంతా నువ్వు చేసి ఆయనను చెప్పమంటే ఎవరు వింటారు. ఎవ్వరూ ఏమీ చేయలేరు. వాళ్లు కోర్టుకు వెళ్లే తీరతారు అని అపర్ణ చెప్తుంది. కావ్య బాధగా వెళ్లిపోతుంది.

తర్వాత రూంలో రాజ్‌, కావ్య ఆలోచిస్తుంటారు. చూస్తుండగానే పరిస్థితులు మన చేతులు దాటి పోయాయి ఏం చేద్దాం.. ఈ సమస్యను ఇలాగే వదిలేస్తే ఏమవుతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది అంటాడు రాజ్‌. ఇన్నాళ్లు ఏదో బెదిరిస్తున్నారు అనుకున్నాం కానీ ఇంత సీరియస్‌గా స్టెప్‌ తీసుకుంటారని అనుకోలేదు అంటుంది కావ్య. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇన్నాళ్లు పిన్ని బెదిరిస్తుంటే బాబాయ్‌ తో చెప్పి ఆపేవాళ్లం కానీ బాబాయ్‌ కూడా డిసిజన్‌ తీసుకున్నారు ఇప్పుడేం చేద్దాం అంటాడు రాజ్‌.

Advertisement

మీ పిన్ని చస్తాననో.. ఇల్లు వదిలి వెళ్తాననో ఏదో చెప్పి బెదిరించి ఉంటారు. తప్పనిసరై కొంత.. నా ప్రవర్తన నచ్చక కొంత అని అర్థం అవుతుంది. తెల్లారితే వాళ్లు కోర్టుకు వెళ్తారు. తెల్లారే సరికే ఎలాగైనా ఆపాలి అంటుంది కావ్య. కోర్టుకు గానీ వెళ్లడం జరిగితే ఇక మనం జరిగేది ఏది ఆపలేం ఇది పాస్ట్‌ గా స్ప్రెడ్‌ అవుతుంది. ఒక్కసారి మీడియాకు అనుమానం వచ్చిందంటే మొత్తం తెలిసిపోతుంది. పిన్ని బాబాయ్‌ వెళ్లి కోర్టులో స్టే తెచ్చుకుంటే.. ఇక మనం పూర్తిగా మునిగిపోతాం అంటూ ఎమోషనల్‌ అవుతాడు రాజ్‌. కావ్య బాధపడుతుంది.

రాహుల్‌, రుద్రాణి మందు తాగుతూ ఎంజాయ్‌ చేస్తుంటారు. కంగ్రాట్స్‌ మమ్మీ మొత్తానికి అనుకున్నది సాధించావు అంటాడు. రేయ్‌ ఇక కోర్టుకు వెళ్లకుండా ఆపడం ఎవరి తరం కాదురా. మన ఆస్థి రాకుండా ఆపడం కావ్య వల్ల అసలు కాదు అంటుంది రుద్రాణి. ఇద్దరు కలిసి డాన్స్‌ చేస్తుంటారు.  స్వప్న కూడా డాన్స్‌ వస్తూ వాళ్లతో స్టెప్పులేస్తూ మ్యూజిక్‌ ఆపేసి అత్తా అప్పుడే ఆస్థి ముక్కలు చేసి మీ వాటా మీకు వచ్చేసినట్టే ఎంజాయ్‌ చేస్తున్నారేంటి..? అని అడుగుతుంది. కోర్టు నోటీసు వచ్చాక నెక్స్ట్‌ జరిగేది అదే కదా..? నోటీసు వచ్చినంత మాత్రాన అంతా జరిగిపోయినట్టు అనుకుంటున్నారేంటి.? ముందు కోర్టులో మీకు హక్కు ఉందని నిరూపించుకోవాలి. పెట్టిన కేసులో మీరు గెలవాలి.

