E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలు మాటకు కన్నీళ్లు పెట్టుకున్న సత్యం.. కొత్త క్యారక్టర్ ఎంట్రీతో..

Gundeninda GudiGantalu Today episode: బాలు మాటకు కన్నీళ్లు పెట్టుకున్న సత్యం.. కొత్త క్యారక్టర్ ఎంట్రీతో..
Advertisement

Gundeninda GudiGantalu Today episode march 17th : నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు చేతికి గాయం తగిలినట్టు మీనా గమనిస్తుంది.. ఇది చిన్న గాయమని మీరంటున్నారు కానీ ఇది చాలా పెద్దగాయమండి అని అనగానే నాకు అస్సలు ఓపిక లేదు నేను వెళ్లి ఫ్రెష్ అవుతాను.. నాకు అన్నం తీసుకురావని మీ నాకు చెప్పి బాలు లోపలికి వెళ్ళిపోతాడు. చెయ్యి నొప్పితో బాధపడుతున్న బాలుకు మీనా అన్నం తినిపిస్తుంది. మీరు చెల్లెలు కోసం ఎంత చేస్తున్నారు? రేపు ఎవరైనా ఏదైనా అంటే మీరు కోపంతో రెచ్చిపోతారు. అది మాత్రం తగ్గించుకోండి అని మీనా అంటుంది. భార్య చెప్తే వినకుండా ఉంటారా అని బాలు సెటైర్ వేస్తాడు. అటు సత్యం బాలుకి విషయాన్ని ఎలా చెప్పాలని కన్నీళ్లు పెట్టుకుంటాడు. మాత్రం మీ కొడుకు మీద ప్రేమ పొంగు కొచ్చింది కదా మరి మౌనిక ఫంక్షన్ ఆపేద్దామా వాళ్ళ అసలు ఒప్పుకోరు కదండీ మీరు ఏదైనా ఆలోచించాలి కదా అంటూ సత్యం కు చెబుతుంది. మీనా భర్త పై ప్రేమతో అన్నం తినిపిస్తుంది. తన పై మీనా చూపిస్తున్న ప్రేమకు ఉప్పొంగి పోతాడు బాలు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఎపిసోడ్ విషయానికోస్తే.. మౌనిక ఫంక్షన్‌లో ఉండొద్దని బాలుకు ఎలా చెప్పాలో తెలియక ఆలోచనలో పడతాడు సత్యం. బాలు ఉండటం వల్ల తలెత్తే అనార్థాలేమిటో చెబితే సరిపోతుంది అంటూ తేలిగ్గా మాట్లాడుతుంది ప్రభావతి. బాలు విషయంలో నువ్వు ఉన్నంత కఠువుగా నేను ఉండలేనని సత్య బదులిస్తాడు. బాలుతో నేనే మాట్లాడుతానని ప్రభావతి అంటుంది. అక్కరలేదని సత్యం సమాధానమిస్తాడు.. మీకు మౌనిక ఫంక్షన్ జరగాలంటే మాత్రం బాలు ఇంట్లో ఉండకూడదు అని సమాధానం ఇస్తుంది. సత్యం మాత్రం ఏం చెయ్యాలి అని ఆలోచిస్తాడు. అటు మీనా భర్తను ప్రేమగా చూసుకుంటుంది. బాలు చెల్లెలి ఫంక్షన్ దగ్గరుండి అన్నీ చూసుకోవాలని హడావుడి చేస్తాడు. పెళ్లి కొడుకులాగా ముస్తాబు అయ్యి తొందరగా పనులు కావాలని హడావిడిగా ఉంటాడు. రవిని ఈ క్రమంలో ఒక ఆట ఆడుకుంటాడు.

