E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీపై మహాకు అనుమానం.. క్లాస్ పీకిన మాధవ్.. మహాకు షాకిచ్చిన నారాయణ..

Podarillu Today Episode : చక్రీపై మహాకు అనుమానం.. క్లాస్ పీకిన మాధవ్.. మహాకు షాకిచ్చిన నారాయణ..
Advertisement

Podarillu Today Episode March 6th : నిన్నటి ఎపిసోడ్ లో.. గదిని అద్దెకిచ్చే వ్యక్తి దగ్గరికి వెళ్లి అతన్ని బెదిరిస్తాడు చక్రీ. ఇల్లు అద్దగిస్తే మర్యాదగా ఉండదు అని అంటాడు.. అతను సరే అండి అలాగే అని అంటాడు.. ఆ తర్వాత మహా దగ్గరికి వెళ్లిన చక్రి ఎంతగా అడిగినా సరే మహా మాత్రం నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే అని అంటుంది. అన్న వెళ్లిపోయిన తర్వాత వెళ్ళిపోతాను అని అనగానే మహా మాధవ్ ఫీల్ అవుతాడు. ఇక తర్వాత ఎగ్జామ్ రాయడానికి కన్నా రెడీ అవుతూ ఉంటాడు.. అప్పుడే అక్కడికి వచ్చినా మహాను చూసిన మాధవ్ నీకు కూడా రెండు దోసలు వేసి పెడతానమ్మా తిను అని అంటాడు. నాకు దోశలు ఏమీ వద్దు పెద్ది అని మహా అంటుంది.. కానీ మాధవ్ మాత్రం నా చేతి వంట ఇంకెప్పుడు తింటావో ఏంటో.. అని ఎంత చెప్తున్నా సరే మహా మాత్రం నాకు దోశలు వద్దు అని అంటుంది. మహా వేరే ఇంటికి వెళ్ళాలి అని అన్ని సిద్ధం చేసుకుంటుంది.. అయితే ఆ ఇంటికి వెళ్ళగానే ఓనర్ఇల్లు లేదు ఏమీ లేదు అని షాక్ ఇస్తాడు. నిన్న టోకెన్ అడ్వాన్స్ తీసుకొని అంటారేంటి అని మహా కూడా షాక్ అవుతుంది. చక్రి వచ్చి అతని అడిగిన సరే ఇందులో లేదు అని అంటాడు అక్కడితో ఆ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరుతారు. అప్పుడే కన్నా కేశవ ఇద్దరు ఇంటికి వస్తారు.. నా ఇంట్లోకి రాగానే వదినెక్కడ అని అడుగుతాడు. మాధవ్ వచ్చి రాతలకే వదినని ఎందుకు అడుగుతున్నావ్ రా అని అంటాడు. నీకెవరు చెప్పారు అంటే కేశవ చెప్పాడు అని అంటాడు. ఇక చక్రి మహా ఇద్దరు బ్యాగుతో వెళ్లారు అని చెప్పగానే మాధవ్ కన్నాకి ఎలా నిజం చెప్పాలి అర్థం కావట్లేదని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఎక్కడికి మహాచక్రి ఇద్దరూ వచ్చేస్తారు.. కన్నా ఎక్కడికి వెళ్లావు వదిన అని ఎంతగా అడుగుతున్నా సరే మహా మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది.. మాధవ్ మహా ఇద్దరు కూడా ఎవరో శత్రువులు ఇల్లు రాకుండా చేశారేమో అని అనుమానపడతారు.. మాధవ్మా త్రం చక్రి మీద అనుమానం ఉంటుంది.

Advertisement

ఇకపోతే చక్రి ఎలాగోలాగా మాధవ్నుంచి తప్పించుకుని బయటకు వచ్చేస్తాడు. పెద్ది నాకు చాలా ఇబ్బందిగా ఉంది పెద్ది అని మహా అడుగుతుంది. ఎందుకమ్మా ఇది నీ ఇల్లు అని ఫీల్ అవ్వమని చెప్పాను కదా.. నీకు ఎన్ని రోజులు కాపోతే అన్ని రోజులు ఇక్కడే ఉండమ్మా మా ఇంటి ఆడబిడ్డగా నేను చూసుకుంటాను అని మాధవ్ అంటాడు. నాకు అందులో భయం లేదు పెద్ది నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను మీరు నిజం చెప్తారా అని అంటాడు.. మీ నాన్న నిజంగానే మీ అమ్మని హత్య చేసి జైలుకు వెళ్లడానికి మహాలక్ష్మి అడుగుతుంది. అది నిజమని చెప్పలేను అబద్ధమని చెప్పలేను. కానీ మా నాన్న మాత్రం అలా చేసి ఉండడని నా నమ్మకం.. మా నాన్న అలాంటి వాడు కాదు అని మహాతో మాధవ్ అంటాడు..

