E-Paper
Advertisement

గుండెనిండా గుడిగంటలు..మార్చి 29 : మీనా దగ్గరకు వెళ్లిన బాలు.. శివ కోసం వచ్చిన పోలీసులు.. ఆత్మహత్య చేసుకుంటాడా..?

గుండెనిండా గుడిగంటలు..మార్చి 29 : మీనా దగ్గరకు వెళ్లిన బాలు.. శివ కోసం వచ్చిన పోలీసులు.. ఆత్మహత్య చేసుకుంటాడా..?

Gundeninda GudiGantalu Today episode march 29th : నిన్నటి ఎపిసోడ్ లో.. శివని పార్వతి దారుణంగా తిడుతుంది. నా పెద్ద కూతురు జీవితం కాపురం నాశనం అయిపోయింది. దాని అత్త నా ఇంట్లోకి రానివ్వను అని అంటుంది. దాని జీవితం ఎటు పోతుందో ఏంటో అర్థం కావడం లేదు అని పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. పెద్ద కూతురి కాపురం ఏమవుతుందో తెలియడం లేదు.. చిన్న కూతురు నీ వెతుక్కుంటూ వచ్చిన సంబంధం కూడా చెడిపోతుందేమో అని పార్వతి కంగారు పడిపోతూ ఉంటుంది.. ఇదంతా నేను కావాలని చేయలేదమ్మా ఆవిడ అలా నన్ను అవమానించిందని చేశాను అంతే అని శివ ఎంత చెప్తున్నా సరే పార్వతి మాత్రం ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పురా అని అంటుంది.. ఆయన ఫోన్లో ఆ వీడియో ఉంది అంటే నేను నమ్మలేకపోతున్నాను. నిజమే అక్క బావకి ఈ విషయం ఎప్పుడో తెలుసు అని శివ బాలు గురించి నిజాన్ని బయటపెడతాడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది. కట్టుకున్న భార్యని నాకే ఈ విషయం ఇన్ని రోజులు చెప్పలేదు.అది కూడా నా పుట్టింటి వాళ్ళ విషయం చెప్పలేదు అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది ఎలా తెలుసురా అని శివ ని మీనా అడుగుతుంది..

బాలు కి ఒకసారి ఫోటో షాప్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ని ఇచ్చాడని బాలు బావ చెప్పాడు. అప్పటినుంచి నన్ను ఆ గుణతో తిరగదని వార్నింగ్ ఇస్తూ వస్తున్నాడు. గుణ మీద చెయ్యి చేసుకోవడంతో నేను అడ్డుగా వెళ్లడంతో నా చేతులు విరగొట్టాడు. ఆ తర్వాత నాకు బావ ఈ విషయాన్ని చెప్పాడు.. మీ అక్కకు చెప్తే మీ గురించి తలుచుకొని బాధపడిపోతుంది అందుకే మీ అక్క కూడా నేను చెప్పలేదు అని బావ అన్నాడు అని శివ అంటాడు.. ఆలు గురించి నిజం తెలుసుకున్న మీనా పార్వతి నా అల్లుడు నేనేం తప్పుగా అనుకున్నాను నీ వల్ల ఎన్నెన్నో మాటలు అన్నాను అని బాధపడిపోతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. మనోజు శివ దొంగతనం చేసిన వీడియోని చూపిస్తాడు. ఆ వీడియోని పూర్తిగా చూడక తలికే బాలు ఈ వీడియో ఎక్కడిది అని అంటాడు. ఈ వీడియో ఎక్కడినుంచి వచ్చింది? ఎవరు పంపించారు అని అనగానే ఏమో ఎవరికి తెలుసు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతుంది అని మనోజ్ అంటాడు.. ఆ దొంగ ఇంట్లో నుంచి అమ్మాయిని నా ఇంటికి కోడలుగా అడుగుపెట్టనివ్వను అని ప్రభావతి అంటుంది.. ఇక తర్వాత మీనా ఎక్కడుంది అని అడిగితే వాళ్ళ ఇంట్లోనే ఉంది ఇక్కడికి తీసుకు రావాల్సిన అవసరం లేదు అని బాలుకి ప్రభావతి వార్నింగ్ ఇస్తుంది. రోహిణి మాత్రం బాలు మీనా ఈ దెబ్బతో బయటికి వెళ్లిపోతారు నా గతం గురించి బయట పెట్టే అవకాశం లేదు అని లోలోపల సంతోష్ పడిపోతూ ఉంటుంది. బాలు మాత్రం మీనా కోసం వాళ్ళ ఇంటికి వెళ్లడానికి రెడీ అవుతాడు..

