Chandrababu Govt: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తప్పు మీద తప్పు చేస్తున్నారా? 2029 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు వేస్తున్న స్కెచ్ రివర్స్ అవుతోందా? జగన్ వేసిన త్రిశూల వ్యూహం ఎందుకు ఫెయిలయ్యింది? వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారా? జగన్‌ని కూడా విచారిస్తారా? లేకుంటే ఈ కేసు సీబీఐకి అప్పగిస్తారా? ఇదే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది.
జగన్ వేసే ప్రతీ అడుగును ప్రభుత్వం క్షుణ్నంగా గమనిస్తోంది. పల్నాడు టూర్ ఎపిసోడ్ వ్యవహారంలో సింగయ్య మృతి కేసు జగన్ మెడకు చుట్టుకుంటోంది. ఈ కేసులో వైసీపీ రోజుకో వాదన తెరపైకి తీసుకురావడంతో ఈ కేసును సీబీఐకి ఇస్తే ఇలా ఉంటుందని ఆలోచన చేస్తోంది చంద్రబాబు సర్కార్. అదే జరిగితే జగన్‌తోపాటు ఆ పార్టీ నేతలు అరెస్టు కావడం ఖాయమని అంటున్నారు.
జగన్ టీమ్ ఆలోచనలు వేరుగా ఉంటాయి. తప్పు చేస్తారు.. దాన్ని తప్పించుకునేందుకు రకరకాల ప్రచారం చేయిస్తారు. వైఎస్ వివేకానంద హత్య కేసులో అదే చేశారు. తొలుత వివేకానంద గుండెపోటుతో మృతి చెందారని ప్రచారం చేయించారు. ఆ తర్వాత ఫ్యామిలీ కలహాల వల్ల ఇదంతా జరిగిందని చెప్పుకొచ్చారు. చివరకు నారాసుర రక్త చరిత్ర అంటూ ప్రచారం చేసింది .. సక్సెస్ అయ్యింది.
పల్నాడు టూర్‌లో జగన్ వాహనం కింద పడి మృతి చెందిన సింగయ్య కేసుకి అలాంటి ప్రయత్నం చేస్తోందట జగన్ అండ్ కో. జగన్ వాహనం ఢీ కొని ఓ వ్యక్తి చనిపోయారని వైసీపీ నేతలకు తెలుసు. దీన్ని నుంచి జగన్‌ను తప్పించుకునేందుకు రకరకాల స్కెచ్‌లు వేసింది.
ALSO READ: ఏపీ ప్రజలకు తీపి కబురు.. మరింత సులభతరం, ఆ బాధ తీరినట్టే
తొలుత వైసీపీకి చెందిన ఓ నేత పోలీసులకు ఫోన్ చేసి రాంగ్ సమాచారం ఇచ్చారట. వేరే కారు అని ప్రచారం చేయడం మొదలుపెట్టింది. దాని ఆధారంగా ఆ జిల్లా ఎస్పీతో ప్రెస్‌మీట్ పెట్టించారు. జగన్ ఉన్న వాహనం కింద సింగయ్య పడి మృతి చెందినట్టు ఫుటేజ్ బయటకురావడంతో పోలీసులకు షాకయ్యారు.
సింగయ్య బాగానే ఉన్నాడని, ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో టీడీపీ నేతలు చంపేశారని కొత్త ప్రచారం మొదలుపెట్టింది వైసీపీ. అసలు యాక్సిడెంట్‌కు సంబంధించి తప్పుడు సమాచారం ఎస్పీకి ఇచ్చిందెవరు? ఇచ్చిన పోలీసులు వైసీపీ అనుకూలంగా పని చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం విచారణలో ఆయా విషయాలు తేలనున్నాయి.
వాహనం కింద పడిపోయిన వ్యక్తిని అలా వదిలి వెళ్లిపోవడం అంతకంటే పెద్ద నేరమని అంటున్నారు. తప్పులు వైసీపీ చేసి ఎదుటివారిపై నెట్టేయడం వారికి వెన్నుతో పెట్టిన విద్యగా చెబుతున్నారు టీడీపీ నేతలు. వివేకానంద కేసు ఇదేవిధంగా చేశారని అంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసును సీబీఐకి ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తోందట ప్రభుత్వం. జగన్‌తోపాటు మిగతా నేతలు బయటకువస్తారని అంటున్నారు. అదే జరిగితే జగన్ టూర్లకు చెక్ పడడం ఖాయమని అంటున్నారు. ఈ కేసుకు సంబంధించి జగన్‌కు నోటీసులు ఇచ్చేందుకు మంగళవారం సాయంత్రం పోలీసులు వైసీపీ ఆఫీసుకి వెళ్లారు.
ఆయన లేకపోవడంతో ఆ పార్టీ సీనియర్ నేత లేళ్ల అప్పిరెట్టికి నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత కారుని స్వాధీనం చేసుకుని నల్లపాడు పోలీసుస్టేషన్‌కి తరలించారు. లిక్కర్ కేసులో అరెస్టయిన కృష్ణమోహన్ రెడ్డి పేరుతో ఆ కారు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ గండం నుంచి వైసీపీ నేతలు ఎలా బయటపడతారో చూడాలి.
పులివెందుల ఎమ్మెల్యే జగన్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ సీజ్ చేసి తీసుకెళ్తున్న పోలీస్ లు..#TDPTwitter pic.twitter.com/iAtpOkP9YL
— 𝗧𝗗𝗣 𝗧𝗿𝗲𝗻𝗱𝘀 (@Trends4TDP) June 24, 2025