BigTV English

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి అడ్డంగా దొరికిన రోహిణి.. దిమ్మతిరిగే షాకిచ్చిన బాలు..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి అడ్డంగా దొరికిన రోహిణి.. దిమ్మతిరిగే షాకిచ్చిన బాలు..

Gundeninda GudiGantalu Today episode june 25th: నిన్నటి ఎపిసోడ్ లో.. నల్లపూసలు గుచ్చే వేడుకనే గ్రాండ్‌గా అందరిని పిలిచి చేయాలని అనుకుంటున్నాం అని శోభన చెబుతుంది. శృతి, రోహిణి నల్లపూసలు గుచ్చి ఇస్తే బాగుంటుందేమో అని ప్రభావతి అంటుంది. ఇద్దరికి ఒకేసారి ఆ వేడుక జరిపించేద్దాం అని శోభన అంటుంది. శృతితో పాటుగా రోహిణికి కూడా శోభన నల్లపూసల వేడుక చేయిస్తానని చెబుతుంది. అనంతరం మరోసారి ఇంటికి వచ్చిన శోభన బాలు ఈ ఫంక్షన్‌కు రాకూడదు అని చెబుతుంది.. ఈ కండిషన్ ఒప్పుకుంటేనే ఈ ఫంక్షన్ జరుగుతుందని శోభా అంటుంది. బాలు ఉంటే ఎక్కడ గొడవలు జరుగుతాయని ప్రభావతి వెంటనే ఒప్పేసుకుంటుంది. ఈ విషయాన్ని బాలు తో ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటుంది.


శృతి వాళ్ళ అమ్మ నల్లపూసల గుచ్చే కార్యక్రమాన్ని గ్రాండ్గా చేయాలని అనుకుంటుందండి అని ఉంటుందండి అని ప్రభావతి సత్యంతో అంటుంది. వాడు వస్తే ఖచ్చితంగా ఏదో ఒక గొడవ జరుగుతుంది. అందుకే రాకపోవడమే మంచిది అని అంటుంది. వాడు ఫంక్షన్ లో ఉంటే ఎంత గొడవ జరుగుతుందో వాళ్ళు టెన్షన్ పడుతున్నారు అందుకే పని వద్దని చెప్పారు అని ప్రభావతి అంటుంది. తన ఇంటి పరువుని ఎందుకు బాలు తీస్తాడు నువ్వెందుకు వేరేలా ఆలోచిస్తున్నావు అని సత్యం క్లాస్ పీకుతాడు.. ప్రభావతి ఎంత చెప్పినా కూడా సత్యం మాత్రం ప్రభావతి మాట వినడు.. శోభ అనుకున్న ప్లాన్ అయితే సక్సెస్ అయ్యింది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రోహిణి పార్లర్కి వెళ్లి శృతి గురించి విజ్జి తో చెబుతుంది. వాళ్ల అమ్మ వాళ్లు గ్రాండ్ గా చేస్తున్నారంటే కచ్చితంగా మీ నాన్నని తీసుకురమ్మని మీ అత్తగారు అడుగుతారని విజ్జి అంటుంది. అదే నా మెడ మీద వచ్చి కూర్చునింది నేను ఎటు పోలేని పరిస్థితి అయిపోయింది అని రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ గండం నుంచి బయటికి పడాలంటే ఫస్ట్ నాకు పుస్తెలతాడు కొనడానికి డబ్బులు కావాలి అని అడుగుతుంది. ఇప్పటికిప్పుడు అప్పు ఇచ్చే వాళ్ళు కూడా ఎవరూ లేరు అని సుశీలమ్మకు ఫోన్ చేస్తుంది. కూతురు కోసం ఆమె తన బంగారాన్ని తాకట్టు పెట్టిస్తానని అంటుంది.


తాకట్టు పెట్టిన డబ్బులని పార్లర్కి తీసుకొని వస్తుంది రోహిణి వాళ్ళమ్మ. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అమ్మ ఇక్కడికి ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు. నేను డబ్బులు తీసుకొచ్చేస్తానని చెప్పాను కదా అమ్మ అని ఆమె అంటుంది. సరేగాని నీ దగ్గర నాకు తెలియకుండా బంగారు చైనా ఎక్కడిది అని అడుగుతుంది రోహిణి. నీ పుస్తెలతాడు ఉంది కదా అదే తాకట్టు పెట్టి తీసుకొచ్చాను అని చెబుతుంది.. నాకు ఎందుకు పనికి రాకుండా పోయింది ఇప్పుడు ఇలా పనికొస్తుందని అసలు ఊహించలేదు అంటూ రోహిణి అంటుంది.

వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే ప్రభావతి పార్లర్ కి వస్తుంది. ఆ విషయం తెలుసుకున్న రోహిణి వాళ్ళ అమ్మని చూస్తే ఇంకేమైనా ఉందా అని టెన్షన్ పడుతుంది. ప్రభావతి మాత్రం పార్లర్కి నా పేరు లేదు పార్లర్లో నాకు మర్యాద లేదు అంటూ తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది. నేను వెయిట్ చేసే ఓపిక నాకు లేదమ్మా నేను లోపలికి వెళ్తున్నాను అని ప్రభావతి నేరుగా లోపలికి వెళ్ళిపోతుంది. అది గమనించిన రోహిణి వాళ్ళ అమ్మకి ఫేస్ ప్యాక్ వేసి కవర్ చేస్తుంది. అది రాగానే నీ కోసము మీ నాన్న కోసము బట్టలు కొన్నామమ్మా.. మీ నాన్న కచ్చితంగా వస్తారు కదా పాపం మీ అమ్మకి అదృష్టం లేదు అంటూ ప్రభావతి అనగానే రోహిణి తల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది.

మా నాన్న వస్తారండి డబ్బులు కూడా పంపించారు ఇదిగోండి పుస్తెలతాడు కోసమని రోహిణి ప్రభావతికి డబ్బులు ఇస్తుంది. పొద్దుబోక పార్లర్కి వస్తే లక్షలొచ్చాయి అంటూ ప్రభావతి ఇంటికి వెళ్ళిపోతుంది. సత్యం దగ్గరికి వెళ్లి మీరు ఇంకా ఇలాగే ఖాళీగా ఉన్నారేంటి సరుకులు తీసుకురమ్మ లిస్టు ఇచ్చాను కదా అని అడుగుతుంది. లిస్టు ఇచ్చావ్ సరే డబ్బులు ఎవరిస్తారు అని సత్యం అంటాడు. అదేంటి మీ ముద్దుల కొడుకుని అడిగి తీసుకొని వెళ్లి తీసుకొని రావచ్చు కదా అని అనగానే సత్యం ప్రభావతికి క్లాస్ పీకుతాడు.

నా కొడుకుకి వచ్చేవి ఈ అమ్మాయిలకు వాటికి వీటికే సరిపోతున్నాయి ఫంక్షన్ ఎవరిది వాళ్ళ ఇవ్వాలి కదా అని సత్యం అంటాడు.. మీనాకు పుస్తెలతాడు చేయించినప్పుడు అన్ని మనమే పెట్టుకున్నాం కదా అని అనగానే వెనకనుంచి బాలు వచ్చి.. నా గురించి ఏదేదో అంటున్నావు అని ప్రభావతిని అడుగుతాడు. మా నానమ్మ తెచ్చిన తాడుని నువ్వు మెళ్ళో వేశావు నువ్వేమీ కొత్తగా కొనిచ్చి తీసుకురాలేదు అంటూ ప్రభావతికి దిమ్మదిరిగిపోయే కౌంటర్ వేస్తాడు. ఇక ప్రభావతి సత్యం ఇద్దరూ కలిసి మౌనికను పిలవడానికి అక్కడికి వెళ్తారు. నీలకంఠం సంజయ్ ప్రవర్తన చూసి షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో అటు శోభన, ఇటు రోహిణి ఇద్దరు కూడా బాలుని టార్గెట్ చేస్తారు. ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Illu Illalu Pillalu Today Episode: భాగ్యం పై నర్మదకు అనుమానం.. శ్రీవల్లి దొరికినట్లేనా? చందు పై రామరాజు సీరియస్..

Intinti Ramayanam Today Episode: పల్లవి చెంప పగలగొట్టిన అవని.. తమ్ముడి కోసం అవని షాకింగ్ నిర్ణయం..

Brahmamudi Serial Today August 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యను ఫాలో చేసిన రాజ్‌ – క్యాన్సర్‌ డాక్టర్‌ దగ్గరకు వెళ్లిన కావ్య

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు దిమ్మతిరిగే షాక్.. కల్పన దెబ్బకు ఫ్యూజులు అవుట్… రోహిణికి మైండ్ బ్లాక్..

Nindu Noorella Saavasam Serial Today August 11th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రకు షాక్‌ ఇచ్చిన మిస్సమ్మ

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యొద్దు…

Big Stories

×