BigTV English

Gundeninda GudiGantalu Today episode: బాలుకు నిజం చెప్పని మౌనిక.. రవి, శృతిలను ఇంటికి తీసుకొచ్చేసిన ప్రభావతి..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు నిజం చెప్పని మౌనిక.. రవి, శృతిలను ఇంటికి తీసుకొచ్చేసిన ప్రభావతి..

Gundeninda GudiGantalu Today episode January 8th : నిన్నటి ఎపిసోడ్ లో.. మౌనిక అత్తింట్లో ఇబ్బంది పడుతుందని మౌనికను తీసుకురావాలని బాలు ఆవేశంగా వెళ్లడం చూసి ప్రభావతి ఆపుతుంది ఇంట్లో అందరూ బాలుని తిడతారు. ప్రభావతి మీనా ను బాలునిద్దరిని కలిపి తిడుతుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ బాలుని తిడతారు బాలుని ఆపే ప్రయత్నం చేస్తారు. మనోజ్ అడ్డుకుంటే మనోజ్ను తోసేస్తాడు. ఇక సత్యం బాలు దగ్గరకొచ్చి అందరి గురించి వదిలేయ్ నా గురించి నీకు తెలియదా నేను డబ్బు మనిషినా డబ్బుకు లొంగే వాళ్లకు కనిపిస్తున్నానా నా కూతురు ఎంత సంతోషంగా ఉండాలని నేను అనుకుంటాను నీకు తెలియదా అనేసి అడుగుతాడు. మౌనిక ఎలా ఉన్నా కూడా నువ్వు ఆ ఇంటికి వెళ్లడానికి వీల్లేదు కనీసం ఫోన్ చేయడానికి కూడా వీల్లేదని నా మీద ఒట్టు వేయని ఒట్టు వేయించుకుంటాడు. ఇక మీనా బాలు పైకి వెళ్తారు. బాలు కోపాన్ని కంట్రోల్ చేసేలా మీనా మాట్లాడుతుంది. మీరు ఆవేశాన్ని తగ్గించుకోవాలి మౌనికకు ఏమీ కాకుండా మనం చూసుకుందాం వాడు మారతాడేమో మంచి రోజులు వస్తాయేమో చూద్దామని అంటుంది. ఇక టిఫిన్ చేసి గుడికి వెళదామని అంటుంది మీనా.. ప్రభావతి, బాలు సెటైర్లకు సత్యం కౌంటర్ వేస్తాడు. ఇక మీనా, బాలు గుడికి వెళ్తారు. ప్రభావతి,సత్యం కు జీవితాంతం దెబ్బ కొట్టిన వాళ్ళం అవుతాం అంటూ మాస్టర్ ప్లాన్ వేస్తుంది శృతి తల్లి .దీనికి సురేంద్ర కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సురేంద్ర శోభా మాట్లాడుకుంటుంటారు. సత్యం ను ఎలాగైనా దెబ్బ కొట్టాలి సత్యం కు ఆ సంతోషాన్ని దూరం చేయాలని శోభ అంటుంది. తన కొడుకులు చూసి మురిసిపోతున్నాడు కదా తన కొడుకుల నుంచి ఆ సంతోషాన్ని దూరం చేయాలని అందుకు మనము ఆ ఇంటికి వెళ్లాల్సిందే అని చెప్తుంది. వాళ్ళింటికి శృతి రవిలను పంపించేస్తే ఇక వాళ్లల్లో వాళ్ళు కొట్టుకొని చస్తారు అక్కడితో ఫ్యామిలీ ముక్కలు అయిపోతుంది అని శోభ అంటుంది. నేను మీ భార్యను కాబట్టి మీ పగని పంచుకోవాలి అందుకే ఇలా చెప్తున్నాను మీరు ఆ ఇంటికి వాళ్ళని పంపించడానికి రావాల్సిందే అని రిక్వెస్ట్ చేస్తుంది. ఇక దానికి సురేంద్ర సరే అంటాడు. ఇద్దరు కలిసి సత్యం ఫ్యామిలీని ఎలాగైనా నాశనం చేయాలని అనుకుంటారు.
ఇక బాలు, మీనా గుడికి వస్తారు. ఈ సమయంలో బాలుకు తెలియకుండా.. మౌనిక కోసం తెచ్చిన గాజులను తీసుకువచ్చి, వాటికి పూజ చేపిస్తుంది. తన చెల్లెల్ని కాపాడమని ఆ దేవుని ప్రార్థిస్తాడు బాలు. తన భర్త కోరుకున్న కోరికలను తీర్చమని మీనా ప్రార్థిస్తుంది. ఇంతలోనే మౌనిక సంజు అదే గుడికి వస్తారు. ప్రదక్షిణలు చేసే సమయంలో మౌనిక తన అన్నవదినలను చూస్తుంది. వారి దగ్గరకు వచ్చి సంతోషంగా మాట్లాడుతుంది. ఇక బాలును నా మీద కోపంగా ఉన్నావా అన్నయ్య నన్ను క్షమించు అనేసి అడుగుతుంది. దానికి బాలు నేను ఆ విషయం ఎప్పుడో మర్చిపోయినమ్మ నా బాధంతా నువ్వు ఆ ఇంట్లో ఎలా ఉన్నావు అని అంటాడు. అయినా కూడా నువ్వు ఆ ఇంట్లో సంతోషంగానే ఉన్నావు కదా మౌనిక నీకు ఏదైనా బాధ అనిపిస్తే మాకు చెప్పకుండా మాత్రం ఉండదు అని రిక్వెస్ట్ చేస్తుంది. నేను ఆ ఇంట్లో బాగానే ఉన్నాను అని సంజు చేసిన విషయాలని గుర్తు చేసుకుంటుంది. ఆయనకు నీ మీద మాత్రమే కోపం నామీద కోపం లేదు నన్ను బాగానే చూసుకుంటున్నాడు అని అంటుంది. దాంతో బాలు మీనా సంతోషంగా ఉంటారు. ఇక పూజ చేయించడానికి గాజులు తీసుకొచ్చిన మీ నాకు పూజారి గాజులు ఇస్తాడు. ఈ గాజులు నీకోసమే నమ్మ నీ పెళ్లిలో నీకు ఇద్దామని అనుకున్నాను. కానీ అనుకోకుండా జరిగిపోయింది. మీనా ఈ గాజులను పూజ చేయించాలని తీసుకొచ్చింది నువ్వు ఎలాగో వచ్చావు ఇవి నీ చేతులకు వేసుకో అనేసి వేస్తాడు.