చక్రి మహాలక్ష్మి మళ్ళీ ఇంటికి వచ్చిందని చాలా సంతోషంగా ఉంటాడు.. మాధవ్ మాత్రం వెనకాలే వచ్చి అరే నువ్వే ఇదంతా చేశావు కదరా అని చక్రిని అడుగుతాడు.. నేనెందుకు చేస్తానన్నయ్య ఎందుకు నా మీద మీకు అంత అనుమానం అని చక్రి అంటాడు.. నేనెందుకు ఆ పని చేస్తాను అన్న మీరు తప్పుగా అనుకుంటున్నారని చక్రీ ఓవరాక్షన్ చేస్తాడు.. దాంతో నిజంగానే చక్రిని ఆ ఇంటిని మహా కి రాకుండా చేశాడు అని మాధవ్ కి అనుమానం వస్తుంది. నేను బాగానే మేనేజ్ చేసేనే ఎక్కడ దొరికిపోయాను అన్నయ్య అని చక్రి అంటాడు. నువ్వు చేసిన ఓవరాక్షన్ నిన్ను దొరికేలా చేసింది అని చక్రి తో మాధవ్ అంటాడు..

Advertisement

ఇక తర్వాత శైలు ఎలాగైనా సరే వాడి దగ్గర నుంచి ఫోన్ కొట్టేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎవర్ని పంపినా కూడా తిరిగి పార్సల్ చేసి నా దగ్గరికి పంపిస్తున్నాడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ బుర్ర గోక్కుంటుంది.. అయితే వాళ్ళ అమ్మని అడిగితే డబ్బులు ఇస్తుందేమో అనుకొని వెళ్తుంది. కానీ అప్పటికే వాళ్ళమ్మ వాళ్ళ అన్నయ్యతో డబ్బులు కోసం యుద్ధం చేస్తుంది.. వామ్మో ఇప్పుడు నాకు అమ్మ అమ్మోరు లాగా కనిపిస్తుంది ఈ టైంలో వెళ్లి నేను అడిగితే కచ్చితంగా నన్ను చంపేస్తుంది అని శైలు భయపడి వచ్చేస్తుంది. ఎలాగైనా సరే వాడి దగ్గర నుంచి నా ఫోను తీసుకొని రావాలి అని ఆలోచిస్తూ ఉంటుంది శైలు. అయితే అంతలోకే వాళ్ళ అన్నయ్య వచ్చేసి నిజం తెలుసుకుంటాడు.. ఏదో ఒకలాగా మేనేజ్ చేస్తుంది..

Also Read :ఫైనాన్స్ కోసం వెళ్లిన ధీరజ్.. శ్రీవల్లికి కొత్త టెన్షన్.. కన్నీళ్లు పెట్టుకున్న నర్మద..

రాత్రి అందరూ ఒకే చోటు పడుకోవడం చూసిన నారాయణ చక్రి బయట పడుకోవడం చూసి ఏంట్రా ఇక్కడ పడుకున్నావేంట్రా.. నీకు పెళ్లయింది కదరా ఇప్పుడు నువ్వు బయట పడుకోవడం ఏంట్రా అనేసి లోపలికి వెళ్ళు అని బలవంతంగా పంపించేస్తాడు.. ఒకవైపు మాధవ్ చెప్తున్న సరే నారాయణ మాత్రం అసలు ఒప్పుకోకుండా లోపలికి పంపిస్తాడు.. నారాయణ అలా వెళ్లగానే మాధవ్ చక్రిని బయటకు తీసుకొని వస్తాడు.. కానీ చక్రిని మళ్లీ బయటికి తీసుకురావడంతో కేశవ ఏంటి అన్నయ్య మళ్లీ బయటికి తీసుకొచ్చావు అని అంటాడు.. నాకు పెళ్లి అయ్యేంతవరకు వాళ్ళు బయట పడుకుంటామని చెప్పారు కదరా పడుకొనివు అని అంటాడు. ఉదయం లేవగానే మాధవ్ పై కేశవ సీరియస్ అవుతుంది.. కానీ మాధవ్ నిజం చెప్పలేక ఏదో ఒకటి చెప్పి కేశవ అని మేనేజ్ చేస్తాడు. చక్రీ అబద్దాల గురించి మరోసారి బయటపడి మహా షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూడాలి…

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×