ప్రభావతి, మనోజ్ రోహిణి ఎంత చెప్తున్నా సరే బాలు వినకుండా మీనా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ బాలుని చూసిన మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది. శివ గురించి ఆ వీడియో ఎలా వచ్చిందో తెలియ లేదండి. నా ఫోన్ కొట్టేసిన వాళ్లే ఇదంతా చేసి ఉంటారు మీ నాన్న నువ్వు ఏమి బాధపడకు అని అంటాడు.. అల్లుడుగారు మీ గురించి తెలియక చాలానే అనుకున్నాము మమ్మల్ని క్షమించండి అని పార్వతీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయ్యో అత్తయ్య మీరేం బాధపడకండి వాడ్ని ఆ గుణ గాడే చెడగొట్టాడు.. అయితే వాడి ఇదంతా చేసి ఉంటాడు అని బాలు అనుకుంటాడు.

నేను అందుకే చెడు సవాసాలు వద్దు అని ఎంత చెప్తున్నా సరే బాలు మాత్రం వినకుండా వాడి దగ్గరికి వెళ్ళాడు వాడిప్పుడు ఇష్టం వచ్చినట్లు చేసేసాడు అని అంటాడు. వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా కానిస్టేబుల్స్ ఎక్కడ దొంగా మా ఎస్ఐ గారు తీసుకు రమ్మని చెప్పారు అని వస్తారు. శివ ఎక్కడున్నాడో అర్థం కావడం లేదండి అని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. అయితే పైకి వెళ్ళిన శివని చూసి బాలు వాళ్ళందరూ కూడా కంగారు పడిపోతుంటారు. మీరు ఎవరైనా నా దగ్గరికి వస్తే నేను ఇక్కడి నుంచి దూకేస్తాను అని శివ అంటాడు.

Also Read :చక్రధర్ మాటతో అవని హ్యాపీ.. పల్లవి మాస్టర్ ప్లాన్.. పూజకు చక్రధర్ డుమ్మా..

నన్ను దొంగ అని ఊరందరూ ముద్ర వేశారు నేను ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావడం లేదు నన్ను పోలీసులు తీసుకెళ్లిపోతారా అని బాధ పడిపోతూ ఉంటాడు. మీ అక్క వాళ్ళని మీ అమ్మని చూసైనా ఒకసారి ఆగరా ఏం చేస్తున్నావ్ రా అనే బాలు అంటూ ఉంటాడు. ఇక మొత్తానికి అక్కడి నుంచి దూకపోతున్న శివనే కాపాడి బాలు పక్కకు తీసుకొని వస్తాడు. నన్ను ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తే ఇంకా నేను జీవితాంతం జైల్లోనే ఉండాలని శివ బాధ పడిపోతూ ఉంటాడు. ఈ బాలు ఉన్నంతవరకీ నీకు ఏమీ కాదురా అసలు ఇది ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్ళిందో నేను కనుక్కుంటాను. దీన్ని బయటికి పంపించిన వాళ్లని అలాగే దాని కోసం హెల్ప్ చేసిన వాళ్లని వదలను అని బాలు అంటాడు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. మరి సోమవారం ఎపిసోడ్లో రోహిణి బండారం బయట పడుతుందేమో చూడాలి..

Related News

Bramhamudi Rudraani : ‘ బ్రహ్మముడి ‘ రుద్రాణి ఆస్తులు ఎన్ని కోట్లు..? హీరోయిన్లు సరిపోరు..

Podarillu Lalitha : ‘పొదరిల్లు’ మహా తల్లి రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Gundeninda GudiGantalu Today episode: పాపం ప్రభావతి.. బాలును అరెస్ట్ చేసిన పోలీసులు.. మనోజ్ ను కొట్టిన పోలీసులు..

Podarillu Today Episode : అడ్డంగా బుక్కయిన ప్రతాప్.. మాధవ్ దెబ్బకు మైండ్ బ్లాక్.. అన్నదమ్ముల సీన్ హైలెట్..

Illu Illalu Pillalu Today Episodes: గుడ్డిగా నమ్మిమోసపోయిన ధీరజ్.. పోలీస్ స్టేషన్ లో ధీరజ్.. నర్మదకు అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవని కోసం కన్నీళ్లు పెట్టుకున్న ఆరాధ్య.. నిజం చెప్పిన మీనాక్షి.. పల్లవికి కమల్ వార్నింగ్..

Karthika Deepam 2 Serial Today Episode June 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సుమిత్ర బర్తుడే పార్టీకి వెళ్లిన దక్షిణమూర్తి

Brahmamudi Serial Today Episode June 4th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సీఈవోగా ఇందు – ప్రకటించిన రేఖ 

Big Stories

×