Gundeninda GudiGantalu Today episode july 24 th: నిన్నటి ఎపిసోడ్ లో.. గుడికి వెళ్ళిన బాలు మనోజ్ ని చూసి షాక్ అవుతాడు.. నువ్వేంటి రా ఇక్కడ ఈ పరిస్థితి ఏంటి రా అనేసి అడుగుతాడు. మీరెవరో నాకు తెలియదు అని వాళ్ళు అంటారు. నాటకాలు ఆడొద్దు ఇంక వెళ్ళిపోదాం అని అంటే లేదు నేను ఇక్కడే ఉండాలి ఈరోజు అంతా అని అంటాడు మనోజ్.. అక్కడ ఉన్న ముష్టి వాళ్ళు కూడా ఇతనికి అడుక్కోవడం కూడా రాదు జీవితంలో ఎలా పైకి వస్తాడో అర్థం కావట్లేదు అని అంటారు. దానికి చాలా సుకుమారుడు పెరిగారండి జాబ్ కూడా చేయాలంటే బద్దకం వేసి డిగ్రీలు చదివి పార్క్ లో పల్లీలు తింటున్నాడు. కానీ ఇప్పుడు ఇలా అడుక్కుంటున్నానంటే అమ్మ చచ్చిపోతుంది అని బాలు అంటాడు. ఇది పర్మినెంట్ కాదు లెండి ఆయన ఏదో పరిహారం కోసం ఒకరోజు అడుక్కోవాలని అనుకున్నాడట. అందుకే ఇలా మారాడు అని అంటారు. మనోజ్ ను బలవంతంగా ఇంటికి తీసుకొని వెళ్తాడు. మనోజు అమ్మా అని అరుస్తాడు. ముష్టి వాడిలా ఉండకుండా అమ్మ అంటావేంట్రా అని అంటుంది. మనోజు ముఖం మీద ఉన్న గుడ్డ తీస్తాడు. సత్యం ప్రభావతి ఇద్దరూ షాక్ అవుతారు.. రోహిణి మాత్రం బాగా తిడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నా కూతురికి మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నాడు విన్ని బయటికి పంపించండి అని సురేందర్ అంటాడు. అసలు నిన్ను ఎవరు పిలిచారు అని బాలు పై సురేందర్ సీరియస్ అవుతాడు. అక్కడకు వచ్చిన శృతి నేనే రమ్మని పిలిచాను. మా ఇంట్లో కలిసి అత్తగారింట్లో కాపురం చేయడానికి వెళుతున్నాను అని శృతి అంటుంది. వెళ్తానంటే నేను పంపించాను ఆ నరకంలోకి నిన్ను మళ్ళీ ఎలా పంపిస్తానని అనుకుంటున్నావని సురేందర్ అంటాడు. తన భర్తతో అత్తింట్లో కాపురం చేయాలని అనుకుంటుంటే మీరు అడ్డుపడతారేంటి? నేనుండగా అలాంటి పని జరగనివ్వను అని బాలు అంటాడు. ఇక శోభన నువ్వు హ్యాపీగా ఉండమ్మా అని అంటుంది. తల్లి మాట విన్న శృతి హ్యాపీగా వెళ్ళిపోతుంది.
మీనా అందరు టిఫిన్ చేసిన తర్వాత టిఫిన్ చేస్తానని వెళ్లి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటుంది.. ఉన్న ఒక ఇడ్లీ ని కాస్త చట్నీని తినబోతుంటే ప్రభావతి వచ్చి అడ్డుకుంటుంది. నాకు మాత్రం ఇక్కడ తిండి సహించలేదు నువ్వు మాత్రం బాగా తినవే అంటూ ప్రభావతి రెచ్చిపోతుంది. అవును అత్తయ్య మీరు మిగిలిన ఒక ఇడ్లీ చట్నీని చూసుకుని తింటున్నాను మీరు భోజనం చేసే టైం కి నేను టిఫిన్ చేస్తున్నాను అని మీనా అంటుంది. ఇంకో నాలుగు ఇడ్లీలు వేసుకోవచ్చుగా ఎవరు వద్దన్నారు అని ప్రభావతి అంటుంది. ఒక ఇడ్లికి ఇన్ని మాటలు అంటున్నారు ఇంకా నాలుగు తింటే ఇంకేమైనా ఉందా అని మీనా గట్టిగానే సమాధానం చెప్తుంది.
