BigTV English

Daaku Maharaaj pre release event : డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు… కారణం ఏంటంటే?

Daaku Maharaaj pre release event : డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు… కారణం ఏంటంటే?

Daaku Maharaaj pre release event : నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదివరకే ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా.. అనూహ్యమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక అదే జోష్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి మేకర్స్ పెద్ద ఎత్తున సన్నహాలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే రాయలసీమ గడ్డపై ముఖ్యంగా అనంతపురం జిల్లాలో చాలా పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని ప్లాన్ చేశారు.. ఈరోజు అనగా జనవరి 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తారని తెలిపారు. అంతేకాదు అటు అనంతపురంలో కూడా అన్ని ఏర్పాట్లు పెద్ద ఎత్తున పూర్తీ అయ్యాయి. దీనికి తోడు బాలకృష్ణ కు సంబంధించి అతిపెద్ద కటౌట్ ని కూడా ఏర్పాటు చేశారు.


అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు..

అభిమానులు కూడా తమ అభిమాన హీరో కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న సమయంలో సడన్ గా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేసినట్లు సమాచారం. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సడన్గా ఈవెంట్ క్యాన్సిల్ చేయడానికి గల కారణాలేంటి అంటూ కూడా ఆరా తీస్తున్నారు.


ఈవెంట్ క్యాన్సిల్ పై ప్రకటన విడుదల చేసిన బాలయ్య..

“తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో కొందరు భక్తులు చనిపోయిన సంఘటన అత్యంత బాధాకరం. మృతులకు నా నివాళి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఈ విషాదకర సందర్భంలో అనంతపురంలో జరగాల్సిన డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడం సముచితం కాదు అనే ఉద్దేశంతోనే దానిని రద్దు చేయడం జరిగింది” అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు బాలకృష్ణ. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

అసలు తిరుపతిలో ఏం జరిగిందంటే?

తిరుమల తిరుపతి దేవస్థానంలో 2025 జనవరి 10 నుండి 19 వరకు వైకుంఠ ఉత్తర ద్వారా దర్శనాలు కల్పించబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్వామి వారిని దర్శించుకోవడానికి దాదాపు 7 లక్షల మందికిపైగా భక్తులు హాజరుకానున్నట్లు టీటీడీ అంచనాలు వేసింది. ఇకపోతే జనవరి 8వ తేదీ ఉదయం వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. ఉదయం అంతా సవ్యంగా. అయితే అదే రోజు సాయంత్రం టికెట్ జారీ దగ్గర తోపులాట, తొక్కిసలాట జరగడంతో ఏకంగా 6 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమందికి గాయాలు అయ్యాయి. ఈ కారణంగానే అనంతపురంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసినట్లు చిత్ర హీరో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరు కావలసిన నారా లోకేష్..

ఇకపోతే తిరుపతి ఘటనతో ఈవెంట్ ని కాస్త బాలయ్య రద్దు చేసుకున్నారు. ఎన్నికల అనంతరం బాలయ్యకే అనంతపురంలో తొలి సినిమా ఈవెంట్ కూడా ఇదే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ వారు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఈవెంట్ కి ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్(Nara lokesh) హాజరు కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు తిరుపతి ఘటన వల్ల మొత్తం క్యాన్సిల్ అయింది అని చెప్పవచ్చు.

 

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×