E-Paper
Advertisement

బంగారం, వెండిలో పెట్టుబడులు.. ఒకటి నుంచి కొత్త రూల్స్, మార్పులు చేర్పులు ఏంటి?

బంగారం, వెండిలో పెట్టుబడులు.. ఒకటి నుంచి కొత్త రూల్స్, మార్పులు చేర్పులు ఏంటి?
Advertisement

Gold-Silver ETFs: బంగారం, వెండి ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు పెడుతున్నారా? ఇకపై వీటికి కొత్త రూల్స్ రాబోతున్నాయి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా- సెబీ కొత్తగా తీసుకొచ్చిన రూల్ ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇంతకీ సెబీ తీసుకొచ్చిన కొత్త నియమ నిబంధనలేంటి? పెట్టుబడుదారులకు రిలీఫ్ లభిస్తుందా? ఏంటి అనేదానిపై ఓ లుక్కేద్దాం.

బంగారం, వెండిలో పెట్టుబడులు..  ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త రూల్స్

Advertisement

దేశవ్యాప్తంగా వ్యాపారం లావాదేవీలు చూసుకునేవారికి ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఆనాటి నుంచి వర్తిస్తాయి. ఆర్థిక అంశాల మాదిరగా రకరకాల ఈటీఎఫ్‌ల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. బంగారం, వెండి ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్ పథకాల్లో భౌతిక వాల్యూయేషన్ పూర్తిగా మారనుంది.

సెబీ జారీ చేసిన సర్క్యులర్‌లో కీలక మార్పులు వెల్లడించింది. నిన్నటివరకు ఈటీఎఫ్, మ్యూచవల్ ఫండ్స్ విలువ( NAV లెక్కింపు) లండన్ వేదికగా బులియన్ మార్కెట్ అసోసియేషన్ ధరలను ఫిక్స్ చేసేది. అందులో రూపాయి మార్పిడి, దిగుమతి పన్నులు, నామమాత్రపు ప్రీమియం, డిస్కౌంట్‌లు కలిపి వాటి విలువను NAV పేరిట లెక్కించేవారు.

Advertisement

దేశీయ మార్కెట్‌కు అనుగుణంగా మార్పులు, మదుపరులకు మంచి సంకేతాలు

దేశంలోని గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు MCX, NSE ప్రచురించే ధరలను NAV లెక్కింపు కోసం ఉపయోగించనున్నారు. ఫిజికల్ డెలివరీ గోల్డ్, సిల్వర్ డెరివేటివ్స్ కు ఉపయోగపడే ధరలు. ఈ మార్పుల వల్ల పెట్టుబడుదారులకు లాభమేంటి? అన్నది అసలు ప్రశ్న. ఈటీఎఫ్‌ల NAV లెక్కింపు పారదర్శకంగా, దేశీయ మార్కెట్‌కు అనుగుణంగా ఉంటుంది.

అందువల్ల అంతర్జాతీయ స్థాయి ధరలను దేశీయంగా తీసుకోవడం సరికాదు. ఎగ్జాంపుల్.. ఒకప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో వాటి ధరలు పడిపోతే ఇండియా మార్కెట్ పతనమయ్యేవి. ఇకపై అలాంటి నిర్ణయం ఉండదని తెలుస్తోంది. ఇండియా పరిస్థితులకు అనుకూలంగా బంగారం, వెండి ఈటీఎఫ్‌ల్లో మార్పులు వచ్చాయి. డీమ్యాట్ ఖాతాదారులు లోకల్ బులియన్ మార్కెట్ ధరలతో సమానంగా తమ పెట్టుబడి విలువ చూడగలరు.

బంగారం, వెండి ETF ల్లో NAV విలువను అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌లకు బదులుగా దేశీయ ఎక్స్ఛేంజ్ స్పాట్ ధరలను ఉపయోగించి లెక్కిస్తారు. SEBI మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటుంది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం మేరకు.. బంగారం-వెండి ఈటీఎఫ్‌ల ధరలను ట్రాక్ చేసినప్పటికీ వాల్యుయేషన్, ట్రాకింగ్, లిక్విడిటీలో తేడాల వల్ల వివిధ పథకాల రాబడులలో స్వల్ప వ్యత్యాసాలు ఏర్పడవచ్చని అంటున్నారు.

ALSO READ: పొదుపు పథకాల వడ్డీ రేట్లను ఖరారు చేసిన కేంద్రం.. పెరిగాయా? తగ్గాయా?

దీనివల్ల రాబడులు స్థిరంగా ఉంటాయని అంటున్నారు. ETFల నెట్ అసెట్ వాల్యూ దగ్గరగా ఉంటాయని చెబుతున్నారు. ట్రాకింగ్ డిఫరెన్స్ తప్ప రిటర్న్స్ దగ్గరగా వస్తాయని, ఇండియా మార్కెట్ వాస్తవ ధరలకు దగ్గరగా ఉంటుంది. వీటిపై పెట్టుబడిదారులు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కొత్త రూల్స్ ఆటోమేటిక్‌గా అమల్లోకి వస్తాయి.

పెట్టుబడి విలువల్లో మార్పులు రానున్నాయి. కొత్తగా పెట్టుబడి పెట్టేవారు ఫండ్ హౌస్‌ల నుంచి NAV, ట్రాకింగ్ ఎర్రర్ వివరాలు జాగ్రత్తగా చెక్ చేయాలి. ఏమైనా ఎర్రర్స్ ఉంటే అప్రమత్తం కావాలి. తర్వాత రోజుల్లో ఎర్రర్స్ క్రమంగా తగ్గుతాయి. దీనివల్ల దేశీయ ధరలు స్థానిక ఇన్వెస్టర్లకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. రానున్న రోజుల్లో అన్ని ఫండ్ హౌస్‌లు ఒకే విధంగా అమలు చేయనున్నాయి.

 

గమనిక: ఈ సమాచార ప్రయోజనాల కోసం, పెట్టుబడి సలహాగా పరిగణించకూడదు. పెట్టుబడిదారులు నిర్ణయాలు తీసుకునే ముందు వాటిపై పరిశోధన చేయాలి లేకుంటే రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను సంప్రదించాలి.

 

Related News

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

కరెన్సీ నోట్లపై గీతలకు ఇంత అర్థముందా? ఇన్నాళ్లు పిచ్చి గీతలు అనుకున్నామే..!

ఖరీదైన ఫోన్ కొనేముందు ఈ ట్రిక్ తెలుసుకోండి.. ఈఎంఐ వడ్డీ చెల్లించే బదులు రాబడి పొందండి

పతనమవుతున్న బంగారం ధర.. అంతర్జాతీయ పరిణామాలేంటి? తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పరిశీలిద్దాం

Big Stories

Advertisement
×