BigTV English

Gundeninda GudiGantalu Today episode: బాలు, మీనాలను పంపేందుకు రోహిణి ప్లాన్.. ప్రాణాలతో బయటపడ్డ సత్యం..

Gundeninda GudiGantalu Today episode: బాలు, మీనాలను పంపేందుకు రోహిణి ప్లాన్.. ప్రాణాలతో బయటపడ్డ సత్యం..

Gundeninda GudiGantalu Today episode May 1st : నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా బాలుకి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇస్తుంది. మంచాన్ని పూలతో శోభనం కోసం ఏర్పాటు చేస్తుంది. అది చూసిన బాలు సంతోషంతో మీనాపై ప్రేమను కురిపిస్తాడు. ఇద్దరు కలిసి డ్యూయెట్ సాంగ్ వేసుకుంటారు. మొత్తానికి బాలు మీనా శోభనం జరిగిపోతుంది. రోహిణి పడుకోడానికి బెడ్ రూమ్ కి వస్తుంది. రోజు సర్వర్ లాగా ఫుడ్ ఐటమ్స్ పేర్లు చెప్పి కలవరిస్తూ ఉంటాడు. రెండుసార్లు కలవరించడంతో రోహిణి మనోజ్ నీ నిద్ర లేపుతుంది. ఏంటి మనోజ్ ఫుట్ ఐటమ్స్ పేరు చెప్పి ఏదో సర్వర్ లాగా కలవరిస్తున్నవ్ ఏంటి అని అడుగుతుంది. పొద్దున టిఫిన్ చేద్దామని ఒక రెస్టారెంట్ కి వెళ్ళాను రోహిణి. అక్కడ కపుల్ దోస అని మసాలా దోశలు పెట్టారు అది మనిద్దరం కలిసి తినాలని అనుకున్నాను. ఇక నువ్వు లేవు కదా అని సింగిల్ ఇడ్లీతో సరిపెట్టుకుని వచ్చేసానని మనోజ్ అబద్ధం చెప్తాడు. ఇక ఇద్దరూ కలిసి సరదాగా నవ్వుకుంటారు. అటు శృతి, రవిలు కూడా గేమ్ విషయంలో కీచులు ఆడుకొని సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. మీనా బాలు కూడా తమ ఫస్ట్ నైట్ గురించి మాట్లాడుకుంటూ సరదాగా మురిసిపోతూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంట్లో అందరూ నవ్వుకోవడం చూసి ప్రభావతి ఏంటి అర్ధరాత్రి గోల అని లేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనాక్షి ఆకలేస్తుందని అక్కడ దగ్గరిలో ఉన్న రెస్టారెంట్ కు వెళ్తుంది. అయితే రెస్టారెంట్లోకి ప్రభావతి కామాక్షి రావడం చూసి మనోజ్ షాక్ అవుతాడు వాళ్లకు కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతాడు. ఆర్డర్ తీసుకోవడానికి అక్కడికి ఎవరిని పిలిచినా రారు. ఓనర్ వచ్చి ఆ మిడిగుడ్లోడు మనోజ్ ఎక్కడికి పోయాడు కస్టమర్లు వచ్చినప్పుడు ఆర్డర్ తీసుకోవాలని తెలియదా అని సీరియస్ అవుతాడు. మనసు తన ఫ్రెండ్ ను మేనేజ్ చేసి ఆర్డర్ తీసుకోమని పంపిస్తాడు. అతను సరే అని ఒప్పుకొని వెళ్లి ప్రభావతి కామాక్షి దగ్గర ఆర్డర్ తీసుకుంటాడు. ఈ క్రమంలో హోటల్ యజమాని మనోజ్ మనోజ్ అంటూ మాటిమాటికి అరుస్తూ ఉంటాడు. సరిగా పనిచేయడం లేదు అంటూ నానా మాటలు తిడతాడు. అలా తన కొడుకు మనోజ్ పేరుతో ఆ ఓనర్ తిడుతూ ఉంటే ప్రభావతి తట్టుకోలేక పోతుంది. కామాక్షి మాత్రం మనోజ్ ఇక్కడే పని చేస్తున్నాడేమో అని సందేహిస్తుంది. వీరి మాటలను ఓవైపు మనోజ్ చూస్తూనే ఉంటాడు.

అయితే ఓనరు మనోజ్ పేరు నీ పదే పదే పిలవడం చూసి ప్రభావతి అంత మంచి పేరుని ఈ సవర్ పెట్టుకుంటాడా సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేయాల్సిన అలాంటి పేరు వాళ్లు ఇక్కడ పని చేస్తున్నారా..? నా కొడుకు పేరు పెట్టుకున్నందుకు వాడుకొక 100 ఇచ్చి పేరు మార్చుకోమని చెప్తానని ప్రభావతి అంటుంది. దానికి కామాక్షి నువ్వు ఇచ్చే రూ.100 కోసం వాడుకీ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరును మార్చుకుంటాడా చాదస్తం కాకపోతే అని తిడుతుంది.


ప్రభావతి తన కొడుకు మనోజ్ కు ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ కూడా అక్కడే రింగ్ అవుతుంది. ఇక కామాక్షి అనుమానంతో ఆ ఫోన్ లిఫ్ట్ చేసేందుకు వెళుతుంది. వీరి వెనకాల ఉన్న మనోజ్ కౌంటర్ దగ్గర చార్జింగ్ పెట్టిన ఆ ఫోన్ దగ్గరికి వెళ్లలేక పోతాడు. కామాక్షి లేచి ఆ ఫోన్ దగ్గరికి వెళ్లి తీసుకునే లోపు.. మనోజ్ ఇంకో వెయిటర్ ని పంపించి ఫోన్ లిఫ్ట్ చేయమని చెప్తాడు. ఇక అతను ఆ ఫోన్ తీసుకోవడంతో కామాక్షి కూడా మనోజ్ ఫోన్ కాదని వెనక్కి తిరిగి వస్తుంది. ఇక ఫోన్ తీసుకొని వెళ్ళిన మనోజ్ మళ్ళీ తిరిగి ప్రభావతికి ఫోన్ చేస్తాడు. ప్రభావతి మాట్లాడుతూ సాఫ్ట్వేర్ కంపెనీలో బిజీగా పని చేసుకుంటున్నావా మనోజ్ అని అడుగుతుంది. అవునని మనోజ్ చెప్తాడు.

ఇక స్టూడియో నుంచి ఇంటికి వచ్చిన శృతి నేను చాలా అలసిపోయాను మీనా నాకు ఒక కాఫీ ఇస్తావా అని అడుగుతుంది. అయితే అప్పుడే ఇంట్లోకి దోమలు రావడం చూసి శృతి ఈ దోమల బాధ తట్టుకోలేకపోతున్నానని స్ప్రే కొట్టుతుంది ఆ స్ప్రే కి ఘాటుగా ఉందని మీనా ఎంత చెప్పినా శృతి వినదు. ఇంట్లోకి వచ్చేది రెండు మూడు దోమలే కదా వాటికి ఇంతగా స్ప్రే చేయాలా వద్దు శృతి అని మీనా చెప్తున్నా శృతి ఆగదు. ఇక శృతికి మళ్లీ డబ్బింగ్ స్టూడియో నుంచి ఫోన్ వస్తుంది వెంటనే మళ్ళీ స్టూడియోకి రావాలని చెప్పగానే స్ప్రే పక్కన పెట్టేసి అర్జెంటుగా వెళ్లాలి మీనా అని కాఫీ కూడా కాకుండా వెళ్ళిపోతుంది.

