Depression Solution: డిప్రెషన్ అనేది ఒక మానసిక సమస్య మాత్రమే కాదు అది శారీరకంగా కూడా ప్రభావం చూపుతుంది. ఒక వ్యక్తి ఏదైనా అంశం లేదా సమస్య గురించి లోతుగా అంటే తదేకంగా ఆలోచిస్తూ ఉంటే లేదా ఒక సమస్య వల్ల మరీ ఎక్కువగా ఆలోచిస్తే అప్పుడు జీవితంలో ప్రశాంతత ఉండదు. అలాంటి స్థితిలో ఆ వ్యక్తి డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడు. అతడికి తన జీవితం అంతా నిరుత్సాహంగా కనిపిస్తుంది. పరుగులు తీసే ఈ రోజుల్లో ఒంటరితనం అనేది చాలా పెద్ద మానసిక సమస్య. చాలా సార్లు నలుగురి మధ్యలో ఆ వ్యక్తి ఉన్నా.. అతను ఒంటరిగా ఫీలవుతాడు. తనని ఎవరూ పట్టికోవడం లేదని అనుభవిస్తాడు.
ఒంటరితనం, ఎక్కువగా ఆలోచించడం, భోజనం తినాలంటే అనాసక్తిగా ఉండడం లేదా ఎంతా తిన్నా సంతృప్తి కరంగా లేకపోవడం, ఆందోళన, నిద్రలేమి, ఒత్తిడి.. ఇలాంటి లక్షణాలన్నీ డిప్రెషన్ అనే మానసిక స్థితిని సూచిస్తున్నాయి. ఈ లక్షణాలు కనిపిస్తే ఆ వ్యక్తి మానసిక రోగి అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్యను సమయం ఉండగా గుర్తించకపోయినా లేదా దీన్ని పరిష్కరించడానికి చర్యలు తీసుకోకపోయినా ఈ డిప్రెషన్ చాలా సీరియస్ మెంటల్ కండీషన్ గా మారిపోతుంది.
అందరిలో ఉన్నా ఆ వ్యక్తి ఎందుకు తనని తాను ఒంటరిగా ఫీలవుతాడు?
మానసిక వైద్య నిపుణులు ఈ సమస్య చాలా తీవ్రమైనది గుర్తించారు. సమాజంలో కలివిడిగా ఉండడం, తనపై తనకు నమ్మకం లేకపోవడం, ఆత్మ విశ్వాసం తక్కువగా ఉండడం, పరిష్కారం లేని ఏదైనా భావోద్వేగ సమస్యలు ఉంటే అవి కడా ఒంటరితనాన్ని కారణమవుతాయి. ఒక వ్యక్తి తనను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు, తన భావాలను అందరూ నిర్లక్ష్యం చేస్తున్నారని భావిస్తే అతను నలుగురిలో ఉన్నా ఒంటరితనంతో బాధపడుతుంటాడు. అని సైకియాట్రిస్టులు చెబతున్నారు.
అప్పుడప్పుడు జీవితంలో ఇలాంటి మానసిక సమస్యలు అందరికీ వస్తాయి. కానీ ఎక్కువ కాలం అలాగే అనిపిస్తుంటే.. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. నలుగురితో కలివిడిగా ఉండడం లేదా మీ ఫీలింగ్స్ ని ఎదుటివారికి అర్థమయ్యే చెప్పడం మానసిక ప్రశాతతను కలిగిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: ఎయిర్‌పోర్ట్ సమీపంలో నివసిస్తున్నారా?.. ఆయువు తగ్గిపోతుంది జాగ్రత్త
స్నేమితులున్నా మీరు ఒంటరిగా ఫీలైతే ఇలా చేయండి..
మీ సమస్యలను, మీ మనోభావాలను గుర్తించండి. మీ ఫీలింగ్స్ అణచివేయకండి వాటిని స్వీకరించండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాను? సమస్య నాలోనే ఉందా? అని ప్రశ్నలకు సమాధానం కోసం ప్రయత్నించండి.
మీరు బాగా నమ్మె ఒక వ్యక్తితో మాట్లాడండి. ఒక స్నేహితుడు, ఒక కుటుంబ సభ్యుడు, లేదా మానసిక ఆరోగ్య నిపుణుడిని కలవండి. మీ సమస్యలను, ఫీలింగ్స్ వారితో షేర్ చేసుకోండి. దాని వల్ల కాస్త ఉపశమనం లభిస్తుంది. కనీసం మీ సమస్య గురించి ఓపికగా వినే ఒక వ్యక్తి ఉన్నాడని కాస్త ధీమా ఉంటుంది. అంతేకాకుండా ఇలా సమస్యల గురించి చెప్పుకోవడం లేదా చర్చించుకుంటే కొన్ని సందర్భాల్లో సూచనలు, సలహాల రూపంలో పరిష్కారం లభిస్తుంది.
మిమ్మల్ని బిజీగా ఉంచుకోండి. మీకు ఉన్న స్పోర్ట్స్, యోగా, మ్యూజిక్, లేదా ఇతర కొత్త విషయాలు నేర్చుకునే హాబీలతో బిజీగా ఉండండి. అప్పుడు డిప్రెషన్ ఆలోచనలు మీ నుంచి దూరంగా ఉంటాయి.
ఒక ఆరోగ్య వంతమైన జీవితాన్ని గడపండి. అందుకోసం క్రమశిక్షణను పాటించండి. సమయానికి నిద్రపోవడం, కంటి నిండా నిద్రపోవడం, పౌష్టికాహారం సమపాళ్లలో తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం వంటివి మెదడు ఆరోగ్యానికి మంచింది. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుందని పెద్దలు కూడా చెప్పారు.
మీకు మానసిక సమస్య తీవ్రంగా ఉంటే లేదా జీవితం ఇక దుర్భరం దీన్ని అంతం చేయాలని ఆలోచనలు తరుచూ వస్తుంటే సంకోచించకండి.. వెంటనే మానసకి వైద్యుడితో కలిసి సరైన చికిత్స్ తీసుకోండి.