E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: నీలకంఠంకు దిమ్మతిరిగే షాక్.. ప్రభావతికి స్ట్రాంగ్ వార్నింగ్.. రోహిణి దొరికిపోతుందా..?

Gundeninda GudiGantalu Today episode: నీలకంఠంకు దిమ్మతిరిగే షాక్.. ప్రభావతికి స్ట్రాంగ్ వార్నింగ్.. రోహిణి దొరికిపోతుందా..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode march 2nd : నిన్నటి ఎపిసోడ్ లో.. మౌనిక ఇక తల్లి కాదు అని శాశ్వతంగా పుట్టింట్లో వదిలేయాలి అని చూసిన సంజయ్ కి దిమ్మ తిరిగే షాప్ ఎదురవుతుంది. వదిలించుకోవాలని చూసిన మౌనికని శుభవార్తతో తన ఇంటికి తీసుకుని వెళ్తాడు సంజయ్. మౌనిక కడుపుతో ఉండడం మిగతా వాళ్ళందరికీ సంతోషాన్ని ఇస్తుంది. మీనా బాలు ఇద్దరూ రాత్రి అక్కడే ఉండాలని అనుకుంటారు. అక్కడ మాట్లాడుకుంటూ ఉండగా నేనా మధ్యలో తాటి బెల్లం కలిపిన పాలను తీసుకుని వచ్చాను అని అంటుంది. ఈ పాలు నాకెందుకు వెళ్లి ఆ గాన కోకిల ఉంది కదా మీ అత్తవతి ఆవిడకి ఇవ్వు అని అంటాడు.

మీకోసం చాలా కష్టపడి పాలని తయారు చేసి తీసుకొచ్చాను తాగితే తాగండి కాకపోతే లేదు అని మీనా బుంగమూతి పెట్టుకుంటుంది. నువ్వలా బుంగమూతి పెట్టుకోవద్దు మీనా నేను ఏదో అయిపోతాను అని బాలు అంటాడు.. నా కోరికను తీర్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని మీనా అంటుంది. బొమ్మల కొలువుతో పాటుగా యాగం కూడా బాగా జరిగింది. అంతకన్నా సంతోషించాల్సిన విషయం ఏంటంటే మౌనిక తల్లి కావడం.. ఇకమీదట మీరు ఆ సంజుతో మంచిగా ఉండండి మౌనికని మనం అప్పుడప్పుడు వెళ్లి చూసి వద్దామని అంటుంది మీనా..  నాకు కోపం వచ్చిందని మీనా అనగానే నీకు కోపం పోగొట్టే మంత్రం నా దగ్గర ఉంది కళ్ళు మూసుకొని బాలు అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మీనా బాలు చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. పూజ అయితే బాగా జరిగింది కానీ, అక్కడ అత్తయ్య గారు పాడిన పాట నాకు ఇంకా గుర్తుకు వస్తుంది అని అనగానే.. అత్తయ్య అలా పాడినందుకే నేను పాడిన పాట మీకు అందరికీ నచ్చినట్టు ఉంది అని మీనా అంటుంది.. ఆ మాట వినగానే బాలు అమ్మ చూడు నిన్ను ఎంత మాట అంటుందో అని అనగానే మీనా నాకేం తెలియదండి అత్తయ్య గారు నేను ఊరికే అన్నానండి అని భయపడిపోతుంది.. ఏమంటే నీకెందుకు అంత భయం అని బాలు అడుగుతాడు.. ఇక తర్వాత మౌనిక సంజయ్ఇంటికి వెళ్తారు. అప్పుడే రిపోర్టులను చూసి నీలకంఠం చాలా సంతోషంగా ఉంటాడు.. ఈ గుడ్ న్యూస్ వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని నీలకంఠం మాట్లాడుతూ ఉంటాడు. మౌనిక అత్తయ్య గారు మీరు నానమ్మ కాబోతున్నారు అని సంతోషంగా చెప్పడంతో ఆమెన్ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది..

