Family Stars Promo: బుల్లితెర ప్రేక్షకులకు సుడిగాలి సుదీర్ పేరుకు పరిచయాలు అక్కర్లేదు. జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా కూడా పలు సినిమాలు చేశాడు.. అయితే పెద్దగా సినిమాలు వర్కౌట్ అవ్వలేదు. మళ్లీ బుల్లితెర పై ప్రసారం అవుతున్న కొన్ని షోలకు హోస్ట్ గా వ్యవహారిస్తున్నారు. అందులో కూడా ఫ్యామిలీ స్టార్స్. ‘ఫ్యామిలీ స్టార్స్’షో లో కొత్త ఎపిసోడ్‌కి బ్యాచిలర్స్ వర్సెస్ మ్యారీడ్స్ సందడి చేయనున్నారు. పెళ్ళైన, కాని సెలబ్రెటీలు ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ నవ్వులు పూయించారు. ఈ షో ప్రోమోను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ ప్రోమోను ఒక లుక్ వేద్దాం..
‘ఫ్యామిలీ స్టార్స్’ లేటెస్ట్ ప్రోమో..
సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న ఫ్యామిలీ స్టార్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో వచ్చింది. ఈ సారి షోలో ‘బ్యాచిలర్స్ వర్సెస్ మ్యారీడ్’ థీమ్‌తో ఎపిసోడ్ చేశారు. ఇందులో పెళ్లి అయిన సీరియల్ సెలబ్రెటీలు అంతా ఒకవైపు పెళ్లి కాని బ్యాచిలర్స్ ముత్యాలన్నీ మరో వైపు నిల్చొని తెగ తిట్టుకున్నారు. మ్యారీడ్ టీమ్ లో కౌశిక్, కెవ్వు కార్తిక్, తేజస్విని గౌడ, కీర్తి, యాంకర్ స్రవంతి ఉన్నారు. బ్యాచిలర్స్ టీమ్‌లో నూకరాజు, అభినయశ్రీ, శ్రీకర్ కృష్ణ, రీతూ చౌదరి, అషూరెడ్డి సందడి చేశారు.. పెళ్లి ప్రాముఖ్యత గురించి సుధీర్ కౌశిక్ అడిగాడు. పెళ్లి అద్భుతం, అపురూపం, అమోఘం అంటూ డైలాగ్ కొట్టాడు. దీనికి ఇన్ని అబద్ధాలు ఆడాలంటే కష్టం కదన్నా అంటూ పంచ్ వేశాడు కార్తిక్.. అలా ఎపిసోడ్ సరదాగా ఉండబోతుందని ప్రోమో ను చూస్తే తెలుస్తుంది.
Also Read: ‘హరిహరవీరమల్లు’ సినిమాను ఎందుకు చూడాలి.. ఐదు కారణాలు ఇవే..?
తేజు పరువు తీసేసిన స్రవంతి..
పెళ్లి గురించి సుధీర్ తేజస్వినిని అడిగారు. తేజు ఏదో చెప్పబోతే ఆవిడ బాగా చెబుతారంటూ పంచ్ వేశాడు కౌశిక్. వెంటనే స్రవంతి కూడా తగులుకుంది. అవును చాలా బాగా చెప్తుంది. నెలకి మూడు రోజులట అని స్రవంతి కామెంట్ చేసింది. ఇది వినగానే తేజు సహా అందరూ నవ్వుకున్నారు. అయితే స్రవంతి ఎందుకు అలా చెప్పిందని ఆలోచనలో ఉండిపోయారు. నిజం చెప్పాలంటే అమర్-తేజు ఇద్దరూ బిజీ ఆర్టిస్టులు అన్న విషయం తెలిసిందే. అమర్ అయితే ప్రస్తుతం పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక మధ్యలో ఎప్పుడైనా ఖాళీ దొరికితే టీవీ షోలకి గెస్టుగా వెళ్తుంటాడు. మరోవైపు తేజు కూడా టీవీ షోలు, యూట్యూబ్ ఛానల్ చూసుకుంటూ బిజీగా ఉంది.. వాళ్లకు దొరికేది కేవలం మూడు, నాలుగు రోజులు మాత్రమే అని అక్కడ ఉద్దేశ్యం. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ జంట విడాకులు తీసుకోబోతుందంటూ చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవలే వీరుద్దరి విడాకుల గురించి క్లారిటీ ఇచ్చారు… మొత్తానికి అయితే ప్రోమో బాగానే ఆకట్టుకుంది. ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి..