BigTV English

Gundeninda GudiGantalu Today episode: మీనాకు నిజం చెప్పిన బాలు.. రోహిణి దిమ్మతిరిగే షాక్..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు నిజం చెప్పిన బాలు.. రోహిణి దిమ్మతిరిగే షాక్..

Gundeninda GudiGantalu Today episode May 11th: నిన్నటి ఎపిసోడ్ లో.. తన తమ్ముడు చెయ్యి బాలు విరగొట్టిన విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పి మీనా బాధపడుతూ ఉంటుంది. మీనా బాధని చూసి చూడలేక రోహిణి శృతి ఇద్దరు ఓదారుస్తూ ఉంటారు. ఇంట్లోకి అప్పుడే వచ్చిన బాలుపై సత్యం సీరియస్ అవుతాడు. నువ్వు చేసిన పనేం బాగా లేదంటూ సత్యం కోపంగా బాలుని తిడతాడు. వాడు ఏం చేసాడో తెలిస్తే మీరందరూ వాన్ని తిడతారంటూ బాలు తనకు తెలిసిన నిజాన్ని బయట పెట్టేందుకు ప్రయత్నిస్తాడు. కానీ మీ నా మొహం చూసి ఆగిపోతాడు. ప్రభావతి మాత్రం బాలు ఏదో దాస్తున్నాడని నిజాన్ని బయట పెట్టాలని ఎంతో కంగారు పడుతూ ఆలోచిస్తుంది. ప్రభావతి ఒక్క మాట అనగానే బాలు ఇవన్నీ నీకు అవసరం లేదు అని నోరు మూయిస్తాడు. ఇంట్లోనే అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా బాలుదే తప్పు అంటూ నిందిస్తారు. నేను ఎందుకిలా చేశానో అందరికీ తెలిస్తే ఆ రోజు నన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు అంటూ బాలు అంటారు. బాలు ఎంత అడిగినా నిజం చెప్పకపోవడంతో మీనా విసిగిపోతుంది. ఆయనను ఏమి అడగద్దు అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ప్రోమో విషయానికొస్తే.. తన తమ్ముడికి ఎలా అయిందని మీనా బాధపడుతూ ఉంటుంది. అయితే బాలు మాత్రం శివ చేయని ఎందుకు విరగొట్టాడు అందుకు కారణం ఏంటి అని అడిగితే చెప్పడు. ఎవరు ఎంత అడిగినా కూడా బాలు అసలు బయట పెట్టాడు. ఆఖరికి సత్యం కూడా నువ్వు ఇలా చేస్తావని అసలు ఊహించలేదంటూ అంటాడు. అయితే ఇంట్లో వాళ్ళందరూ కూడా బాలు ఏదో కారణం వల్లే శివను కొట్టారని అనుకుంటారు. ముఖ్యంగా ప్రభావతి బాలు కారణం లేకుండా ఎవరిని కొట్టారు కదా ఏదో బలమైన కారణమే ఉంటుంది. కానీ వీడు ఏదో దాస్తున్నాడు. బాలు దాస్తున్న అసలు నిజం ఏంటో తెలుసుకోవాలని ప్రభావతి ప్రయత్నిస్తుంది.

నేనా బాలు పై కోపం పెంచుకుంటుంది. తన తమ్ముడు కెరియర్ ని బాలు నాశనం చేస్తున్నాడని. చేతులు విరగొట్టేలా నా తమ్ముడిని ఎందుకు కొట్టాడు అంటూ అలుగుతుంది.. బాలు మాత్రం మీ నాకు నిజం చెప్తే బాధపడుతుందని, అందరికీ ఈ నిజం తెలిస్తే మీనాని చులకనగా చూస్తారని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక బాలు మీనా తో మాట్లాడడానికి ఎంత ప్రయత్నించినా మీనా ఇష్టపడదు. నీకు కోపం ఉంటే నా మీద చూపించాలి. నన్ను అడగాలి.. కానీ ఇంట్లో వాళ్ళందరూ ముందర ఇలా రచ్చ చేస్తారని నేను అస్సలు అనుకోలేదంటూ పాలు అంటారు.


మీరు నాతో ఏం మాట్లాడకండి నా తమ్ముడికి ఇలా జరిగినందుకు మీరు ఏం బాధపడట్లేదు చూశారా..? మీరే కొట్టి కనీసం పలకరించలేదు కూడా ఇది నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది.. బాలు మాత్రం నేను ఒక విషయాన్ని చెప్పలేకపోతున్నాను ఆ విషయం చెప్తే నీ గుండె ఆగిపోతుంది. అందుకే నీకు ఏ విషయం చెప్పలేదు అంటూ బాలు ఎంత నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా మీనా మాత్రం బాలు మొహం కూడా చూడదు. అందరూ భోజనాలు చేసే పడుకుంటారు. మీనా హాల్లో కింద పడుకుంటుంది. బాలు మేడ మీద పడుకుంటాడు. అయితే అక్కడ పడుకున్నప్పటినుంచి బాలుకి మీనా తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. అలా నిద్రలోకి జారుకోగానే.. సుశీలకొచ్చిన కళ నిజం అవుతుందేమో అని ఉలిక్కిపడి ఒక్కసారిగా లేస్తాడు.

అయితే, షీలా డార్లింగ్ అన్నట్లు మీనా ఇంట్లోంచి వెళ్ళిపోతుందేమో నాకు భయమేస్తుంది అంటూ ఆలోచిస్తాడు. ఇక ఏదైతే అదే అయింది మీనాకు నిజం చెప్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది నన్ను తప్పుగా అర్థం చేసుకోదంటూ అనుకుంటారు బాలు. ఇక మీ నాకు నిజం చెప్పడానికి మీనా దగ్గరికి వెళ్తాడు. మీనా బాలు రావడం చూసి ఈయన నాకు నిజం చెప్పడానికి వచ్చినట్లున్నారు అని అనుకుంటుంది. బాలు నీకు నిజం చెప్పాలి అని అంటాడు. ఏ నిజం అది అని మీనా అడుగుతుంది.. అసలు విషయాన్ని మీనాకు చెప్పేస్తాడు. రోహిణి గురించి కూడా ఓ నిజం తెలిసే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రభావతి మాత్రం మీనా బాలుని ఎలాగైనా ఇంట్లోంచి పంపించాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది. మరి ఏం జరుగుతుందో సోమవారం ఎపిసోడ్లో చూడాల్సిందే..

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×