Gundeninda GudiGantalu Today episode march 25th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఉదయం నుంచి నా ఫోన్ కనిపించడం లేదు. ఎక్కడ పెట్టానో అర్థం కావడం లేదు అని బాలు మీన ఇద్దరు కూడా ఆ ఫోన్ ఎక్కడుందో వెతుకుతూ ఉంటారు.. బాలు ఫోన్లో చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉంది దాన్ని ఎక్కడ ఎతకాలి అని అనుకుంటూ వెతుకుతూ ఉంటాడు. ఇంట్లో అంత వెతుకుతున్న టైంలో రోహిణి అక్కడికి వచ్చి ఏం పోయింది ఎక్కడ వెతుకుతున్నారు అని అంటుంది. పీకలు దాకా తాగితే ఇలానే అన్ని వస్తువులు పోయినా కూడా గుర్తుకు ఉండవు అని రోహిణి అనడంతో బాలు ఇప్పుడు నేను చాలా చిరాకు లో ఉన్నాను.
దయచేసి నన్ను గెలకొద్దు అని బాలు అంటాడు. ఫోన్ వెతుక్కునే పనిలో నువ్వుండు ఆ వీడియోని గుణ దగ్గరికి తీసుకెళ్లే పనిలో నేనుంటాను అని రోహిణి మనసులో అనుకుంటుంది. రోహిణి ఆ ఫోన్ ని తీసుకొని గుణ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఈ వీడియోని మనము ఆ గుణకి ఇచ్చినట్లు బాలుకు తెలిస్తే మనల్ని తొక్కుతుక్కు కొట్టి ముక్కలు చేస్తాడు అని విద్య టెన్షన్ పడిపోతూ ఉంటుంది. నువ్వేమీ టెన్షన్ పడకు ఆ బాలుకి అంత సీన్ లేదులే అని ఆ ఫోన్ ని గుణ దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత నువ్వు ముందు ఆ దినేష్ ని కిడ్నాప్ చేస్తే నీకు ఫోన్ లో వీడియోని పంపిస్తాను అని రోహిణి అంటుంది.. ఇక మొత్తానికి ఆ వీడియోని గుణకి పంపించేస్తుంది రోహిణి. ఇక రోహిణి పంపిన వీడియోని ఎలా వైరల్ చేయాలో చూస్తాను అని గుణ అనుకుంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మీనా ఆయన ఫోన్ ఎక్కడికి పోయిందో ఏంటో ఫోన్ లేకుండా ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. అసలు ఆ ఫోన్ ని ఎవరు కొట్టేశారో లేకపోతే ఎక్కడ మర్చిపోయాడు అని ఆలోచిస్తూ ఉంటుంది.. అయితే మీనా మీద సడన్ గా ఆ బల్లి పడుతుంది. ప్రభావతి మీనా అని గట్టిగా అరవడంతో ఆ బల్లిని మీనా విసిరేయడంతో అది వెళ్లి ప్రభావతి మీద పడుతుంది. ప్రభావతి బల్లి అని షాక్ అయిపోయి ఆ బల్లిని తీసి రోహిణి మీద విసిరేస్తుంది. రోహిణి విసిరివెయ్యడంతో అధి కాస్త మనోజ్ మీద పడుతుంది. ఇక అందరూ బల్లి పడిందని కంగారు పడిపోతూ ఉంటారు.. ప్రభావతి మాత్రం భయపడుతూ ఉండగా రోహిణి బల్లి శాస్త్రం చూసి నేను చెప్తాను అని అంటుంది.. ఆ బల్లి శాస్త్రం చూసి అందరికీ ఏం జరుగుతుంది అని చెప్తుంది కానీ మీ నాకు మాత్రం ప్రాణగండం ఉందని చెప్పగానే మీనా టెన్షన్ పడిపోతూ ఉంటుంది..
ఇక లోపలికి వెళ్ళిన మీనా బల్లి పడింది అని భయపడుతూ ఉంటుంది.. అప్పుడే సుమతి ఫోన్ చేయగానే అక్కడికి వచ్చిన మీనా ముందుగా బాలు అనుకుంటుంది. ఆ తర్వాత సుమతికి బాలు ఫోన్ పోయిన విషయాన్ని చెప్తుంది.. అయితే ఆయనకి ఒక మంచి ఫోన్ కొని వాళ్ళని మేన అంటుంది.. మంచి ఫోన్ కొనియాలంటే కచ్చితంగా డబ్బులు కూడా మంచిగానే పెట్టాలి అని సుమతి అంటుంది. ఏమైనా పర్వాలేదు నేను మంచి ఫోను కొనివ్వాలి అని సుమతితో అంటుంది.. ఇక శివ మీనా ఇద్దరు కలిసి ఒక ఫోన్ షాప్ కి వెళ్లి ఫోన్ కొనాలని అనుకుంటారు.. అయితే అప్పటికే ఆ వీడియో వైరల్ అవ్వడంతో ఆ షాప్ లోనే వాళ్ళు శివాని చూసి ఆ దొంగ వీడే అని అనుకుంటారు. పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్లే విని పట్టుకొని పోయి ఏదో ఒకటి చేస్తారు అని అంటాడు.
