E-Paper
Advertisement

Podarillu Today Episode : అడ్డంగా బుక్కయిన ప్రతాప్.. మాధవ్ దెబ్బకు మైండ్ బ్లాక్.. అన్నదమ్ముల సీన్ హైలెట్..

Podarillu Today Episode : అడ్డంగా బుక్కయిన ప్రతాప్.. మాధవ్ దెబ్బకు మైండ్ బ్లాక్.. అన్నదమ్ముల సీన్ హైలెట్..
Advertisement

Podarillu Today Episode June 4th : రౌడీల కారు కేశవా కి గుద్దేస్తారు . రౌడీ బయటకొచ్చి సారీ చెప్పినా సరే అందులో చక్రి ఉన్నాడని తెలుసుకొని ఆ కారుని ఫాలో అయ్యి చివరికి పట్టుకుంటారు. మాధవ్ రౌడీలపై విరుచుకు పడడంతో కేశవ కన్న ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఏంటి మిమ్మల్ని చూస్తుంటే కొత్తగా ఉంది అని అనగానే నా తమ్ముడు జోలికి వస్తే ఎవరినైనా ఇంతే అని ఆ రౌడీలు అందరిని చితగ్గొట్టేసి చక్రిని కాపాడుతారు. చక్రి నిజం చెప్పడంతో మాధవ్ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఉదయం చక్రి సోఫాలో కూర్చొని ఉండగా చూసిన లలిత షాక్ అయ్యి అందరిని పిలుస్తుంది..

చక్రీని చూసి మహా హ్యాపీ..

హాల్లో చక్రి కూర్చొని చూస్తున్న లలిత అందరినీ కేకలు వేసి పిలుస్తుంది.. అయితే చక్రిని అలా చూసినా ప్రతాప్ ఆది ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అది మహాలక్ష్మి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది.. ఎక్కడికి వెళ్ళిపోయారు ఆ దెబ్బలు ఏంటి అని కంగారు పడిపోతూ ఉంటుంది. మహాలక్ష్మి చక్రిని చూసి చాలా సంతోషంగా ఉంటుంది.. నువ్వు వచ్చావు కానీ డబ్బులు బంగారు ఏవి రా అని ఆది అడుగుతాడు. మనిషి వచ్చాడని సంతోషించకుండా డబ్బులు ఏవి అని అడుగుతున్నావేంటి కొంచెమైనా బుద్ధుందా నీకు అని మహాలక్ష్మి ఆది పై సీరియస్ అవుతుంది.. ప్లాను నీకు తెలియట్లేదు డబ్బులు నీ బంగారాన్ని అడ్మిన్చటే బయటికి పంపించేసి వీడు నెమ్మదిగా వచ్చాడు అని ఆది చెప్పగానే మహా కొంచెం నోరు మూస్తావా అని గట్టిగా అరుస్తుంది..

చక్రీ దెబ్బకు ప్రతాప్ ఫ్యూజుల్ అవుట్..

Advertisement

 మీకు కావాల్సింది డబ్బులు బంగారమే కదా ఒకసారి నేను తీసుకొని వస్తాను అని చక్రి అంటాడు.. అయితే చక్రి మాట విన్న ఆది ప్రతాప్ ఇద్దరూ కూడా వాడు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అని ఆలోచిస్తూ షాక్ లో ఉండిపోతారు. అయితే చక్రి బయటకు వెళ్లి తన అన్నదమ్ముల్ని తీసుకొని రావడంతో వీళ్ళ ఎందుకు వచ్చారు అని మహాలక్ష్మి అనుకుంటుంది. వాళ్ళు ఎందుకు వచ్చారు కాదు వాళ్ళు రావడానికి ఒక కారణం ఉంది అని చక్రి అంటాడు. చక్రి తనను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పినా కూడా ప్రతాప్ ఆదిమాత్రం అసలు నమ్మరు.. డబ్బులు తీసుకుని వెళ్లే వీడు నాటకాలు ఆడుతున్నాడు అని చెప్పగానే మాధవ్ అలాగే కేశవ వాళ్ళు మాకు అంత అవసరం లేదు అని అంటారు. మాధవ్ కూడా రావడంతో మహాలక్ష్మి ఇది ఏదో పెద్ద యవ్వారం లాగే ఉంది అని అనుకుంటుంది..

