E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: పాపం ప్రభావతి.. బాలును అరెస్ట్ చేసిన పోలీసులు.. మనోజ్ ను కొట్టిన పోలీసులు..

Gundeninda GudiGantalu Today episode: పాపం ప్రభావతి.. బాలును అరెస్ట్ చేసిన పోలీసులు.. మనోజ్ ను కొట్టిన పోలీసులు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode june 4th: విద్య వాళ్ళ ఇంటికి వెళ్లిన రోహిణి మీనాకు దొరికిపోతే పరిస్థితి ఇదే అని కంగారు పడిపోతూ ఉంటుంది. అయితే సుగుణమ్మ అక్కడికి వచ్చి ఒక ఫోటోని తీసుకొచ్చి ఇస్తుంది. ఫోటో నిజమైన మా నాన్నది నేను ఇప్పుడు ఈ ఫోటోని మా ఇంట్లో చూపించబోతున్నాను అని రోహిణి అంటుంది. ఇక తన అనుకున్నట్లుగానే ఇంట్లోకి ఫోటోలు తీసుకుని రాగానే అందరూ ఏంటి రోహిణి అని అడుగుతారు. మా నాన్న ఫోటో అని రోహిణి మనోజ్ ని పట్టుకొని ఎమోషనల్ అవుతుంది. అది నిజమె అని అందరు అంటారు..

రోహిణి ఎమోషనల్..

తన తండ్రి ఇతనే ఫోటో తీసుకొని ఇంటికి వస్తుంది.. అది చూసిన మిగతా వాళ్ళందరూ కూడా ఏంది ఇది అని అడుగుతారు.. నాన్నగారు ఇతనే మా నాన్నగారి ఫోటో ఇదే అని రోహిణి తీసుకుని రావడంతో ప్రభావతి ఆస్తులు వస్తాయి అనుకున్నాను అస్తికలు వచ్చాయి.. కోర్టు పని ఎక్కడ వరకు వచ్చింది అని అనుకున్నాను కానీ ఇప్పుడు ఫోటో వచ్చింది ఆస్తులు పోయినట్లే అని బాధ పడిపోతూ ఉంటుంది.. మా నాన్నే లేనప్పుడు ఎదవ ఆస్తులు పోతే పోనీలే అత్తయ్య అని ప్రభావతి అంటుంది. ప్రభావతి మాత్రం నా కొడుకు కోటీశ్వరుడు అవుతాడని అనుకున్నాను.. ఏమి లేకుండా పోయింది అని బాధ పడిపోతూ ఉంటుంది.. ఇక మనోజ్ ఆ ఫోటోని అక్కడ పెట్టేసి పూలదండ వేసి అందరిని పువ్వు పెట్టమని అడుగుతారు.. అయితే రోహిణి ఏడుస్తున్నట్లు నాటకం ఆడుతుంది.

బాలుకు రోహిణి పై అనుమానం..

Advertisement

అందరూ ఒక పువ్వు పెట్టి దండం పెట్టుకోండి మా మామగారికి మనోజ్ అంటాడు.. అయితే బాలు అవి డెలివరీ ఇవ్వాల్సిన పువ్వులు. మీ మామగారికి ఇస్తారు మీ మామగారు చెల్లిస్తారా అని అంటాడు.. అయితే మా మామగారు పోయిందన్న బాధ కూడా లేదా ఏంటి అలా మాట్లాడుతున్నారు అని మనోజ్ అంటాడు.. మా అమ్మ ఇప్పటివరకు ఆస్తులు వస్తాయి అని అనుకుంది కానీ ఆయన ఫోటో రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అని బాలు అంటాడు.. అయితే ఆ ఫోటోని చూసిన బాలుకి రోహిణి పై అనుమానం మొదలవుతుంది.. ఏంటి ఈయన నిజంగానే మలేషియా నుంచే వచ్చాడా ఇలా ఉన్నాడు ఏంటి అని అడుగుతాడు. ఈ ఫోటోని మన నటరాజ్ స్టూడియోలో చేసినట్లు ఉంది.. ఈయన మలేషియాకి వెళ్ళకముందు ఫోటో ఇది. అప్పుడు తీసిన ఫోటో కాబట్టి ఇలా ఉన్నాడు అని రోహిణి అంటుంది.. అయినా కూడా బాలు కి అనుమానం మాత్రం తగ్గదు. ఇదంతా నాకెందుకు గానీ నాకు రక్తం కావాలి అని అడగ్గానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి నీకు రక్తం కావాలా ఎందుకు అని అడుగుతారు.. బాలు మొత్తం నిజం చెప్పి రక్తం గురించి మాట్లాడితే శృతి సోషల్ మీడియాలో పెట్టి రక్తం గురించి అడిగితే ఎవరో ఒకరు సాయం చేస్తారు అని చెబుతుంది.