ప్రభావతి మీనా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా బాలు వచ్చి విజిల్ వేస్తాడు. ఎందుకురా విజిల్ వేస్తున్నావు అని అడుగుతాడు. మీ అమ్మలాగా నువ్వు విజిల్ వేస్తున్నావ్ ఏంటి అని అంటాడు.. అమ్మ వేసే విజిల్ భార్య భర్తల్ని విడగొట్టడానికి.. నేను వేసే విజిల్ భార్య భర్తలను కలిపిన అని చెప్పడానికి అని బాలు అంటాడు.. అయితే శృతి రవి రావడం చూసి ప్రభావతి సంతోషపడుతుంది. రవి శృతి అంటూ సంతోషపడుతుంది.
మీరిద్దరు వస్తారని అస్సలు ఊహించలేదు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ప్రభావతి పొంగిపోతుంది. మీ అమ్మ నీ మీద దిగులుతో సరిగ్గా అన్నం కూడా తినలేదు రా అని సత్యం అంటాడు. బిర్యానీ తినిందిగా అని సత్యం మళ్ళీ అడుగుతాడు. పంపించిన బిర్యాని చాలా బాగుందిరా మీ అమ్మ మాత్రం వదలకుండా మొత్తం తినేసింది అని సత్యం అనగానే రవి నేను బిర్యాని పంపించాను అని అంటాడు. బాలు నువ్వే పంపించావు రా అని కాలుదొక్కి మరి కవర్ చేస్తాడు.
రోహిణి నువ్వు మళ్ళీ వస్తావని అసలు ఊహించలేదు శృతి మీ నాన్నకు అంత అవమానం జరిగింది కదా మళ్లీ నువ్వు వస్తావని అనుకోలేదు అని శృతి పుల్లలు పెడుతుంది. అది విన్న బాలు ఏంటి పార్లర్ అమ్మ రాదు రాకూడదని అనుకున్నావా అని అడుగుతాడు. అయినా పాస్ట్ ఈజ్ పాస్ట్ అలాంటివన్నీ గుర్తుపెట్టుకోకూడదు.. అయినా నీకేం జరగలేదు కదా జరిగింది నాకు కదా నేనే మర్చిపోయాను నువ్వు ఎందుకు గుర్తుపెట్టుకున్నావు రోహిణి అని శృతి అడుగుతుంది. అందరికీ ఒకలా కొందరికి మరోలా అనిపించింది ఆ సిచువేషన్.
Also Read: తేజేస్వి పరువు తీసేసిన స్రవంతి.. వారంలో మూడు రోజులు అదే..
అంకుల్ ఆంటీ నేను ముందే చెప్తున్నాను అవన్నీ మనసులో పెట్టుకోకుండా హ్యాపీగా ఉండాలి అని కేక్ కూడా తీసుకొచ్చాను. ఈ కేక్ వచ్చేసి మన సంతోషాన్ని మరింత పెంచుకుందామని శృతి అంటుంది. అందరూ కేక్ కట్ చేసి సంతోషంగా ఒకరికొక తినిపించుకొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.. అటు మౌనికను వాళ్ళింట్లో వాళ్ళు ఏడుస్తున్నారని ఇంకాస్త ఏడిపించాలని సంజయ్ ఇంటికి తీసుకొస్తాడు. అయితే సంజయ్ ని మౌనికని చూసి అందరూ సంతోషపడతారు. కానీ సంజయ్ మాత్రం అక్కడ సీను చూసి షాక్ అవుతాడు. మీరు గొడవపడి విడిపోయారు కదా మళ్ళీ ఎలా వచ్చారు అని సంజయ్ అడుగుతాడు. నువ్వు ఎప్పుడు ఇలానే ఉంటామని బాలు దిమ్మతిరిగి పోయేలా చెప్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…