E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: చింటును దత్తత తీసుకోబోతున్న బాలు.. రవి, శృతి మధ్య గొడవ.. ప్రభావతి పరువు తీసేసిన బాలు..

Gundeninda GudiGantalu Today episode: చింటును దత్తత తీసుకోబోతున్న బాలు.. రవి, శృతి మధ్య గొడవ.. ప్రభావతి పరువు తీసేసిన బాలు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode January 6th: నిన్నటి ఎపిసోడ్ లో.. అంటూ బర్త్డే అని తెలుసుకున్న మీనా బాలు ఇద్దరు కూడా సుశీలమ్మను అడుగుతారు.. వాడి పుట్టినరోజు అని కూడా మీరు మాకు చెప్పడం లేదు మేమంతా పరాయి వాళ్ళం అయిపోయాం అని అంటారు. అదేం లేదు బాబు ఎవరికీ చెప్పలేదు అందుకే అనేసి అనగానే సరే అమ్మ వెళ్దాం పద అని అంటాడు. మీకు ఎన్నో పనులుంటాయి కదా మీరు వెళ్ళండి పిల్లలు ఎదురుచూస్తున్నారని వెళ్లి వారితో కేక్ కట్ చేయిస్తాను అనేసి ఆమె అంటుంది. మమ్మల్ని రావద్దని చెప్తున్నారా అని బాలు అడుగుతాడు. అదేమీ లేదు రండి బాబు అని లోపలికి తీసుకొని వెళుతుంది.. మీనా బాలు హాల్లోకి రాగానే అక్కడ రోహిణి బ్యాగ్ చూసి సుశీల వాళ్ళ గుర్తుపడతారేమో అని కంగారు పడిపోతూ ఆ బ్యాగ్ ను తీసుకెళ్లి వంట గదిలో పెడుతుంది.. బాలు చింటూ తల్లి గురించి అన్నీ విషయాలను తెలుసుకుంటాడు.. చింటూ ఎలాగైనా సరే దత్తత తీసుకోవాలని అనుకుంటాడు.. మీనా కూడా చాలా సంతోషంగా ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు మీనా ఇద్దరు కూడా చింటూ నీ దత్తత తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు.. ఇది చాలా మంచి నిర్ణయం అండి మనం ఒకసారి గుడికి వెళ్లి దేవుడి నిర్ణయం కూడా మనం తెలుసుకుందామని మీన అంటుంది.. అయితే మీనా ఆ మాట అనగానే బాలు దేవుడొచ్చి సలహా ఇస్తాడు అని అంటాడు. ఆ తర్వాత బాలు మీనా ఇద్దరు కలిసి ఒక గుడికి వెళ్తారు. ఆ గుడిలో పూజారికి కొన్ని చీటీలు ఇస్తారు.. అక్కడ వాళ్లు దేవుడిని అడుగుతారు.. మీనా ఒక చీటీ తీస్తుంది అయితే అందులో దత్తత తీసుకోకపోవడమే మంచిది అని రాసి ఉంటుంది.. అది చూసి మీనా షాక్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ చీటీలో దత్తత తీసుకోవద్దని వచ్చిందండి మనం తీసుకుంటే ఎటువంటి సమస్యలైనా వస్తాయేమో అని కంగారు పడుతుంది..

Advertisement

మనము మంచి పని చేస్తున్నాం కదా ఎందుకు భయపడాలి? ఒకసారి దేవుడిది సలహా తీసుకున్నాము. ఇక ఇంట్లో వాళ్లకి చెప్పి ఏం జరుగుతుందో చూద్దాం అని బాలు మీనా అనుకుంటారు. ఆ తర్వాత ప్రభావతి తన డాన్సర్ స్కూల్ కి చాలామంది స్టూడెంట్స్ వచ్చారని సంతోషంగా ఉంటుంది.. అయితే కామాక్షి మాత్రం స్టూడెంట్స్ వస్తున్నారని మురిసిపోవద్దు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి అని అంటుంది.. అప్పుడే అక్కడికి వచ్చిన అందరూ స్టూడెంట్స్ ప్రభావతికి నమస్కారం చేసి క్లాస్ లో జాయిన్ అయిపోతారు.. వాళ్లందరికీ కొన్ని మూమెంట్స్ ని ప్రభావతి చెప్తుంది.. పిల్లలందరూ ప్రభావతి చెప్పినట్లు చేస్తారు.