బాలును అరెస్ట్ చేసిన పోలీసులు..

బాలు కోసమని పోలీసులు ఇంటికి వస్తారు.. అయితే ప్రభావతి ఏం తప్పు చేశాడని వాడిని తీసుకెళ్తున్నారు అని అడుగుతుంది.. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ని కొట్టారు అందుకే అతనిపై కేసు పెట్టారు అని పోలీసులు అనగానే ప్రభావతి వీడికి ఏమి కొత్త కాదులే అలవాటే అని అంటుంది.. ఒక పెద్దావిడని ఆ కానిస్టేబుల్ బలవంతంగా తోస్తే ఆవిడకి దెబ్బ తగిలింది అందుకే నేను ఆయన కాలర్ పట్టుకున్నాను అని అనగానే ఇలాంటి వాడికి ఇలానే జరగాలని ప్రభావతి అంటుంది.. నేనేమీ తప్పు చేయలేదండి పోలీస్ స్టేషన్ కి వస్తాను పదండి అని పోలీసులతో బాలు వెళ్తాడు.. మీనా కూడా నేను సాక్ష్యం కదండీ నేను కూడా వస్తాను అని అనగానే ప్రభావతి నువ్వు వెళ్తే వంట ఎవరు చేస్తారు అని అంటుంది. మాట వినగానే సత్యం ప్రభావతిని చీకొడతాడు.. ప్రభావతికి దిమ్మ తిరిగిపోయేలా క్లాస్ పీకుతుంది మీనా..

మనోజ్ ను కొట్టిన పోలీసులు..

Advertisement

మనోజు ఏదో కేసు పని మీద పోలీస్ స్టేషన్ కి వెళ్తారు.. అక్కడ బాలు మీనాలుగు కూర్చొని ఉండడం చూసినా మనోజ్ రోహిణి వీరిద్దరు స్టేషన్ కి ఎందుకు వచ్చారు అని అడుగుతారు.. కానిస్టేబుల్ కొట్టి వచ్చాడు అని అనగానే మనోజ్ నువ్వు పొరపాటున కూడా నాకు తమ్ముడు అని చెప్పుకోవద్దు రా నా పరువు పోతుంది అని అంటాడు. ఇక మనోజ్ వెళ్లి పోలీసులు దగ్గరికి వెళ్లి రెచ్చిపోతాడు.. చెవులో ఏదో చెప్పగానే కానిస్టేబుల్ అందరూ కూడా ఒక్కొక్కరుగా మనోజ్ చంప వాయిస్తారు.. అసలేం జరిగింది అని బాలు ఎంతగా అడుగుతున్నా సరే ఎవ్వరు మాత్రం నిజం చెప్పరు.. నీ పోలీసులు కొట్టడం చూసిన బాలు చాలా సంతోషంగా ఉంటాడు.. మనోజ్ రోహిణి పోలీసులు బయటికి వెళ్ళమని చెప్పగానే వాళ్ళిద్దరూ బయటికి వెళ్లిపోతారు. అసలేం చెప్పావు అని రోహిణి అడగాలి మనోజ్ చెప్పిన మాట విని రోహిణి నీ చావు నువ్వు చావు అని చెంప పగలగొట్టి వెళ్లిపోతుంది..

బాలు మాటకు కరిగిపోయిన ఎస్సై..

ట్రాఫిక్ కానిస్టేబుల్ కేసు పెట్టడంతో బాలుని అక్కడికి తీసుకొని వస్తారు.. అయితే బాలుని చూసిన ఆ కానిస్టేబుల్ ఎలాగైనా సరే నీకు ఆరు నెలలు జైలు శిక్ష పడేలా చేస్తాను అని అంటాడు.. అప్పుడే అక్కడికి వచ్చిన ఎస్ఐ కేస్ ఏంటి అని అడగడంతో బాలు చెప్పిన నిజాన్ని విని మనసు చలించిపోతుంది. మా ట్రాఫిక్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకోవడం కూడా తప్పే కాబట్టి నువ్వు క్షమాపణ లెటర్ రాసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. ఇక మళ్ళీ కానిస్టేబుల్ బాలు కి వార్నింగ్ ఇస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Also Read :Podarillu Today Episode : అడ్డంగా బుక్కయిన ప్రతాప్.. మాధవ్ దెబ్బకు మైండ్ బ్లాక్.. అన్నదమ్ముల సీన్ హైలెట్..

Related News

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

Big Stories

Advertisement
×