E-Paper
Advertisement

ఇంటింటి రామాయణం.. మార్చి 29: చక్రధర్ మాటతో అవని హ్యాపీ.. పల్లవి మాస్టర్ ప్లాన్.. పూజకు చక్రధర్ డుమ్మా..

ఇంటింటి రామాయణం.. మార్చి 29: చక్రధర్ మాటతో అవని హ్యాపీ.. పల్లవి మాస్టర్ ప్లాన్.. పూజకు చక్రధర్ డుమ్మా..
Advertisement

Intinti Ramayanam Today Episode March 29th : నిన్నటి ఎపిసోడ్ లో.. అవని శ్రీరాముని కళ్యాణం కి తన తల్లిని పిలవడానికి భరత్ వాళ్ళ ఇంటికి వెళుతుంది. అమ్మ రేపు శ్రీరామనవమి కదా మనమందరం గుడికి వెళ్లి కళ్యాణం జరిపించాలని అనుకుంటున్నాము.. అత్తయ్య వాళ్ళు భరత్ ప్రణతిలతో పాటు నిన్ను కూడా తీసుకురమ్మని చెప్పమన్నారు.. నీకు ఒకసారి చెప్పి వెళదామని ఇలా వచ్చాను అని అవని అంటుంది. ఆ మాట వినగానే మీనాక్షి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఏమైందమ్మా నువ్వు గుడికి వస్తావు కదా ఎందుకు అలా ఉన్నావు అని అవని అడుగుతుంది. నేను చిన్నప్పుడు భరత్ కి బాగోలేకపోతే తనని బ్రతికించమని ఆ రాముడిని వేడుకున్నాను. అందుకే తన తమ్ముడి లాగా నా కొడుకుని కూడా చూస్తాడు అని నా కొడుకు పేరు భరత్ అనే పేరు పెట్టుకున్నాను. కానీ ఆయన కల్యాణానికి మంగళసూత్రం చేయిస్తానని మొక్కుకున్నాను. ఇప్పటివరకు ఆ మొక్కు తీర్చలేకపోయాను.. అందుకు కారణం నా భర్త నా దగ్గర లేకపోవడమే అని మీనాక్షి బాధపడుతుంది.

నువ్వేం బాధపడకు అమ్మ నీకోసం నేను ఏదైనా చేస్తాను నాన్నని నేను తీసుకొస్తాను అని అవని అంటుంది.. కానీ భరత్ మాత్రం ఆయన వస్తాను అంటే నేను రాను అసలు అని అంటాడు.. నువ్వు అనాధాశ్రమంలో పెరిగావు కాబట్టి అమ్మకు జరిగిన అవమానాలు గురించి నీకు పెద్దగా తెలియదు అక్క.. నేను అమ్మతోనే ఉన్నాను.. తనని జనాలు ఎంతగా అవమానించారో నాకు తెలుసు.. దానికి కారణం ఆ చక్రధర్.. అతని వల్ల ఎన్ని బాధలు పడ్డామో నీకు తెలియదా అక్క మళ్లీ అతని తీసుకొని వస్తావా అని భరత్ అవని పై సీరియస్ అవుతాడు.. రాజేశ్వరి దగ్గరికి వెళ్లిన అవనీని రాజేశ్వరి దారుణంగా అవమానిస్తుంది.. కానీ చక్రధర మాత్రం నేను వస్తానని మాట ఇస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. రాజేశ్వరి వాళ్ళ ఇంటికి వెళ్లిన అవని తన మొక్కు గురించి ఎంతగా చెప్తున్నా సరే తాను మాత్రం వినకుండా అవనిని దారుణంగా అవమానిస్తుంది.. పిన్ని నేను చెప్పేది ఒకసారి వినండి ఇది మా అమ్మ పాతికేళ్ల కోరిక నేను తీరుస్తానని మాట ఇచ్చాను.  ఒక్కసారి నాన్నను గుడికి పంపించండి అని అవని అంటుంది.. నా మొగుడితో ఇక్కడే ఉండి సంసారం చేస్తుందా నీ అమ్మ అని దారుణంగా మాట్లాడుతుంది. రాజేశ్వరి మాటలకు అవనీ కన్నీళ్లు పెట్టుకొని బయటకు వస్తుంది. అవని బాధని అర్థం చేసుకున్నారు చక్రధర్ అవనికి నేను వస్తాను మీ అమ్మని పూజకు సిద్ధం చేసుకోమను అని మాటిస్తాడు. ఆ మాటతో అవని చాలా సంతోషంగా ఉంటుంది.. మా అమ్మ మొక్కుని తీర్చబోతున్నాను అని చాలా సంతోషంగా ఉంటుంది అవని..