ఆ తర్వాత అందులోకి ఒక ప్రేమ జంట కూడా వస్తుంది.. వాళ్ళిద్దరూ కేవలం ప్రేమించుకోవడానికి సాకు కోసమే ఆ క్లాసులో జాయిన్ అవుతారు.. అది తెలుసుకోలేని ప్రభావతి వాళ్ళు నిజంగానే స్టూడెంట్స్ అని అనుకుంటుంది. ఇద్దరు మాత్రం ప్రభావతి కళ్ళు కప్పి ప్రేమలో మునిగి తేలాలని అనుకుంటారు.. ఇవాల్టికి ఇది సరిపోతుంది రేపు మళ్లీ వచ్చి కొత్త స్టెప్పులను నేర్పిస్తాను అని ప్రభావతి అంటుంది.. కామాక్షి ప్రభావతి పై సెటైర్లు వేస్తూనే ఉంటుంది. నువ్వు నా మీద సెటైర్లు వేయడం ఆపేసి నాకు ఒక జ్యూస్ ఇవ్వు అని కామాక్షిని అడుగుతుంది. ఖర్చవుతుంది అని కామాక్షి కూడా ప్రభావతికి జలకిస్తుంది.

Advertisement

రవి శృతి ఇద్దరూ గొడవ పడిన తర్వాత ఇంటికి వచ్చి రవి శృతిని రెస్టారెంట్ కి వెళ్లి భోజనం చేద్దామని అడుగుతాడు.. కానీ శృతి మాత్రం గొడవ పడిన తర్వాత రెస్టారెంట్ తీసుకెళ్లాలని ఎవరైనా చెప్పారా అని ఉంటుంది.. మేము ఎంత చెప్పినా సరే వినకుండా నువ్వు నన్నే తిట్టావు. అమ్మ చెక్ ఇస్తే మా అమ్మని అడగాలి కానీ నన్ను అంటావేంటి అని శృతి కూడా మళ్లీ రవితో గొడవ పడుతుంది.. రవి నువ్వు ఇప్పుడు రెస్టారెంట్ కి వస్తావా రావా అని అడుగుతాడు. దానికి శృతి షాపింగ్ తీసుకొని వెళ్తేనే నేను రెస్టారెంట్ కి వస్తాను అని అంటుంది. ఏదో మూడిగుంటవ్ కదా అని రెస్టారెంట్ కి వెళ్దామని అడిగాను కానీ నువ్వు ఇలా మరొక ఆఫర్ పెడితే నా వల్ల కాదు అని రవి అంటాడు..

Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ నటీనటులు.. ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారు..?

అతనికి వీళ్లిద్దరు గొడవ కాస్త పూర్తయి ఇద్దరు రెస్టారెంట్ కి వెళ్లాలని రెడీ అవుతారు.. బాలు ఈ దత్తత తీసుకోవాలని అనుకున్న విషయాన్ని ఇంట్లో ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాడు.. అప్పుడే అందరూ అక్కడికి రావడంతో బాలు చెప్పాలనుకుంటాడు కానీ ప్రభావతి కనిపించకపోవడంతో ప్రభావతి కోసం వెతుకుతాడు.. ఆ చింటూ వాళ్ళ అత్త కాదు అమ్మ అంట. ఆమె ఆమె స్వార్థం కోసం దుబాయ్ కి వెళ్లి అక్కడ ఎవరు నువ్వు పెళ్లి చేసుకుంది.. ఒంటరిగా వదిలేసింది.. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అమ్మ ఎప్పుడు వస్తది అని అడుగుతాడు.. డాన్స్ క్లాస్ కి వెళ్ళింది కదా వస్తుందిలే అని సత్యం అంటాడు.. ఇక ప్రభావతి తన స్టూడెంట్స్ తో కలిసి ఇంటికి వస్తుంది.. బాలు ఇలాంటి స్టూడెంట్ ఎలా వస్తారు అని అంటాడు.. తర్వాత మాస్టర్ అని పిలవగానే బాలు ప్రభావతిని ఒక ఆట ఆడుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో దత్తత గురించి బాలు ఇంట్లో చెప్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×