E-Paper
Advertisement

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్
Advertisement

Arunachalam: భక్తుల గుండెల్లో భక్తిభావానికి, ప్రశాంతతకు నిలయమైన అరుణాచల మహాక్షేత్రంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. అరుణాచల క్షేత్రంలో గిరిప్రదక్షిణ దారిలో ఇద్దరు యువతులపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనలు స్థానికంగానే కాకుండా, దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించాయి.

మొదటి దారుణం..దంపతులు/స్నేహితులపై దాడి

Advertisement

తమిళనాడులోని ధర్మపురికి చెందిన ఒక వివాహిత తన స్నేహితులతో కలిసి మే 30న పౌర్ణమి గిరిప్రదక్షిణకు వచ్చారు. రాత్రి వేళ ప్రదక్షిణ ముగించుకుని తిరుగుపయనమైన క్రమంలో, పెద్దకోలాపాడి వద్ద ఆమె తన స్నేహితుడితో మాట్లాడుతుండగా ఓ ముఠా మారణాయుధాలతో దాడి చేసింది. వారిని అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లి వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగక, ఇద్దరినీ నగ్నంగా వీడియో తీసి, రూ. లక్ష ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిల్ చేశారు. బాధితురాలు ధర్మపురి పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగుచూసింది.

రెండో ఘటన.. 23 ఏండ్ల యువతిపై గ్యాంగ్‌రే*ప్

Advertisement

మే 31వ తేదీ రాత్రి తిరువణ్ణామలైకి చెందిన 23 ఏళ్ల యువతి గిరిప్రదక్షిణ చేస్తుండగా కాళ్లనొప్పులు రావడంతో అడిఅణ్ణామలై వద్ద ఆగింది. అక్కడ తన స్నేహితుడిని పిలిపించుకుని, టిఫిన్ తీసుకుని అయ్యంపాలయం బైపాస్ రోడ్డు వద్ద కూర్చున్నారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన దుండగులు వారిని బెదిరించి, సమీప అటవీప్రాంతానికి తీసుకెళ్లి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితులను నగ్నంగా వీడియోలు తీసి, ఆమె బంగారు కమ్మలను దోచుకెళ్లారు.

పోలీసుల వేట.. 8 మంది అరెస్ట్

ఈ రెండు కేసులను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు. ఈ దారుణాల్లో మొత్తం 11 మంది నిందితులు ఉన్నట్లు గుర్తించారు. వారిలో వాసుదేవన్, ఆకాష్, అప్పు, హరిహరన్ శర్మ, అరుణ్ కుమార్, శివగణేశన్ , ఒక మైనర్‌తో సహా ఎనిమిది మందిని మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Also Read: పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×