బయట బట్టలు అరేస్తున్న పార్వతి దగ్గరికి అక్షయ్ వస్తాడు.. అమ్మ నాకు ఒక డౌట్ ఉంది అడగొచ్చు అని అంటాడు. దేని గురించి డౌటు ఏం అడగాలి అనుకుంటున్నావు రా అడుగు రా అని పార్వతి అంటుంది. పల్లవి నీ మేమెవరైనా ఒక్క మాటంటే అస్సలు ఒప్పుకునే దానివి కాదు. అలాంటిది ఇప్పుడు పల్లవిని కమల్ అంతగా అరుస్తున్న సరే నువ్వు మాత్రం ఏమి పట్టించుకోవడం లేదు ఏంటి అని అడుగుతాడు. నీకేమైందమ్మా ఎందుకు పల్లవిని కోపంగా చూస్తున్నావు అర్థం కావడం లేదు అని అక్షయ్ అడుగుతాడు.

Advertisement

అప్పుడే ఇంట్లోకి వచ్చినావ నేను చూసిన పార్వతి పూజ కోసం మీ అమ్మని పిలిచావా వస్తానని చెప్పిందని అడుగుతుంది.. వస్తానని చెప్పింది అత్తయ్య కానీ మా అమ్మకి పాతకేల నుంచి తీరని కోరిక ఒకటి ఉంది అని అంటుంది.. సీతారాముల వారికి కళ్యాణం కోసం మంగళసూత్రం ఇవ్వాలని అనుకుందట కానీ మా నాన్న లేకపోవడంతో ఆ కోరిక తీరలేదు ఇప్పుడు మా నాన్నని పంపించమని పిన్ని దగ్గరికి వెళ్లి అడిగాను. అయితే రాజేశ్వరి నీ మీద చాలా కోపంగా ఉంది కదా ఏమనింది కచ్చితంగా నేను తిట్టే ఉంటుంది కదా అని పార్వతి అడుగుతుంది.. అవును అత్తయ్య నన్ను దారుణంగా పెట్టింది. కానీ మా నాన్న మాత్రం నన్ను సంతోషపరిచేలా చేశారు. పూజ కోసం నేను వస్తాను అంత సిద్ధం చేసుకోండి అని అన్నారు అని అవని అంటుంది..

Also Read :బిందె పై శ్రీవల్లి డ్యాన్స్..చుక్కలు చూపించిన నర్మద..సాగర్, నర్మద ఒక్కటవుతారా?

పోనీలే మీ అమ్మ కోరిక మీ నాన్న తీర్చాలని అనుకుంటున్నాడు రేపు పూజకి అంతా సిద్ధం చేద్దామని పార్వతి అంటుంది.. ఇక తర్వాత అక్షయ్ ఈ మాత్రం పార్వతిని అడగాలనుకుంటున్న విషయాన్ని అడగకుండా చేస్తుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసిన పల్లవి ఈ పూజకి డాడ్ ని రాకుండా చేయాలి అప్పుడు అవన్నీ తిక్క కుదురుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత రోజు శ్రీరామనవమి సందర్భంగా పూజ కోసం అందరూ గుడికి వెళ్తారు. అక్కడ సీతారాముల కళ్యాణం కోసం విగ్రహాలను తెచ్చి అక్కడ పెడతారు.. అయితే మీనాక్షి మాత్రం ఇంకా మీ నాన్న రాలేదు ఏంటమ్మా అని అడుగుతుంది. ఇంట్లో రెడీ అవుతున్న చక్రధారిని గదిలో పెట్టి బ్లాక్ చేస్తుంది రాజేశ్వరి.. ఆ తర్వాత చక్రధర్ ఫోన్ లిఫ్ట్ చేసి ఎక్కడికి రాడు అని చెప్పగానే అవని షాక్ అయిపోతుంది.. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. ఇక సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×