ఆ వీడియోని చూసిన వాళ్ళందరూ శివ ని గుర్తు పెట్టి ఆ దొంగ వీడే.. ఏదో ఒక రోజు పోలీసులు విని పట్టుకుంటారు. ఎంత ధైర్యంగా వీడు మనుషుల మధ్య తిరుగుతున్నాడు అని అందరూ అనుకుంటూ ఉంటారు.. ఇక విద్య ఆ వీడియోని చూసి షాక్ అవుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రోహిణి వీడియోని చూసి గుణ అప్పుడే వీడియోని రిలీజ్ చేశాడే ఎంత వైరల్ అవుతుందో చూడు అని విద్య అంటుంది.. ఇంతమంది చూశారా అంటే ఈ వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతుందని కదా నాకు చాలా సంతోషంగా ఉంది అని రోహిణి అంటుంది. అటు మీనా బాలు ఫోన్ చేయగానే మీరు ఫోన్ చేశారు నాకు కాస్త కంగారు తగ్గింది. రోహిణి బల్లి శాస్త్రం గురించి చెప్పగానే నాకు భయమేసింది అండి అని మీనా అంటుంది.. ఇక తర్వాత నువ్వేం భయపడకు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ట్రిప్ అయిపోయింది తిరిగి వస్తున్నాను అని బాలు అంటాడు..
అంతే కాదు బాలు ఫోన్ ఎక్కడ పెట్టిన విషయాన్ని మీరు నాతో చెప్తాడు. ఆ మనోజ్ ఫోన్ ఇచ్చినా కోటులోనే ఆ ఫోన్ ఉంటుంది.. ఆ ఫోన్ ఎవరో కావాలని కొట్టేశారు మీనా అని బాలు చెప్పగానే మీనా షాక్ అవుతుంది.. అయితే ఆ ఫోన్ ఎక్కడుందో మనకు కనిపెట్టాలి ఎవరు కావాలని నా ఫోన్ ని కొట్టేశారు అని బాలు అంటాడు.. ఆ తర్వాత రోహిణి చేస్తుంది తప్పు అని విద్య ఎంత చెప్తున్నా సరే తను మాత్రం తన స్వార్ధాన్ని చూసుకుంటున్నాను అని అనుకుంటుంది.. అయితే రోహిణి చేసేది ముమ్మాటికి తప్పు అని విద్య అనడంతో విద్య పై సీరియస్ అవుతుంది రోహిణి.. పాపం మీద ఏం చేసిందే మీనా బాలు మీద ఎందుకు నీకు అంత కోపం అని అడుగుతుంది. ఈ వీడియో కనుక చూస్తే అత్తయ్య మీనా బాలుని ఇంట్లోంచి బయటికి గెంటేయడం ఖాయమని, మీనా పీడ విరగడ అయిపోతుంది అని రోహిణి అనుకుంటుంది..
ఈ వీడియోని చూసినా శృతి వాళ్ళ అమ్మ కూడా శృతి రవిని ఇంట్లోంచి తీసుకెళ్లి పోతుంది. అప్పుడు నేను మనోజ్ చాలా సంతోషంగా ఉంటామని రోహిణి అనగానే.. విద్య నువ్వు ఇలా క్రూరంగా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు అని అంటుంది. ఎందుకే నా గురించి అలా మాట్లాడుతున్నావ్ తప్పు చేసిన వాళ్ళు ఏ రోజైనా బయట పడాల్సిందే. నీ గురించి నువ్వు చెప్పుకోవడం లేదు ఏంటి అని విద్య అంటుంది. నువ్వు నా గురించి ఏం మాట్లాడద్దు ప్రస్తుతానికైతే నేను నా స్వార్ధాన్ని మాత్రమే చూసుకుంటున్నా అని రోహిణి అంటుంది. నువ్వు ముందు ఆ వీడియోని పిడిఎఫ్ ఫైల్ గా కన్వర్ట్ చేసి నాకు పంపించు తర్వాత నేను చూసుకుంటాను అని అంటుంది.
Also Read :మాధవ్ మాటతో ఇంట్లో ఉంటున్న మహా.. అందరు ఫుల్ హ్యాపీస్.. కేశవకు దిమ్మతిరిగే షాకిచ్చిన శైలు..
ప్రభావతి రుద్రతాండవం అని పిల్లలకి రౌద్రంతో డాన్స్ నేర్పిస్తూ ఉంటుంది.. కామాక్షి ప్రభావతి ఇద్దరూ కూడా డాన్స్ లో పోటీ పెట్టుకుంటారు. నాట్యం నీ ఒక్కదానికే కాదు మాకు కూడా వచ్చు కామాక్షి అంటే కామెడీ కాదు అని పంచ్ డైలాగులు వేస్తుంది కామాక్షి. రోహిణి మనోజ్ దగ్గరికి వెళ్లి నీకు ఒక కవర్ ఇచ్చారు అని చెప్పగానే ఆ వీడియోని చూసి మనోజ్ కూడా షాక్ అయిపోతాడు. అమ్మ ఈ వీడియోని ఎలాగైనా చూసేలా చేస్తాను అని మనోజ్ అనుకుంటాడు. రోహిణి నా ప్లాన్ సక్సెస్ అయిపోయింది. నేను అనుకున్నట్లుగానే జరుగుతుంది మీనాని బాలుని ఇంట్లో నుంచి అత్తయ్య గెంటేయడం ఖాయమని సంతోష్ పడిపోతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ప్రభావతి మీనా తమ్ముడిని చంప పగలగొడుతుంది.. అంతే కాదు చెప్పుతో కూడా కొడుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…