BigTV English

International Masters league: ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ విజేతగా టీమిండియా

International Masters league: ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ విజేతగా టీమిండియా

International Masters league:  ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament )… ఇటీవల గెలుచుకుంది టీమిండియా. ఈ విజయంతో టీమిండియా ఫ్యాన్స్ ఫుల్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో… టీమిండియా ( Team India) మరో విజయాన్ని అందుకుంది. ఇండియా మాస్టర్స్ జట్టు ( India Masters team)… ఇంటర్నేషనల్ మాస్టర్స్ ( International Masters League T20, 2025 ) విశ్వ విజేతగా నిలిచింది. ఆదివారం రోజున… ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025 ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ లో…. వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో… ఇండియా మాస్టర్స్ జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది.


Also Read: Jasprit Bumrah: షూలు కొనడానికి డబ్బులు.. బుమ్రా కష్టాలు అన్ని ఇన్ని కాదు ?

దీంతో ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన ఇండియా మాస్టర్స్ జట్టు…. ఇంటర్నేషనల్ మాస్టర్ లీగ్ విజేతగా నిలవడం జరిగింది. సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar ) అలాగే అంబటి రాయుడు ( Ambati Rayudu) , ఇతర ఇండియన్ ప్లేయర్లు అందరూ సమిష్టిగా రాణించడంతో.. ఈ విజయం సాధ్యమైంది. ముఖ్యంగా అంబటి రాయుడు ఓపెనర్ గా దిగి చెలరేగిపోయాడు. అంబటి రాయుడు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడడంతో… ఇండియా మాస్టర్స్ జట్టు… ఫైనల్ మ్యాచ్ లో దుమ్ము లేపింది. అలాగే మరో ఓపినర్ సచిన్ టెండుల్కర్ 18 బంతుల్లోనే 25 పరుగులు చేసి దుమ్ము లేపడం జరిగింది. ఇలా అంబటి రాయుడు అలాగే సచిన్ టెండూల్కర్ ఇద్దరు కలిసి తొలి వికెట్ కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ఇండియా మాస్టర్స్ జట్టు ( India Masters team) విజయం నల్లేరు పైన నడక లాగా తయారవుతాయి.


Also Read: IPL 2025: రెండు హాఫ్‌ సెంచరీలతో వణకుపుట్టించిన SRH ప్లేయర్‌..అన్ని సిక్సులే?

 

ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మాస్టర్స్ జట్టు… భారీ స్కోరు ఏమీ చేయలేదు. నిర్ణీత 20 ఓవర్ లో ఏడు వికెట్లు నష్టపోయిన వెస్టిండీస్ మాస్టర్ జట్టు… 148 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది వెస్టిండీస్. ఈ మ్యాచ్లో డ్వేన్ స్మిత్ 35 బంతుల్లో 45 పరుగులు చేసి రాణించాడు. ఇందులో నాలుగు బౌండరీలు అలాగే రెండు సిక్సర్లు కూడా ఉన్నాయి. అటు.. సిమన్స్ 57 పరుగులు చేశాడు. ఇందులో ఐదు బౌండరీలు అలాగే ఒక సిక్సర్ కూడా ఉంది. ఈ తరుణంలోనే 148 పరుగులు చేసింది వెస్టిండీస్. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా ఆచితూచి ఆడింది. 17.1 ఓవర్లలోనే… నాలుగు వికెట్లు నష్టపోయిన ఇండియా మాస్టర్స్ టీం 149 పరుగుల లక్ష్యాన్ని చేదించింది. ఈ తరుణంలోనే ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టి20 2025 టోర్నమెంట్ ( International Masters League T20, 2025 ) గెలుచుకుంది. టీమిండియా బ్యాటర్లలో మాజీ ప్లేయర్ అంబటి రాయుడు 74 పరుగులు చేయగా సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar ) 25 పరుగులు చేసి దుమ్ము లేపాడు.

Related News

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Haris Rauf: రఫేల్ కూల్చేశామంటూ హ‌రీస్ ర‌ఫ్ సెలబ్రేషన్..ఆడుకున్న ఫ్యాన్స్‌

Ind Vs Pak: చ‌ల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్‌…సిక్స్ కొట్టి మ‌రీ

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Rohith Sharma : టీమిండియా కోచ్ గా రోహిత్ శర్మ… త్వరలోనే రిటైర్మెంట్?

IND Vs PAK : సీన్ రిపీట్… పాకిస్తాన్ పరువు తీసిన సూర్య కుమార్ యాదవ్

Big Stories

×