BigTV English

Hari Hara Veera Mallu Release Date : పవన్ సినిమాకు గ్రహనం వీడింది. అఫీసియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది..

Hari Hara Veera Mallu Release Date : పవన్ సినిమాకు గ్రహనం వీడింది. అఫీసియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది..

Hari Hara Veera Mallu : టాలీవుడ్ స్టార్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్లు. ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకుని చాలా రోజులైంది. అయితే ఏదో ఒక అవాంతరం ఎదురవడంతో సినిమా వాయిదా పడుతూ వస్తూనే ఉంది. ఇప్పటికే చాలాసార్లు ఈ సినిమాను మేకర్స్ వాయిదా వేశారు. జూన్ 12న రావాల్సిన ఈ సినిమా కాస్త జులైకి షిఫ్ట్ అయింది. అది అయినా కన్ఫామ్ గా వస్తుందా రాదా అని పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూవీకి సంబంధించిన అప్‌ డేట్‌ రాబోతుంది. ఈ సినిమా రిలీజ్‌పై రేపు క్లారిటీ రానుంది. శనివారం చిత్ర బృందం అధికారికంగా అనౌన్స్ చేస్తామని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. మరి టీమ్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిందేమో చూడాలి..


వీరమల్లు రిలీజ్ డేట్ ఇదే ఫిక్స్..? 

వీరమల్లు వచ్చేస్తుందని అభిమానులు ఎంతో ఆశగాఎదురుచూస్తున్నారు.. కానీ ఏదొక ఆటంకం రావడంతో వాయిదా పడుతుంది. ఇక చివరికి జూన్ 12న విడుదల కావాల్సిన సినిమా అనూహ్యంగా వాయిదా పడటం.. వారం రోజులకు పైగా గడుస్తున్నా మళ్లీ కొత్త తేదీ ప్రకటించకపోవడంతో ఫ్యాన్స్ అంతా కన్‌ఫ్యూజన్‌లోకి వెళ్లారు. రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇవ్వండంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ డిమాండ్స్ చేశారు. దీంతో ఎట్టకేలకు చిత్రబృందం స్పందించింది. ఇవాళ ఈ మూవీ రిలీజ్ డేట్ ని అధికారకంగా ప్రకటించింది. అందరూ అనుకున్నట్లుగానే జులై 24న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది. ఈ వార్త కోసం పవన్ అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి వాళ్ల కోరిక మేరకు టీం డేట్ ని అనౌన్స్ చేశారు..


Also Read : చిరు, బాలయ్య… చిన్న పల్లెటూరుకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేదు..

‘వీరమల్లు’లో బందిపోటుగా పవన్‌ కళ్యాణ్‌.. 

పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాకముందు అనౌన్స్ చేసిన సినిమాలలో హరిహర వీరమల్లు ఒకటి. ఈ మూవీపై ఫాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిగా వచ్చే సినిమా కావడంతో అటు తెలుగు రాష్ట్రాల్లోని సినీ అభిమానులు కూడా ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమాని స్క్రీన్ మీద ఎప్పుడు చూస్తామని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు సినీ అభిమానులు. గత కొద్దిరోజులుగా ఈ సినిమాకు ఆటంకాలు ఎదురవడంతో మూవీ వాయిదా పడుతూనే ఉంది. మొత్తానికి వచ్చే నెల గ్రాండ్గా థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వీరమల్లుగా కనిపించనున్నారు. బందిపోటు పాత్రలో కనిపించబోతున్నారు. బాబీ డియోల్‌ ఔరంగా జేబ్‌గా నెగటివ్‌ షేడ్‌ ఉన్నపాత్రలో నటిస్తున్నారు. నిధి అగర్వాల్‌ పవన్‌కి జోడీగా చేస్తోంది. వీరితోపాటు పలువురు భారీ కాస్టింగ్‌ ఉన్నట్టు సమాచారం.ఇకపోతే ఇప్పటివరకు విడుదలైన టీజర్లు, పాటలు ఆకట్టుకున్నాయి. సినిమా కోసం పవన్‌ ఫ్యాన్స్ వెయిటింగ్‌. కత్తికి, ధర్మానికి మధ్య యుద్ధం నేపథ్యంలో సాగే ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మించిన విషయం తెలిసిందే.. భారీ అంచనాలతో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి..

Related News

Coolie: ట్రెండ్ సెట్ చేసిన మోనికా సాంగ్.. ఎవరీ మోనికా బెలూచీ?

War 2: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బ్రేక్!

Allu Arjun: అల్లుఅర్జున్‌కు అధికారుల షాక్.. నేనొక ఫేమస్ నటుడ్ని, అయినా వినలేదు

Film industry: కాల్పుల్లో ప్రముఖ రాపర్ సింగర్ మృతి!

Coolie Vs War 2: రాజకీయ చిచ్చు లేపిన లోకేష్.. ఎన్టీఆర్ ను దెబ్బతీయడానికేనా?

War 2: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం.. కానీ ఆంక్షలు తప్పనిసరి!

Big Stories

×