Advertisement

ఇదంతా జరుగుతుందనుకుంటున్నారా..? అని అడుగుతుంది. దీంతో రుద్రాణి నవ్వుతూ ఓరే రాహుల్‌ ఇంత తింగరిదాన్ని చేసుకున్నావేంట్రా..? మొగుడు చచ్చాక నువ్వు బుద్దిమంతురాలివి అయినట్టు మాట్లాడకు.. మా నాన్న ఆస్థి రాసిచ్చాక ఇప్పుడు వచ్చి నువ్వు మాకు నీతులు చెప్తున్నావా..? నీకు తెలియని విషయం ఇంకొకటి చెప్పనా… మా నాన్న నీకు ఆస్థి రాసిచ్చాడు ఇక నీ జీవితానికి ఏ డోకా లేదని నువ్వు అనుకుంటున్నావేమో.. ఆ ప్రాపర్టీ పర్మినెంట్‌ గా నీ సొంతం కాదు. నువ్వు అనుభవించగలవు. ఎప్పుడైతే మా నాన్న ఆస్థి మొత్తం కావ్యకు రాసిచ్చాడో అప్పుడే నీ ఆస్థి కూడా కావ్య చేతిలోకి వెళ్లింది. ఇప్పుడు చెప్పు ఎవరికి సపోర్టు చేస్తావు అని రుద్రాణి అడగ్గానే.. నా చెల్లికే చేస్తాను. కావ్య ఉండగా మీరు ఏం చేసినా సక్సెస్‌ కాలేరు. నా చెల్లెలు గురించి మీకు ఇంత తెలిసినా ఇంకా తక్కువ అంచనా వేస్తున్నారా..? మీరు కోర్టులో గెలవడం కాదు కదా..? కనీసం కోర్టు మెట్లు కూడా ఎక్కలేరు అంటూ వెళ్లిపోతుంది స్వప్న.

మరుసటి రోజు ప్రకాష్‌ బాధగా ఇందిరాదేవి మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ధాన్యలక్ష్మీ వచ్చి కోర్టుకు టైం అవుతుంది వెళ్దాం పద అంటుంది. ప్రకాష్‌ రానని చెప్పడంతో బలవంతంగా తీసుకుని వెళ్తుంది ధాన్యలక్ష్మీ. కింద లాయర్‌ రావడంతో అందరూ షాక్‌ అవుతారు. ఎవరికోసం వచ్చావని అడుగుతారు. మేమే పిలిపించామని ప్రకాష్‌, ధాన్యలక్ష్మీ వస్తారు. దీంతో ఇందిరాదేవి, అపర్ణ, సుభాష్ తమ మాటలతో ప్రకాష్‌ను కన్వీన్స్‌ చేయాలని చూస్తారు. కానీ ధాన్యలక్ష్మీ వినదు. ఇంతలో కావ్య వచ్చి తాత ఆస్థి మనవడికి కదా హక్కు ఉండేది అని అడుగుతుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. లాయరు కూడా అవునని చెప్తాడు. మరి వీళ్ళిద్దరూ కోర్టులో కేసు వేస్తే నిలబడుతుందా..? అని కావ్య అడుగుతుంది.

దీంతో లాయరు నిలబడదు అని చెప్తాడు. ధాన్యలక్ష్మీ మాత్రం మా ఆయన చేత కేసు వేయించకపోతే.. నా కొడుకు చేత వేయిస్తానని అంటుంది. ఇంతలో కళ్యాణ్‌ కోపంగా అమ్మా అంటూ పిలిస్తూ వస్తాడు. నా ఇష్టం లేకుండా.. నా సంతకం లేకుండా.. నా అనుమతి లేకుండా కేసు ఎలా వేయిస్తారు..? అంటూ తిడతాడు. లోపలికి వచ్చి నేనే ఈ ఇంటి యజమాని మనవడిని అంటూ కళ్యాణ్‌ చెప్పగానే.. ధాన్యలక్ష్మీ కోపంగా కళ్యాణ్‌ ఇది నీ భవిష్యత్తు కోసమే అని తెలుసా..? నీ కోసం ఇంత మందిని ఎదిరించి.. ప్రతిరోజు గొడవపడి చివరికి కోర్టుకు కూడా వెళ్లాలనుకుంటే ఆఖరికి మీ నాన్న కూడా ఒప్పుకున్నాక నువ్వు ఇలా అంటావేంటిరా..? అంటుంది. దీంతో కళ్యాణ్‌, ప్రకాష్‌ను అడగ్గానే.. నేను తప్పించుకోలేకపోయాను అంటాడు. దీంతో కళ్యాణ్‌ కోపంగా ధాన్యలక్ష్మీని తిడతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Big Stories

Advertisement
×