E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి నూతన వాహనయోగం – చేపట్టిన పనుల్లో లాభాలు

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి నూతన వాహనయోగం – చేపట్టిన పనుల్లో లాభాలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన జనవరి 6వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

గృహమున సంతాన శుభకార్య ప్రస్తావన వస్తుంది. ఆర్థిక  పురోగతి కలుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో లోటుపాట్లు సరిచేసుకుంటారు.   అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తి అవుతాయి. దూర ప్రాంత దైవ దర్శనాలు చేసుకుంటారు.

వృషభం

Advertisement

కుటుంబమున కొందరి మాటలు వివాదాస్పదంగా మారతాయి. ధన పరంగా ఇబ్బందులు తప్పవు.  దైవ చింతన పెరుగుతుంది ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ముఖ్యమైన పనులు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని  మార్పులు ఉంటాయి. 

మిథునం

వృత్తి వ్యాపారాలలో నిరుత్సహ వాతావరణం ఉంటుంది. ఆదాయమార్గాలు మందగిస్తాయి. ఆప్తులతో  మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు  మరింతగా మందగిస్తాయి. మానసికంగా సమస్యలు కొంత బాధిస్తాయి.  ఉద్యోగాలలో ఇతరుల నుండి  విమర్శలు పెరుగుతాయి.

కర్కాటకం

Advertisement

నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. సంఘంలో పెద్దల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగమున ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. వ్యాపారమున నూతన ఆలోచనలతో ముందుకు సాగుతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.  నూతన  వాహనం కొనుగోలు చేస్తారు.

సింహం

ఉద్యోగమున శ్రమకు తగిన గుర్తింపు లభించదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. సంఘంలో పెద్దల  పరిచయాలు అంతగా కలసిరావు. కుటుంబ సభ్యుల ప్రవర్తన  కొంత చికాకు పరుస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయానికి ఇబ్బంది తప్పదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. 

కన్య

ఉద్యోగులకు అనుకూలత పరిస్థితులుంటాయి. చుట్టుపక్కల వారితో వివాదాలలో పై చేయి సాధిస్తారు. దైవ కార్యక్రమాలకు ధన అందిస్తారు. స్ధిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలలో  మెరుగైన లాభాలు పొందుతారు. రాజకీయ సభ సమావేశలకు హాజరవుతారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

వృత్తి, ఉద్యోగాలలో ప్రతికూల  పరిస్థితులు వేదిస్తాయి. స్థిరాస్తి సంభందిత విషయాలలో వివాదాలు తప్పవు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్యుని సంప్రదించడం మంచిది. చేపట్టిన పనులు అతికష్టం మీద పూర్తి అవుతాయి.  ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు అంతగా కలసిరావు.

వృశ్చికం

ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో  మీ అంచనాలు నిజం అవుతాయి. బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.   సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు.  ఆర్ధిక ఇబ్బందుల నుండి కొంత వరకు బయటపడతారు. 

ధనుస్సు

 ఉద్యోగులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. మిత్రులతో  శుభకార్యాలకు హాజరవుతారు. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులు నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి లాభాలు పొందుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

మకరం

వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు బంధు వర్గం వారితో మాటపట్టింపులంటాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడం మంచిది కాదు. దూర ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య  విషయంలో శ్రద్ద వహించాలి.  

కుంభం

ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని పనులు  అనుకున్న సమయానికి పూర్తికావు. ఖర్చులకు తగిన ఆదాయం లభించదు. నూతన రుణయత్నాలు వ్యర్ధంగా మిగులుతాయి.

మీనం

సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి. దీర్ఘ కాలిక వివాదాల నుండి ఉపశమనం పొందుతారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×