E-Paper
Advertisement

Horror Comedy OTT : కాటికాపరి అవతారం ఎత్తే లాయర్… కడుపుబ్బా నవ్వించే కామెడీ మావా

Horror Comedy OTT : కాటికాపరి అవతారం ఎత్తే లాయర్… కడుపుబ్బా నవ్వించే కామెడీ మావా
Advertisement

Horror Comedy OTT : హారర్ కామెడీ సినిమాలకు చాలా క్రేజీగా నడుస్తున్నాయి. ఈ సినిమాలు తక్కువ బడ్జెట్ తోనే కోట్లు కొల్లగొడుతున్నాయి. మలయాళం నుంచి వచ్చిన ‘సర్వం మాయ’ ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఒక థాయ్ సినిమా గురించి మనం చెప్పుకోవాల్సిందే. థాయ్ చరిత్రలోనే ఒక బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఒక హారర్ కామెడీ. ఈ కథ థాయ్‌లాండ్‌లోని ఒక పల్లెటూరు నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం అందులో చూపించిన ప్రాంతీయ సంస్కృతి. థాయ్‌లాండ్‌లోని ఈశాన్య ప్రాంతపు యాస, అక్కడి తిండి, బౌద్ధ మతపరమైన అంత్యక్రియల ఆచారాలను దర్శకుడు రియలిస్టిక్ గా చూపించారు. అందుకే ఇది అక్కడి ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యింది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

2023లో వచ్చిన ఈ సూపర్ హిట్ థాయ్ హారర్ కామెడీ సినిమా పేరు ‘ది అండర్‌టేకర్’ (The Undertaker). థితి శ్రీనువాన్ దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా థాయ్ చిత్ర పరిశ్రమ చరిత్రలోనే ఒక అద్భుతం. కేవలం 15 మిలియన్ బాట్ల (సుమారు ₹3.5 కోట్లు) బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ఏకంగా 700 మిలియన్ బాట్లకు పైగా (సుమారు ₹160 కోట్లు) వసూలు చేసింది. గత పదేళ్లలో థాయ్‌లాండ్‌లో ఇంత పెద్ద హిట్ అయిన సినిమా మరొకటి లేదు. ఈ సినిమా సాధించిన విజయాన్ని చూసి థాయ్ ప్రభుత్వం దీనిని “సాఫ్ట్ పవర్” గా గుర్తించింది. అంటే థాయ్ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పే సినిమాగా దీనిని ప్రమోట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమియంటే

Advertisement

జోడ్ అనే యువకుడు పట్నంలో లాయర్ డిగ్రీ చదువుకుని తన ఊరికి తిరిగి వస్తాడు. వాళ్ల నాన్న ఆ ఊరిలో చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు నిర్వహించే పని చేస్తుంటాడు. జోడ్‌కు దయ్యాలంటే విపరీతమైన భయం ఉన్నప్పటికీ, తండ్రి అనారోగ్యం పాలవడంతో అయిష్టంగానే ఆ వృత్తిని చేపట్టాల్సి వస్తుంది. అదే సమయంలో, సియాంగ్ అనే మరో యువకుడు తన మాజీ ప్రేయసి బాయిఖావో ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని తెలిసి బాధలో ఉంటాడు. ఆమె ఆత్మను ఒక్కసారైనా కలవాలని ఆరాటపడుతుంటాడు.

సియాంగ్ తన ప్రేయసి ఆత్మతో మాట్లాడటానికి జోడ్ తండ్రి సహాయం కోరతాడు. అతని దగ్గర నుంచి, చనిపోయిన వాళ్ళ ఆత్మలలోకానికి వెళ్లే ఒక ప్రత్యేకమైన తాంత్రిక విద్య గురించి తెలుసుకుంటాడు. అయితే ఆ విద్యను అభ్యసించాలంటే కొన్ని కఠినమైన నియమాలు పాటించాలి. మరోవైపు బాయిఖావో ఆత్మ ఊరిలో తిరుగుతూ అందరినీ భయపెడుతుంటుంది. ఇక స్టోరీలో కామెడీతో పాటు హారర్ ఎలిమెంట్స్ ఓ రేంజ్ లో నడుస్తాయి. చివరికి జోడ్ తన భయాన్ని అధిగమించి శవాలకు అంత్యక్రియలు ఎలా చేశాడు ? సియాంగ్ ఆ ప్రమాదకరమైన తాంత్రిక విద్యను ఉపయోగించి తన ప్రేయసిని కలుసుకున్నాడా ? అనే విషయాలను ఈ కామెడీ హారర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :  లవ్ అంటే ఇదేరా బుల్లోడా… పెళ్లి చూపుల్లో మొదలై పీటల దాకా… ఐయండిబిలో 8.2 రేటింగ్

Tags

Related News

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×