అప్పుడే హాల్లోకి వచ్చిన సత్యం ప్రభావతి గురించి మీనాన్ని అడుగుతాడు. కామాక్షి పిన్ని తో కలిసి బయటికి వెళ్లిందని మీనా చెబుతుంది.. ఈ మాట నీకు చెప్పిందా అని సత్యం అడుగుతాడు. లేదు మామయ్య వెళ్తుంటే చూశాను అని మీనా చెప్తుంది. ఏదో వాసన తేడా కొడుతుందమ్మా ఏంటిది అంటే శృతి దోమల కోసం అని స్ప్రే కొట్టింది మామయ్య. ఈ వాసన ఘాటుగా వస్తుందమ్మా నాకు ఊపిరి అందట్లేదు అని సత్యం అంటాడు.. కాసేపు ఊపిరి తీర్చుకోవడానికి ఇబ్బంది పడతాడు సత్యం. ఇక మీనా హాస్పిటల్ కి తీసుకెళ్లాలని ఎవరికీ ఫోన్ చేసినా ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయరు. మీనా అనే హాస్పిటల్ కి తీసుకెళ్తుంది బాలు ఫోన్ చూసుకుని మళ్ళీ ఫోన్ చేస్తే మీనా జరిగిన విషయాన్ని బాలుకి చెప్తుంది.

మస్కిటో స్ప్రే ఎక్కువ అవ్వడం వలన ఊపిరి తీసుకోవడం కష్టంగా మారిందని, సమయానికి ఆసుపత్రికి తీసుకురావడం వల్ల ఎలాంటి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని చెబుతారు. ఇక వెంటనే ప్రభావతి వచ్చి కంగారు పడుతుంది. విషయం తెలుసుకోకుండానే మీనా ను నానా మాటలు అంటుంది. మీ వీధిలో అన్ని దోమలు ఉంటాయి కదా అందులోనే పుట్టి పెరిగావు కదా స్ప్రే లేకపోతే ఉండలేవు అని మీనా అనే స్ప్రే చేసిందని తెట్ల పురాణం మొదలుపెడుతుంది. దీంతో మేలుకున్న సత్యం ప్రభావతిని అడ్డుకుంటాడు. బాలు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు.. ఇక స్ప్రే కొట్టింది శృతి అనగానే ప్రభావతి మౌనంగా ఉంటుంది. ఈయన కొట్టిన తెలియగానే చిందులే సరే ఇప్పుడు ఆ డబ్బులు అమ్మ కొట్టిందంటే ఎందుకు మౌనంగా ఉన్నావని ప్రభావతిని అడుగుతాడు.

అప్పుడే హాస్పిటల్ కి మనోజ్ రవి వస్తారు.. నాన్నకు ఎలా ఉందని అడుగుతుంటారు. దీంతో బాలు రవి పై మండిపడతాడు. ఎలా ఉందో నీ పెళ్ళాన్ని అడిగి తెలుసుకో తిడతాడు. రెండుసార్లు నీవల్ల నాన్న ఆసుపత్రి పాలయ్యారని బాలు ఆవేదన వ్యక్తం చేస్తాడు. ఆయన కోలుకొని తిరిగి ఇంటికి వచ్చాక అందరు లెక్కలు తీరుస్తానని, ఇంట్లో నుంచి వెళ్లగొడతానని అంటాడు. ముందు సత్యం ట్రీట్మెంట్ కావాల్సిన మందులు తీసుకొని రావడానికి బాలు బయటికి వెళ్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఎపిసోడ్లో బాలు శృతిని తిడతాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Brahmamudi Serial Today August 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ను తిట్టిన కావ్య – ప్రేమ లేకపోతే ఎందుకొచ్చావన్న రాజ్‌   

Illu Illalu Pillalu Today Episode: తప్పించుకున్న ఆనందరావు.. భద్రకు దొరికేశాడు.. మొత్తం నిజం కక్కేసాడుగా..

Intinti Ramayanam Today Episode: ఇంట్లోంచి లేచిపోతున్న ప్రణతి, భరత్.. అక్షయ్ ను కూల్ చేసిన అవని… భరత్ ను టార్గెట్ చేసిన పల్లవి..

Big Stories

×