Advertisement

రవిని లేచిపోయినోడా నువ్వు వంటవాడివే కదా మీ వదినకి సాయం చేయొచ్చు కదా అని అనగానే. నువ్వు నల్ల బీమా అని నన్ను ప్రేమగా పిలిస్తే నేను వదినకు ఖచ్చితంగా సాయం చేస్తాను అంటాడు. కానీ బాలు మాత్రం మీనా ఈ వంట పని నువ్వే కష్టపడి ఎలాగోలాగా పూర్తి చేయు వీడిని మాత్రం నేను నల్ల బీమా అని పిలిచేది లేదు అంటూ సరదాగా మాట్లాడుతాడు. ఇక ఆ తర్వాత పొద్దున్నే ఏంట్రా నీ హడావిడి అని బాలును మనోజ్ అంటాడు. లక్షలు మింగినోడా చెల్లెలి కోసం చేస్తున్న ఫంక్షన్ లో నువ్వు ఉండకూడదు. జాబ్ లేదని పార్క్ ఉంటున్నావు అని తెలిస్తే మా పరువు పోతుందని అంటాడు. అటు రోహిణి మనోజ్ ను ఏదైనా అంటే బాగోదు అని వార్నింగ్ ఇస్తుంది. అయిన బాలు మాత్రం పంచులు వెయ్యకుండా ఆగడు.

మంగళసూత్రాన్ని ఆర్డర్ ఇచ్చాను ఈ రాజేష్ గాడు తీసుకొచ్చాడో లేదో అంటూ బాలు హడావిడిగా అందరిపై అరుస్తూ ఉంటాడు. బాలు ఎంతో సంతోషంగా మిగిలిన పనులన్నీ చేస్తున్నాడు. పంచె, ఎర్రచొక్కాలో హుందాగా రెడీ అయ్యి సందడి చేస్తూ ఉంటాడు. ఎప్పటిలాగే ఇంట్లో వాళ్లమీద పంచులు వేస్తూనే నవ్వులు పూయిస్తాడు. అయితే మౌనికా వాళ్ల అత్తగారు బాలును ఫంక్షన్ లో ఉండొద్దనే కండీషన్ పెట్టినా.. సత్యం మాత్రం కన్నకొడుకుకు ఎలా చెప్పాలో తెలియక, చెప్పలేక గమ్మునుండిపోతాడు.. అని ప్రభావతి మాత్రం నువ్వు వెంటనే వెళ్లి ఒక పూజ చేయాలి అది కూడా కాకినాడకు వెళ్లి పూజ చేయించాలి. ఇప్పుడు అర్జంట్ నా ఫంక్షన్ అయ్యాక వెళ్తాను అని అంటాడు. కానీ ప్రభావతి మాత్రం నువ్వు ఈ ఫంక్షన్ లో ఉండకూడదు.. ఉంటే ఫంక్షన్ జరగదు అని అంటారు. కానీ బాలు మాత్రం మౌనిక ఫంక్షన్ కు నేను లేకుండా ఎలా ఉండను అంటాడు. అయినా కూడా మా నాన్న సంతోషమే నాకు ముఖ్యం నేను కచ్చితంగా ఈ ఫంక్షన్ నుంచి వెళ్ళిపోతానని బాలు అంటాడు ఇక మీనా కూడా నేను మీరు లేకుండా నేను ఉండను అని అంటుంది. నేను లేక నువ్వు లేక ఇంట్లో పనులు ఎవరు చేస్తారో నువ్వు ఉండు అనేసి మీనా అంటుంది. ఇక బాలు టిఫిన్ చేయడానికి కిందకొస్తే ప్రభావతి ఇంకా టిఫిన్ చేస్తున్నావా వెళ్ళవా అని అంటుంది. అన్న తర్వాత నాకు ఇంకా నాలుగు ఇడ్లీలు ఎక్స్ట్రా తినాలనిపిస్తుంది తింటాను వెయ్యి మీనా అని ప్రభావతితో సెటైర్లు వేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో సంజయ్ బాలును తన అత్త చేత గోరంగా అవమానిస్తాడు.. దానికి బాలు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×