ప్రతాప్ కు షాక్.. ఇదేం ట్విస్ట్..

చక్రి నీ కిడ్నాప్ చేసి చంపేయాలని అనుకున్నారు మేము కాసేపు ఆగి వెళ్లింటే ఖచ్చితంగా పని చేసే వాళ్ళు అని మాధవ్ చెప్పడంతో మహాలక్ష్మి నిజమే అని నమ్ముతుంది.. డబ్బుల కోసం ఇదంతా చేశారా అసలు ఎవరు చేశారు అని మాధవ్ నీ మహా అడుగుతుంది.. మీకు ఎవరు చేశారు ఇప్పుడు చెప్పను అని అనగానే ప్రతాప్ ఆది సేఫ్ అని అనుకుంటారు.. కానీ చక్రి నేను చూపిస్తాను అని అనగానే ప్రతాప్ షాక్ అవుతాడు. అనుకున్నట్లుగానే ప్రతాప్ కేశవ ని తీసుకుని రమ్మని చెప్పగానే ఒక రౌడీని తీసుకొని వస్తాడు.. ప్రతాప్ గారు ఆయన కొడుకే ఇదంతా చేశారు అని చెప్పగానే మహాలక్ష్మి షాక్ అవుతుంది.. విల్లు నిన్ను నమ్మించడానికి ఏదో చేస్తున్నారని ఆది అనగానే మహాలక్ష్మిని చక్రి నాకు ఇదంతా ముందే తెలుసు అని అంటాడు.

లలితకు షాక్.. కన్నీళ్లు తెప్పించే సీన్..

Advertisement

ఎవరైనా కానీ కన్న బిడ్డలకి మంచిగా చూసుకోవాలని అనుకుంటారు. ఏంటమ్మా నువ్వు నీ కూతురికి అన్నం పెట్టిన వాళ్ళ మీదే ఇలాంటి కక్ష్య కట్టావా అని మహాలక్ష్మి అడుగుతుంది. అయితే మహాలక్ష్మి ఎమోషనల్ డైలాగులతో లలిత కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎందుకు ఇలా చేశావు అని అడగడంతో లలిత కూడా బాధపడిపోతూ ఉంటుంది. ఇంట్లో నన్ను అందరూ తల్లిలాగా చూసుకున్నారు నాకు. ఆశ్రయమిచ్చి నన్ను ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు అలాంటిది మీరు ఇలా చేస్తారని నేను అసలు ఊహించలేదు అని మహాలక్ష్మి అంటుంది. ఇలాంటి కొంపలో నేను ఒక్క నిమిషం కూడా ఉండను. వెళ్ళిపోతాను అని మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..

మాధవ్ స్ట్రాంగ్ వార్నింగ్..

 అందరూ బయటికి వచ్చిన తర్వాత మాధవ్ నేను ఒకసారి మళ్ళీ లోపలికి వెళ్లి వస్తాను అని అంటాడు. అయితే లోపలికి వెళ్ళిన మాధవ్ ఇంకా ఏదైనా చేస్తాడేమో అని కేశవా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. లోపలికి వెళ్ళిన మాధవ్ మా చక్రికి ఏమన్నా అయితే సమాధి చేస్తాను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. లక్ష్మి ని ఇంకెప్పుడు మీ ఇంటికి పంపించము అని అంటాడు. ఇంకొకసారి మా ఇంటి లక్ష్మి ని దూరం చేయాలని చూస్తే మర్యాదగా ఉండదు ప్రాణాలు తీస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత అన్నదమ్ముల సెంటిమెంట్ సీన్ తో ఎపిసోడ్ హైలైట్ గా మారుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: గుడ్డిగా నమ్మిమోసపోయిన ధీరజ్.. పోలీస్ స్టేషన్ లో ధీరజ్.. నర్మదకు అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి..

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×