Gundeninda GudiGantalu Today episode march 31st : నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా ఏ తప్పు చేయలేదు కదా మరి మీనాను ఎందుకు నిందిస్తున్నారు.. మీనా గురించి మీ అందరికీ తెలియదా అని బాలు అందరిపై అరిచేసి మీనా కోసం వాళ్ళ పుట్టింటికి వెళ్తాడు.. శివ గురించి ఆ వీడియో ఎలా వచ్చిందో తెలియ లేదండి. నా ఫోన్ కొట్టేసిన వాళ్లే ఇదంతా చేసి ఉంటారు మీ నాన్న నువ్వు ఏమి బాధపడకు అని అంటాడు.. అల్లుడుగారు మీ గురించి తెలియక చాలానే అనుకున్నాము మమ్మల్ని క్షమించండి అని పార్వతీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయ్యో అత్తయ్య మీరేం బాధపడకండి వాడ్ని ఆ గుణ గాడే చెడగొట్టాడు.. మీరు వాడి గురించి తెలిసి కూడా మౌనంగా ఉన్నారు వాడి చెయ్యి విరగట్టారు. అదే నేను కనుక అయ్యుంటే వాడికి కాళ్లు కూడా విరగగొట్టే దాన్ని మీరు నిజంగా దేవుడు అల్లుడుగారు అని పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. మీరేం బాధపడకండి అత్తయ్య గారు ఇదంతా నేను చూసుకుంటాను అని బాలు అంటాడు. పోలీసులకు మా ఇంటి సమస్యని బాలు చెప్తాడు దాంతో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక శివని ఆత్మహత్య చేసుకోకుండా బాలు కాపాడి రాజేష్ ఇంటికి తీసుకొని వెళ్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. శివ ఎక్కడ కనిపించడం లేదు అని అనగానే సుమతి మీ అమ్మగారు వచ్చి వాడిని కొట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు తెలియడం లేదు బావ అని అంటుంది. అయితే నేను వచ్చేటప్పుడు వాడి బైక్ అక్కడే ఉండింది మూడంతస్తుల బిల్డింగ్ వైపు వెళుతున్నాడు. వాడు ఏమైనా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడా ఏంటి అని బాలు అనగానే అందరూ కంగారుపడి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తారు.. అయితే పైకి వెళ్ళిన శివని చూసి బాలు వాళ్ళందరూ కూడా కంగారు పడిపోతుంటారు. మీరు ఎవరైనా నా దగ్గరికి వస్తే నేను ఇక్కడి నుంచి దూకేస్తాను అని శివ అంటాడు. నన్ను దొంగ అని ఊరందరూ ముద్ర వేశారు నేను ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావడం లేదు. నన్ను పోలీసులు తీసుకెళ్లిపోతారా అని బాధ పడిపోతూ ఉంటాడు. మీ అక్క వాళ్ళని మీ అమ్మని చూసైనా ఒకసారి ఆగరా ఏం చేస్తున్నావ్ రా అనే బాలు అంటూ ఉంటాడు. ఇక మొత్తానికి అక్కడి నుంచి దూకపోతున్న శివనే కాపాడి బాలు పక్కకు తీసుకొని వస్తాడు. నీకు ఏం కాకుండా నేను చూసుకుంటాను అని బాలు మాట ఇస్తాడు..
ఇక సత్యంతో బాలు ఎంత చెప్తున్నా సరే ప్రభావతి మాత్రం వాడొక దొంగ అని పదేపదే అని మీనా అని బాధ పెడుతుంది.. నాన్న నేను చెప్పేది వినండి నాన్న వాడు డబ్బులు దొంగతనం చేశాడు కానీ అమ్మ చేసిన పనికి వాడు అలా చేశాడు.. రోజు ఇంట్లో 40 లక్షలు కొట్టేశాడు అప్పుడు ఎవరు ఏమి మాట్లాడలేదు. మీనా నగలు నీ దొంగతనం చేసి డబ్బులు తెచ్చుకున్నాడు. అప్పుడు కూడా ఎవరూ ఏమీ మాట్లాడలేదు.. ఇప్పుడు చిన్నపిల్లోడి మీద దొంగతనం మోపి వాడి జీవితాన్ని ఎందుకు నాన్న నాశనం చేస్తున్నారని బాలు అంటాడు.. ప్రభావతి మాత్రం వాడు హక్కు ఉంది కాబట్టే తీసుకున్నాడు అని మనోజ్ ని వెనకేసుకొని వస్తుంది..