కానీ నీలకంఠ మాత్రం సంజయ్ పై సీరియస్ అవుతాడు.. నా రాజకీయ వారసుడుగా నిన్ను ప్రకటించాలని అనుకున్నాను. నువ్వు చేసింది మాత్రం ఏంటి అని సంజయ్ పై కోప్పడతాడు నీలకంఠం.. ఆ తర్వాత మీనా పూజకు అంత సిద్ధం చేస్తూ ఉంటే ప్రభావతిని సుశీలమ్మ పిలిచి పూలను కట్టమని అంటుంది. ప్రభావతి మాత్రం అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటుంది. బాలు గాడు వచ్చి నన్ను ఎక్కడ ఆడుకుంటాడు అని భయంగా ఉంది అత్తయ్య అని అనగానే అప్పుడే బాలు వచ్చి పూలమ్మ పూల ఎత్తుకొనిందా అని అంటాడు. అప్పుడు ప్రభావతి పూలమ్మ పూలు అని అటు ఇటు తిరుగుతుంది ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అని బాలుని అంటుంది..

Advertisement

ఇక తర్వాత రోహిణి ప్రభావతి కోసం ఒక చీర తీసుకొని వస్తుంది.. ఆ చీరను చూసి ప్రభావతి మురిసిపోతుంది. అయితే బాలు మాత్రం ప్రభావతికి దిమ్మ తిరిగిపోయేలా సెటైర్లు వేస్తూ ఉంటాడు.. ఇక మీ నావల్ల బస్తీ వాళ్ళు రాగానే ప్రభావతి రెచ్చిపోతుంది. బస్తివాళ్ళు కదా అనేసి దారుణంగా అవమానిస్తుంది. సుశీలమ్మ తరపున వచ్చిన డాక్టర్ అమ్మ కూడా ప్రభావతిపై సీరియస్ అవుతుంది.. ఆ తర్వాత రోహిణి బాలు ఫోన్ ని ఎలాగైనా కొట్టేయాలని అనుకుంటుంది. గుణ వచ్చి రోహిణి తో ఆ వీడియో నాకు పంపించండి అప్పుడు నేను వచ్చి రచ్చ చేస్తాను అని అంటాడు..

ఎలాగోలాగా వీడియోని కొట్టేయాలని ప్లాన్ చేస్తుంది రోహిణి. ఇక మొత్తానికి ఆ ఫోన్ ని కొట్టేస్తుంది.. అయితే మొత్తానికి ఆ ఫోన్లోని ఒక వీడియోని తన ఫోన్ కి పంపించుకుని గుణానికి పంపిచేస్తుంది. ఆ ఫోన్ ను మీనా బాలు ఇద్దరు చూసేస్తారు. ఇది నా ఫోన్ కదా.. దీని ఫోన్ పౌచేది అని బాలు అడుగుతాడు.. ఆ పిల్ల తీసుకుని వెళుతూ ఉంటే నా చేతికి ఇచ్చింది అందుకే చేతులు పట్టుకుని ఉన్నాను అని రోహిణి తప్పించుకుంటుంది. ఇక తర్వాత వీడియోని చూసిన గుణ ఇంకో వీడియో పంపించమంటే ఈ వీడియో పంపించింది ఏంటి అని రోహిణికి మళ్ళీ ఫోన్ చేస్తాడు.. కానీ రోహిణి ఇక చాన్స్ లేదు అని అనుకుంటుంది.. ఇక మౌనిక కు సువర్ణ నువ్వు గర్భవతిగా ఉన్నావు కదా చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది..

Also Read :భాగ్యం, శ్రీవల్లి ఫుల్ హ్యాపీ.. విశ్వంకు షాకిచ్చిన అమూల్య.. నర్మదకు వేదవతి స్ట్రాంగ్ వార్నింగ్..

ఇప్పుడే అక్కడికి వచ్చిన సంజయ్ మౌనిక నేను ఎప్పుడు నీతో కలిసి నట్లు కూడా నాకు గుర్తులేదు. కానీ నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేనే నా తండ్రిని అని అంటాడు.. ఆ మాట వినగానే మౌనిక షాక్ అవుతుంది. ఇంకా సువర్ణ సంజు చెంప పగలగొట్టడమే కాకుండా క్లాస్ పీకుతుంది.. మౌనికని అవమానించిన అనుమానించిన కూడా నీకు మర్యాదగా ఉండదు అని సువర్ణ అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో సుగుణమ్మ బాలుకి రోహిణి గురించి నిజం చెప్తున్నా లేదా అన్నది చూడాలి..

 

Related News

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

Big Stories

Advertisement
×