E-Paper
Advertisement

Water dispute: ఏపీ, తెలంగాణ నీటి వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Water dispute: ఏపీ, తెలంగాణ  నీటి వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Advertisement

Water dispute: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న గోదావరి జలాల వివాదాన్ని న్యాయ పోరాటాల కంటే.. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడం బెటరని సుప్రీంకోర్టు సూచించింది. సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని చెప్పింది. మధ్యవర్తిత్వంతో సహా మూడు పరిష్కార మార్గాలను సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ ఇరు రాష్ట్రాల ముందుంచారు.

పోలవరం ప్రాజెక్టును అనుసంధానిస్తూ ఏపీ సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా ‘పోలవరం–నల్లమల సాగర్‌’ ఎత్తిపోతల పథకం చేపట్టిందని, ఇందుకు సంబంధించి టెండర్లు పిలిచిందని, దీనిపై తక్షణమే స్టే ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ జాయ్‌మాల్యా బగ్చితో కూడిన సీజేఐ ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. తెలంగాణ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి, ఏపీ తరఫున మరో సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, ఇతర న్యాయవాదులు వాదనలు విన్పించారు.

Advertisement

వారి వాదనల టైంలో సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కేవలం ప్రాజెక్టు నివేదికల తయారీ కోసమే టెండర్లు పిలిచామన్న వాదనలపై స్పందించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్లానింగ్‌ దశలోనే ఉండొచ్చని… కానీ ఒకవేళ భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు నిబంధనలకు విరుద్ధమని తేలి ఆగిపోతే.. ప్లానింగ్, డాక్యుమెంటేషన్‌ కోసం ఖర్చు చేసిన ప్రజల నిధులు వృధా అవుతాయి కదా అని ప్రశ్నించారు. ఈ పిటిషన్‌ విచారణార్హతను పరిశీలిస్తున్నామని చెప్పారు.

అయితే సీజేఐ జస్టిస్‌ ఈ సమస్యలకు మూడు పరిష్కార మార్గాలను ఇరు రాష్ట్రాల ముందు ఉంచారు. వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. మొదటి మార్గంగా.. ఇది రెండు రాష్ట్రాల నడుమ తలెత్తిన జల వివాదం కాబట్టి, ఆర్టికల్‌ 32 కింద రిట్‌ పిటిషన్‌గా కాకుండా, ఆర్టికల్‌ 131 ప్రకారం ‘సివిల్‌ సూట్‌’గా దాఖలు చేస్తే సమగ్ర విచారణ జరిపేందుకు కోర్టుకు వెసులుబాటు ఉంటుందన్నారు.

Advertisement

రెండవ మార్గంలో.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ వివాదంపై ఒక హై పవర్‌ కమిటీని ఏర్పాటు చేసినందున, ఆ కమిటీకి.. తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యర్థనలను పరిశీలించి, అవసరమైతే ఆ ప్రాజెక్టును నిలిపివేసే ‘నిర్ణయాధికారాన్ని’ కల్పిస్తూ కోర్టు ఆదేశాలిచ్చే అవకాశం ఉంది.

Also Read: ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు.. హరీష్ రావు విచారణకు అనుమతి కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్

ముఖ్యమైన మూడవ మార్గంగా.. కోర్టు తీర్పుల దాకా వెళ్లకుండా, ఇరు రాష్ట్రాల ప్రతినిధులు కలిసి కూర్చుని, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను స్నేహపూర్వకంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయవచ్చని చెప్పారు. ఈ ప్రతిపాదనలపై తమ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలుసుకునేందుకు సమయం కావాలని తెలంగాణ తరఫు న్యాయవాది సింఘ్వీ కోరడంతో.. ధర్మాసనం తదుపరి విచారణను 12వ తేదీకి వాయిదా

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×