ఇక సంజు సువర్ణ దగ్గరికి వచ్చి అదెక్కడ అని అడుగుతాడు. సువర్ణ మౌనిక బాలు దగ్గర ఉండటం చూసి కవర్ చేయాలని అనుకుంటుంది. బాలు తన చెల్లెలికి బంగారు గాజులేసి సంతోషపడతాడు బాలు. ఏ కష్టం వచ్చినా ఫోన్ చేయమని ధైర్యం చెబుతాడు. మరోవైపు మౌనిక కనిపించిపోయేసరికి.. సంజు వెతుక్కుంటూ వస్తాడు. ఆ విషయాన్ని గమనించిన మౌనిక.. సంజు చూస్తే మళ్ళీ గొడవవుతుందని, తన అన్నయ్యకు చెప్పి వెళ్లిపోతుంది.. తన చెల్లెలు చూసేసరికి ఇన్ని రోజులుగా ఉన్న కోపం, భయం, బాధ అన్నిపోతాయి. మరోవైపు.. సంజు, మౌనిక కోసం తిరిగి వస్తాడు. కానీ, అక్కడ కనిపించక, మళ్లీ గుడిలో కనిపించేసరికి.. ఎక్కడికి వెళ్ళిపోయావ్? అని నిలదీస్తాడు. దీంతో సంజీవ్ తల్లి సమాధానం ఇస్తూ ‌.. ముడుపు కట్టి.. ఇప్పుడే వచ్చింది. ఎందుకు అలా అనుమానిస్తున్నావ్ అంటూ కవర్ చేస్తుంది. దీంతో సంజూ శాంతిస్తాడు. శృతి రవితో గొడవ పడుతుంది. రాక్షసి గురించి మనం ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లేదు నీకు నీ చెల్లెలి మీద బాధ్యత ఉంది కదా మరి నీ మాట ఎందుకు వినట్లేదు అని అనగానే రవి మనం సరిగ్గా పెళ్లి చేసుకుని ఉంటే మన మాట వినేవాళ్లు మనం చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం కదా అందుకే వాళ్లకు కోపం అని ప్రతిదానికి పెళ్లి దగ్గరికే తీసుకొని వస్తాడు. దానికి శృతి కోపంతో రగిలిపోతుంది. మనం పెళ్లి చేసుకోవడం వల్ల ఇదంతా జరిగిందా? నీకు మన పెళ్ళంటే ఇష్టం లేదు కదా అందుకే నువ్వు ఇలా చేసావని అంటుంది. అసలు నిన్ను కాదు మీ అమ్మానాన్నని అనాలి అని లోపల ప్రభావతి అక్కడికి వస్తుంది. మొగుడు పెళ్ళాల అన్నాక చిరుబురులాడితేనే సంతోషం ఉంటుంది నేను మీ మామయ్య ఎంత గొడవపడతామో అంత కలిసుందాం అనేసి చెప్తుంది. అప్పుడే శోభా ఎంట్రీ ఇస్తుంది.


ఆమెను చూడగానే ప్రభావతికి అనుమానం వస్తుంది. తన ప్లాన్ ను చెడగొడుతుందా? అని భయపడుతుంది. కానీ, శృతి తల్లి ప్రభావతికి సపోర్టుగా మాట్లాడుతూ.. ఎన్ని రోజులైనా వాళ్ళు మీ ఇంట్లోనే ఉండాల్సిన వారు అంటూ ప్రభావతి షాక్ ఇస్తుంది. మొదట ప్రభావతి కూడా నమ్మదు. అయితే.. తీసుకపోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు గాని,సంప్రదాయబద్దంగా.. మీ కూతుర్ని మా ఇంటికి తీసుకువస్తే బాగుంటుందని, సత్యం కాస్త సంప్రదాయాలకు ఎక్కువ విలువిస్తాడని అంటుంది.. దానికి శోభా అలాగే అని అంటుంది. దీంతో ప్రభావతి తన ప్లాన్ అన్ని వర్కౌట్ అవుతున్నాయని, కోటీశ్వరులు పోయానని కలలు కంటుంది. కానీ, శృతికి తన అత్తాగారింటికి వెళ్లడం ఇష్టం లేదు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో రవి, శృతి లు ప్రభావతి ఇంటికి వస్తారు. ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Brahmamudi Serial Today August 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ను తిట్టిన కావ్య – ప్రేమ లేకపోతే ఎందుకొచ్చావన్న రాజ్‌   

Illu Illalu Pillalu Today Episode: తప్పించుకున్న ఆనందరావు.. భద్రకు దొరికేశాడు.. మొత్తం నిజం కక్కేసాడుగా..

Intinti Ramayanam Today Episode: ఇంట్లోంచి లేచిపోతున్న ప్రణతి, భరత్.. అక్షయ్ ను కూల్ చేసిన అవని… భరత్ ను టార్గెట్ చేసిన పల్లవి..

Big Stories

×