Gundeninda GudiGantalu Today episode june 21st: నిన్నటి ఎపిసోడ్ లో.. శృతికి నల్లపూసలు గుచ్చే కార్యక్రమాన్ని అడ్డుగా పెట్టుకొని రవి, శృతిని ఇక్కడే ఉండేలా చెయ్యాలి అని అంటుంది శోభా.. అదేంటి నీ పిచ్చి గానీ ఆ రవి పేరెంట్స్ ను వదిలి ఉండడు కదా అని సురేంద్ర అంటాడు. బాలు ఉంటే గొడవలు జరుగుతాయి. వాడిని లేకుండా చేసి రెచ్చగోడితే గొడవ పెద్దది అవుతుంది. ఇక రవి, శృతిలు శాశ్వతంగా ఇక్కడే ఉంటారు. నేను అదంతా చూసుకుంటాను అని అంటారు.. ఏం చేస్తావో ఏమో అని సురేంద్ర అంటాడు. బాలు మీనా కారు కొణించిందనే ఆనందంతో మీనా తో సరదాగా గడపాలని అనుకుంటాడు. కానీ మీనా సిగ్గుపడుతూ ఉంటుంది. ఇగో నీ కోసం ఏం తెచ్చానో చూడు అని మల్లెపూలు మీనాక్షిస్తాడు. మీనా నా చేతికి ఇవ్వడం ఎందుకు మీరే పెట్టొచ్చుగా అని అంటుంది. ఆ తర్వాత నీకోసం ఇంకో గిఫ్ట్ తెచ్చాను అని బాలు అంటాడు. కానీ ఆ బాక్స్ తీసే లోపల ఏదో ఒక అవాంతరం ఎదురవుతుంది.
ప్రభావతి పూల కొట్టు పెట్టినప్పటి నుంచి చాలా బిజీగా ఉంటుంది ఇంట్లో ఏ పని సరిగ్గా చేయట్లేదు అని ప్రభావతి సత్యంతో అంటుంది. సత్యం మీనా చెయ్యకపోతే నువ్వు చెయ్యొచ్చుగా అని అంటాడు. అందుకే కదా నేను ఇడ్లీకి పిండి కలిపిందో లేదో మీకు పాలు ఇవ్వడం కూడా మర్చిపోయాను కదా తీసుకొని వస్తానని వెళ్తుంది.. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా వచ్చి బాలు ఫస్ట్ నైట్ ని చెడగొట్టేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శృతి కింద కూర్చుని బిర్యానీ తింటూ ఉంటే బాలు, మీనా చూస్తూ కూర్చుంటారు. ప్రభావతి మంచినీళ్లు లేవని విజిల్ వేస్తూ మరోసారి కిందకు వస్తుంది. శృతి బిర్యానీ తినడం చూసి ప్రభావతి కూడా ఒక పట్టు పట్టాలని శృతి దగ్గర కూర్చుని తింటుంది. అందరూ వెళ్ళిపోయారు కదా అని బాలు హల్వా తీసి తినాలనుకుంటాడు.. అందరూ వెళ్లిపోయారు కదా ఇప్పుడు ఎవరు కిందికి రారు ఇదిగో తీసుకో మనం తిన్నందామానేసి బాలు అనుకుంటాడు. అయితే మీనా ప్లేట్ తీసుకొచ్చే లోపల మనోజ్ రోహిణి రావడంతో అక్కడున్న హల్వాని చూసి వాళ్ళు తినేస్తారు. ఆ తర్వాత మనోజ్ రెచ్చిపోతాడు.. ఎటు చూసినా మనోజ్ బాలు కడుపు మీద కొడతాడు.
మనోజ్ హల్వా తిన్న తర్వాత తాగిన వాడిలాగా మత్తుగా కనిపిస్తున్నాడని రోహిణి అంటుంది. ఇదంతా హల్వా ఎఫెక్ట్ రోహిణి అని రూమ్ లోకి పదాన్ని వెళ్ళిపోతారు.. మొత్తానికి హల్వా తినేసి మనోజ్ రోహిణి పైకెళ్ళిపోతారు.. ఇక మీనా అది అయిన తర్వాత బాలు దగ్గరకు వచ్చి రోహిణి మొత్తం ఆ డబ్బులు మింగేసినోడు మింగేసాడు అని అనేసి అంటాడు. పోనీలెండి మనకు ప్రాప్తం లేదనుకుంటా అని మీనా అంటుంది. ఆ మనోజ్ గాడు అంతా తింటున్నాడు. మరి మీరు నిద్రలేచి అడగొచ్చు కదా అంటే తినేది ఎలా లాక్కుంటారు ఏమైనా పోనీ అని బాలు అంటాడు.
ప్రభావతికి బిర్యానీ ఎఫెక్ట్ అర్ధరాత్రి బాగా చూపిస్తుంది. నిద్రలో పొట్ట ఏదో టైట్ గా అనిపించినట్లు ఇబ్బంది పడుతుంది. అనవసరంగా ఈ వయసులో రాళ్లు తిన్నా కరుగుతాయని బిర్యాని తిన్నాను. ఇది నాకు ఇంత ఇబ్బంది పెడుతుందని అస్సలు అనుకోలేదని అనుకుంటుంది. బిర్యానీ అరగడానికి అటూ ఇటూ తిరుగుతుంది. ప్రభావతి అర్ధరాత్రి లేచి వాకింగ్ చేయడం చూసి సత్యం షాక్ అవుతాడు. సత్యం లేచి అర్ధరాత్రి అంతుచిక్కని దెయ్యంలాగా అటు ఇటు తిరుగుతున్నావు ఏంటి అని అడుగుతాడు. నీ వయసేంది నువ్వు చేసిన పని ఏంటి బిర్యానీ ఈ వయసులో తినొచ్చా అని గడ్డి పెడతాడు..
Also Read : పవన్ సినిమాకు గ్రహనం వీడింది. అఫీసియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది..
ఈ టైంలో 16 ఏళ్ల అమ్మాయి లాగా బిర్యానీ లెగ్ పీస్ లాగించి వచ్చావు. మరీ పడుకుంటే పోతుందా అని అమాయకంగా ప్రభాతి అడుగుతుంది. ఏం పోతుంది గ్యాస్ వస్తుంది అటు ఇటు తిరుగు అనేసి సత్యమంటాడు. అప్పటినుంచి అదే పని చేస్తున్నానండి అని అంటుంది ప్రభావతి. అగ్గి పెట్టి లాంటి ఈ గదిలో ఎంత తిరిగినా అంతే కదా నేను వెళ్లి హాల్లో తిరుగుతానని అంటుంది. ప్రతిసారి కిందకు వెళితే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవ్వరా అని సత్యం అంటాడు. మరి మీనా బాలు ఇద్దరూ రొమాన్స్ చేసుకోవడానికి రెడీ అవుతారు మధ్యలో వచ్చి ప్రభావతి డిస్టర్బ్ చేస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..