BigTV English
Advertisement

AP Govt: పేదలకు తీపికబురు.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం, ఇంకెందుకు ఆలస్యం

AP Govt: పేదలకు తీపికబురు.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం,  ఇంకెందుకు ఆలస్యం

AP Govt:  రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించడమే కాదు సంక్షేమంపై దృష్టి పెట్టింది చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో కొన్ని హామీలు అమలు చేసిన కూటమి సర్కార్, ఈ ఏడాదిలో 80 శాతం వరకు హామీలను అమలు చేయాలని ఆలోచన చేస్తోంది. ఇప్పటికే తల్లికి వందనం పథకం తెచ్చింది. మరో మూడు వారాల్లో ఉచిత బస్సు స్కీమ్ అందుబాటులోకి రానుంది.  మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయ్యింది ప్రభుత్వం.


పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధమైంది చంద్రబాబు సర్కార్. తాజాగా దీనికి సంబంధించి జీవో నెంబరు 23 జారీ చేయడమేకాదు గైడ్‌లైన్స్ రెడీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఉచితంగా ఇంటి స్థలం పొందాలంటే కచ్చితంగా కొన్ని అర్హతలు ఉండాలి. గ్రామాల్లో కుటుంబానికి మూడు సెంట్లు, పట్టణాల్లో అయితే రెండు సెంట్లు స్థలాన్ని ఉచితంగా ఇవ్వనుంది ప్రభుత్వం.

అర్హతలున్న ప్రతి కుటుంబానికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెబుతోంది ప్రభుత్వం.  ప్రభుత్వం ఇచ్చే స్థలంలో నిర్మాణానికి అవసరమయ్యే నిధులను కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది.  పేదలు ఇళ్లు నిర్మించుకుందుకు పీఎం ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది కేంద్రప్రభుత్వం.


రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఏపీలో ఇంప్లిమెంట్ చేయనుంది. దీనివల్ల పేదలకు కేంద్రం ఇచ్చే డబ్బుకి మరికొంత కలిపి ఏపీ ప్రభుత్వం ఇవ్వనుంది.  ఇల్లు నిర్మించుకునేలా సహాయం చేయనుంది.  ఏపీ ప్రభుత్వం జీవో మేరకు ఇంటి స్థలం పొందాలంటే లబ్దిదారుడికి కచ్చితంగా తెల్ల రేషన్ కార్డు ఉండాలి.  ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తూ ఉండాలి.

ALSO READ: పవన్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు.. అన్నివర్గాలను ఆకట్టుకోవాలంటూ

లబ్దిదారు కుటుంబంలో ఎవరికీ ఇంటి స్థలం ఉండకూడదు మొదటి నియమం. ఇప్పటికే భూమి ఉన్నవారికి స్థలం కేటాయించరు. ఆధార్, రేషన్ కార్డు తప్పనిసరి. కుటుంబ ఆదాయం గ్రామాల్లో నెలకు రూ.10000.. పట్టణాలు లేకుంటే నగరాల్లో నెలకు రూ.12 వేలు లోపు ఉండాలి. ఈ స్థలం పొందేందుకు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లు అర్హులు కారదన్నది మరో పాయింట్.

మున్సిపాలిటీల్లో భూముల దొరకడం కష్టం వల్ల ఖాళీ భూములు ఉన్నాయో చూసి అక్కడ ఇళ్ల స్థలాలను ఇస్తారు. స్థలం లేని చోట ఏపీ టిడ్కో, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా స్థలాలు ఇప్పించనున్నారు. స్థలం పొందేవారు పత్రాలన్ని ఒరిజినల్ చూపించాలి. అప్పుడు మాత్రం కుటుంబంలో ఒకరికి ఇంటి స్థలం రానుంది. లబ్దిదారుల్లో ముందుగా హిల్స్ ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు స్థలాలు ఇవ్వనుంది.

స్థలం ఇచ్చిన రెండేళ్లలోపు ఇంటిని నిర్మించుకోవాలి లబ్దిదారులు. ఒకవేళ నిర్మించుకోకుంటే ఆ స్థలాన్ని వెనక్కి తీసుకునే అవకాశం లేకపోలేదు. ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని ఎవరికీ అమ్మకూడదు, అలాగే ఫ్రీగా ఇవ్వకూడదు కూడా. అలా చేస్తే వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉంది.

ప్రభుత్వం నుంచి పట్టా రాగానే లబ్దిదారుకు ఆ స్థలం సొంతం కానుంది. ఏమైనా అనుమానాలు ఉంటే సమీపంలోని గ్రామ సచివాలయాలను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే అయిన లబ్దిదారులకు జాబితాను గ్రామసభల్లో అధికారులు వెల్లడిస్తారు. ఒకవేళ లేనివారు మళ్లీ అప్లై చేసుకునే అవకాశం ఉంది.

Related News

AP National Observer: ఏపీ నేషనల్ అబ్జర్వర్‌గా అదిత స్వప్న.. ప్రకటించిన అఖిల భారత మహిళా కాంగ్రెస్

Cyber Crime: నారా లోకేష్ పేరుతో ఫేక్ ప్రొఫైల్.. రూ.54 లక్షలు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు

Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి కేసు.. తొలి రాజకీయ అరెస్ట్, వైపీసీలో కొత్త టెన్షన్

Srikakulam: ధర్మాన, తమ్మినేని స్కెచ్ .. జగన్ ఒప్పుకుంటాడా?

CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. తుఫాన్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహరం

AB Venkateswara Rao: ఏబీవీపై.. చంద్రబాబు ప్లాన్ ఏమిటి?

Montha Politics: ఫేక్ ఫెలోస్ అంటూ మండిపడ్డ సీఎం.. ఏపీలో మొంథా రాజకీయం

Veera Brahmendra Swamy: వీరబ్రహ్మేంద్రస్వామి నివాసం కూలిన ఘటనపై స్పందించిన మంత్రి లోకేష్

Big Stories

×