BigTV English

Love Revenge: ల‌వ్ రివేంజ్‌.. ప్రియుడు పెళ్లి చేసుకోలేదని.. 11 రాష్ట్రాల్ని వణికించింది

Love Revenge: ల‌వ్ రివేంజ్‌.. ప్రియుడు పెళ్లి చేసుకోలేదని.. 11 రాష్ట్రాల్ని వణికించింది

Love Revenge: పిచ్చి ప్రేమ ఉండటం మంచిదే.. కానీ, ప్రేమలో పిచ్చెక్కినట్లు ప్రవర్థించడమే చుట్టూ ఉన్నవారికి ప్రమాదకరం. అలాంటి పనే చేసింది చెన్నైకి చెందిన రెనే జోషిల్డా. తనకు ప్రేమ దక్కలేదని ఏకంగా దేశాన్నే వణికించింది. తాను చేసిన పనికి జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంది.


ఇంజినీరింగ్ పూర్తిచేసిన రెనే జోషిల్డా డెలాయిట్‌లో సీనియర్ రోబోటిక్స్‌లో కన్సల్టెంట్‌గా పనిచేస్తుంది. ఓ ప్రాజెక్ట్ ద్వారా బెంగళూరులోని ప్రభాకర్‌తో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త రెనే మనసులో ప్రేమ చిగురించింది. ఇంకేముంది మంచి రోజు చూసి డివిజ్ ప్రభాకర్‌కు ప్రపోస్ కూడా చేసింది. అయితే తనపై అలాంటి ఫీలింగ్స్‌ లేవని, ఫ్రెండ్స్‌గానే ఉందామని రెనే ప్రపోజ్‌ను సున్నితంగా తిరస్కరించాడు. ఫిబ్రవరిలో మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటున్నాడు. ఇక్కడే వచ్చింది అసలైన ట్విస్ట్‌.

ప్రభాకర్‌ వల్ల మనసు ముక్కలైన రెనే.. అతనిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్లు మొదలుపెట్టింది. అదే పిచ్చి ప్రేమతో ప్రభాకర్‌కు మనశాంతి లేకుండా చేసింది. ప్రభాకర్ అండ్ ఫ్యామిలీ పేరుతో నకిలీ మెయిల్ ఐడీలు క్రియేట్ చేసి.. దేశంలోని ప్రముఖ స్కూళ్లు, ఆస్పత్రులు, స్టేడియాలకు బాంబు బెదిరింపులు పంపించింది. ఒక్క అహ్మదాబాద్‌లోనే 21 ప్రదేశాలకు బెదిరింపు మెయిల్స్ పంపించింది. ఇలా తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, బీహార్, పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ఆమె బెదిరింపులు కలకలం రేపాయి.


Also Read: 35 ముక్కలుగా నరికేస్తా.. ఫస్ట్ నైట్ రోజే వరుడికి వధువు వార్నింగ్.. ఎక్కడంటే?

ఆమె పైశాచికత్వం ఏ రేంజ్‌లోకి వెళ్లిందంటే.. అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత బీజే మెడికల్ కాలేజ్‌కు భయంకరమైన మెయిల్స్ పంపించింది. మీకు మా దెబ్బ రుచి చూపించాం. మేమే విమానాన్ని కూల్చాం. ఇప్పుడు మీకు అర్థమైందా అంటూ బెదిరించింది. టెక్నాలజీలో ఆరితేరిన రెనే.. తన ఐడెంటిటీ బయటపడకుండా చాలా జాగ్రత్త పడింది. రెనే వేషాలు ఎంతకాలం అని సాగుతాయి. దర్యాప్తులో మెయిల్స్ రెనే పంపింనట్లు గుర్తించారు పోలీసులు. ఆరు నెలల క్రితం ఆమె చేసిన ఓ చిన్న తప్పు పట్టించింది. ఓసారి ఒరిజినల్ ఐపీ అడ్రస్‌తో ఫేక్ మెయిల్స్‌ పంపింది. దీంతో అప్రమత్తమైన సైబర్ పోలీసులు.. రెనే అడ్రస్ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి.

Related News

Monkey video viral: కోతి తలకు పగడి ధరించి.. ఓ మోడల్ లాగా..? వీడియో మస్త్ వైరల్

Hyderabad News: మిడ్ నైట్ రోడ్లపై హంగామా.. ఓ చేతిలో బాటిల్.. మరో చేతిలో, కెమెరాకి చిక్కాడు

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Big Stories

×