E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: విల్లాలో ప్రభావతి ఓవరాక్షన్.. మనోజ్ పరువు తీసిన బాలు.. ఇదేం పేరురా నాయనా..

Gundeninda GudiGantalu Today episode: విల్లాలో ప్రభావతి ఓవరాక్షన్.. మనోజ్ పరువు తీసిన బాలు.. ఇదేం పేరురా నాయనా..
Advertisement

Gundeninda GudiGantalu Today episode May 2nd: విల్లా దగ్గరకు వెళ్ళగానే అంతా చూసి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. ఎంత పెద్ద విల్లానో ఇది ఎంత పెద్దగా ఉందో అంటూ నోరు వెళ్ళబెట్టుకొని ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది.. ఇక శృతి రవీలు కూడా ప్రభావతిపై సెటైర్లు వేస్తూ ఉంటారు. లోపలికి వెళ్ళగానే ఓనర్లు డబ్బులు లెక్క పెట్టుకోకుండా తీసుకొని డాక్యుమెంట్స్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటారు. బయట అప్పుడే లోపలికి వచ్చిన బాలు మీనా కారుని ఆ ఓనర్ల డ్రైవరు గుద్దెసేవాడు. దాంతో బాలు కోపంతో వాళ్లతో గొడవకు దిగుతారు. ఇక మనోజ్ వెళ్లి ఆ గొడవని సద్దుమణి ఇలా చేసి బాలుని లోపలికి తీసుకొని వస్తాడు. వాళ్లే ఓనర్స్ అని చెప్పగానే బాలు నాకు ఎక్కడో అనుమానంగా ఉంది అని అంటాడు.. ఇక ప్రభావతి తన హడావిడి మొదలు పెడుతుంది.. ఇంటికి కొత్త పేరు పెట్టాలని మనోజ్ ఒక స్వామిజిని పిలవాలని అనుకుంటాడు..

ఇంటి ఓనర్స్ పై బాలుకు అనుమానం.

ప్రభావతి ఎక్కడికి వచ్చినా నీ బుద్ధి పోనిచ్చుకోవు ఏంట్రా.. ఎవరితోనైనా గొడవ పడుతూనే ఉంటావా అని అంటుంది. ఎవరితో పడితే వాళ్లతో గొడవపడడానికి నాకేమైనా సరదా అనుకున్నావా.. కాసేపాగింటే నా కారుని డైరెక్టుగా గుద్దేసేవాడు. బయటికి వచ్చినప్పుడైనా సైలెంట్ గా ఉండొచ్చు కదా అని బాలుని అందరూ ఏదో ఒక మాట అంటారు. ఆ కార్ లో వెళ్తున్న వాళ్లు ఇంటి ఓనర్లు. ఏంటి ఇంటి ఓనర్లా? వాళ్ళని చూస్తే అలా లేరే.. ఇంత పెద్ద ఇంటికి ఓనర్లు అయ్యుండి సొంత కార్ లేకుండా క్యాబ్లో వెళ్తున్నారు ఏంటి అని బాలు అంటాడు.. వాళ్లు ఎయిర్పోర్ట్ కి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకున్నారు అని మనోజ్ చెప్తాడు.. కానీ బాలు కి మాత్రం ఎక్కడో అనుమానం ఉంటుంది.. నాకు ఏదో తేడాగా ఉంది అని అనుకుంటారు.

మీనా పూలగంప పక్కన పెట్టాల్సిందే..

Advertisement

ఆ ఇంటిని చూసి చాలా బాగుంది అని అందరూ కూడా మురిసిపోతూ ఉంటారు. అయితే ఇల్లంతా చూసుకుంటూ వచ్చిన ప్రభావతి అరే నీ పెళ్ళాం ఇంకా పూలగంపని పక్కన పెట్టాల్సిందే అని అంటుంది. ఏ నా పెళ్ళాం ఎందుకు పక్కన పెట్టాలి. ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అని ప్రభావతికి బాలు సెటైర్లు వేస్తాడు. ఇంత పెద్ద ఇంటిని ఊడ్చి తుడిచేదానికే టైం సరిపోదు.. ఇక పూలు ఎక్కడ అమ్ముతుంది అని అనగానే ఏంటి ఓనర్ ఏం పని చేస్తారు నా భార్య ఎందుకు చేయాలి అని బాలు అంటాడు..

నోరుజారిన ప్రభావతి..

రోహిణి అదృష్టవంతురాలు కాబట్టే తన భర్త అంచలంచలుగా ఎదుగుతున్నాడు. ఎవరికైనా అదృష్టం రాసిపెట్టి ఉంటే అది జరుగుతుంది అని ప్రభావతి అనగానే.. అయ్యో నాన్న నీకు ఎంత అన్యాయం జరిగింది నాన్న 30 ఏళ్ల క్రితమే నీకు ఇంత అన్యాయం జరిగిందా..? భార్య అదృష్టవంతురాలు అయితే వాళ్లు అంచలంచలుగా ఎదుగుతారు అని అమ్మ అంది.. నువ్వు డ్రైవర్ గానే ఉన్నావు డ్రైవర్ గానే రిటైర్డ్ అయ్యావు నీకు 30 ఏళ్ల క్రితమే అన్యాయం జరిగింది నాన్న అంటూ ప్రభావతి గాలి తీసేస్తాడు బాలు.. ఏం మాట్లాడుతున్నావ్ రా అని ప్రభావతి అంటుంది.

మీనాను అవమానించిన ప్రభా..

Advertisement

ప్రభావతి సోఫాలో కూర్చుని కాలి మీద కాలు వేసుకుని పని వాళ్ళకి ఆర్డర్ చేసినట్టుగా మీనాన్ని ఇలా రా అని అంటుంది.. ఫ్రిజ్లో పాలు ఉంటాయి వెళ్లి కాఫీ పెట్టుకోరా అని అంటుంది. ఈ ఇంటి ఓనర్ చేయాల్సిన పని నా భార్య ఎందుకు చేయాలి అని బాలు అంటాడు.. నేను కాఫీ పెడతాను కానీ ఎవరు తాగలేరు అని అనగానే మీనా నేను పెడతాను అని అంటుంది. ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి అని ప్రభావతి అంటుంది. నీ పెళ్ళాం ఏదన్నా కోటీశ్వరుల ఇంటి నుంచి వచ్చిందా పూల అమ్ముకునే ఇంటి నుంచే కదా వచ్చింది ఇలాంటివన్నీ మామూలే కదా అని అంటుంది. ఇక్కడ అడుగు పెట్టగానే మీ అమ్మ కళ్ళు నెత్తినెక్కి ఉన్నాయి. నువ్వేం పట్టించుకోకు రాని సత్యం అంటాడు.. అతనికి బాలు కూడా ప్రభావతి గాలి తీసేస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కోసం ప్రేమ షాకింగ్ నిర్ణయం.. వల్లిని రెచ్చగొట్టిన భాగ్యం.. భద్రకు నిజం తెలుస్తుందా..?

Related News

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Big Stories

Advertisement
×