అటు రోహిణి కూడా శివ చేసింది తప్పే అని అంటుంది.. కానీ బాలు మాత్రం వీడు చేస్తే తప్పులేదు కానీ పసి పిల్లోడు చేస్తే తప్ప అని అంటారు.. మీనా మావయ్య నాకు ఏ పాపం తెలియదు మామయ్య. నాకెందుకు శిక్ష వేస్తున్నారు అర్థం కావడం లేదు అని మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు అక్కడ ఇచ్చిన పోలీసులతో ప్రభావతి వాడు ఒక దొంగ అని కంప్లైంట్ ఇస్తుంది. బాలు ఎంతగా బ్రతిమిలాడుతున్నా సరే.. ప్రభావతి మాత్రం అసలు విననే వినదు.. ఇక ఇది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని ప్రభావతి మీనా కి షాక్ ఇస్తుంది..
అది వెళ్లకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని ప్రభావతి శబదం చేసి మరి ఇంట్లోంచి వెళ్లిపోతుంది.. కామాక్షి దగ్గరికి వెళ్ళిన ప్రభావతి. అక్కడ జరిగిన విషయాన్ని చెప్పి మీనా చేసింది తప్పేమీ అంటుంది. కామాక్షి గడ్డి పెట్టడంతో మీనా చేసింది తప్పేమీ కాదు అని అనుకుంటుంది. ఇక రాత్రి అవగానే మీనా కన్నీళ్లు పెట్టుకొని బాధపడిపోతూ ఉంటుంది.. నువ్వేమీ ఏడవలసిన అవసరం లేదు వాడికి ఏమీ కాదు నేను చూసుకుంటాను అని బాలు అంటాడు.. ఉదయం శోభ ఇంటికి వచ్చి వదిన గారు ఎక్కడ అని కావాలని అడుగుతుంది.. ఇక రోహిణి కూడా శోభాతో కావాలని మాట్లాడుతుంది.. శోభ మీనా వాళ్ళ తమ్ముడు చేసిన దొంగతనం గురించి తెలుసుకొని షాక్ అవుతుంది. అక్కడికి వచ్చిన బాలు మీ ఆయన బల్ల కింద చేతులు పెట్టి డబ్బులు తీసుకుంటున్నాడు అంటే మీ ఆయన మీద ఎన్ని కేసులు పెట్టాలి అని వెటకారంగా మాట్లాడుతాడు..
Also Read : కత్తితో పొడిచిన విషయాన్ని చెప్పేసిన చక్రీ.. పెద్ద సాహసం చేసిన చేసిన.. మహాకు క్లాస్ పీకిన చక్రీ..
పార్లరమ్మ వాళ్ల నాన్న దొంగతనం చేసి జైలుకు వెళ్ళాడు. శోభ కి ఎంత చెప్తున్నా సరే శివ చేసింది దొంగతనమే అని తన అంటుంది. మా పరువు ఎలా పోతుంది. అవునా మీ పరువు పోయే పని అక్కడ ఏం జరుగుతుంది అని.. బాలు కూడా శోభా కి దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్ల మీద కౌంటర్ ఇస్తాడు. కానీ మీనా కూడా రోహిణి మీద కౌంటర్లు వేస్తుంది. ఇక శోభ రవి వాళ్ళ గదిలోకి వెళ్లి మాట్లాడుతుంది. కానీ శృతి మాత్రం శోభ కి దిమ్మ తిరిగిపోయేలా సమాధానం చెబుతుంది.. మీరు చుట్టాల మాటలు మోసుకొని వచ్చి ఇలా మాట్లాడడం మంచిది కాదు అని రవి కూడా అంటాడు. మీరిద్దరూ కలిసి నన్ను అవమానిస్తున్నారు అని శోభా అంటుంది. సుమతి పోలీసులు వచ్చి పార్వతీని తీసుకొని పోలీస్ స్టేషన్కు వచ్చారని చెప్పగానే బాలు మీనా అక్కడికి వెళ్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..