Gundeninda GudiGantalu Today episode May13th: రోహిణి కోసం చపాతి తీసుకుని వెళ్లి ఇచ్చిన మీనాని రోహిణి దారుణంగా మాట్లాడుతుంది. మమ్మల్ని అత్తయ్య తిట్టడం కొట్టడం మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు కదా అని రోహిణి మాట్లాడటంతో మీనా దిమ్మ తిరిగిపోయేలా షాక్ అవుతుంది.. ఆకలితో ఉన్నావు కదా అని భోజనాన్ని పైకే తీసుకొచ్చి పెట్టాను అది నేను చేసిన తప్పు. నీలాగా నేను లక్షలు మింగి ఉండి ఉంటే ఎన్ని పూల షాపులు కొనే దాన్ను అని మీనా రోహిణి కి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది.. నువ్వు ఇంకా మారతావని నేను అస్సలు అనుకోలేదు. మరి అది ఇస్తే తీసుకుంటాను ఆ మర్యాదను తిరిగి నేను ఇస్తాను అంతే అని మీనా రోహిణి కి చెప్తుంది
అసలు నన్ను అంత మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది రోహిణి. నేను చేసి పెట్టిన చపాతిని తిన్నావు కదా గడ్డి మాత్రం తినలేదు కదా నన్ను అంటావా ఏ రోజు నేను సంతోషంగా ఉన్నాను అని మీనా రోహిణికి దిమ్మ తిరిగిపోయేలా క్లాస్ పీకుతుంది. నిన్ను అత్తయ్య కొడితే తిడితే నేనెందుకు సంతోషంగా ఉంటాను. డబ్బులు మింగింది మీరు దాన్ని దోచుకుంది. మీరు అలాంటిది నా మీద పడి ఏడుస్తావ్ ఏంటి నువ్వు అని రోహిణికి క్లాస్ పీకుతుంది మీనా.. ఎంగిలి ప్లేటు రూమ్ లో ఉంటే నీకు నచ్చదు కదా…అదే ప్లేట్ ని తీసుకెళ్లి సింక్లో వేసి నీటుగా కడిగి అక్కడ పెట్టు లేదంటే నాకు నచ్చదు అని మీనా షాక్ ఇస్తుంది. ఇంకోసారి నీకు భోజనం తీసుకొని వస్తే నా చెప్పుతో నేను కొట్టుకుంటాను అని మీనా అంటుంది..
ఎక్కడికి వెళ్లావు అని మీనా అని ప్రభావతి అడుగుతుంది. రోహిణికి భోజనం పెడదామని వెళ్లాను అత్తయ్య అని చెప్పినా కూడా మీనా పై ప్రభావతి సీరియస్ అవుతుంది. ఏంటే నువ్వు భోజనం తీసుకుని వెళ్లి రోహిణి నీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నావా? నన్ను నా కోడల్ని విడగొట్టాలని చూస్తున్నావా అని ప్రభావతి అంటుంది.. నేను మిమ్మల్ని విడగొట్టాలని ఏ రోజు అనుకోలేదు అత్తయ్య మీరే ఏదో అనుకుంటున్నారు అని ప్రభావతి పై సీరియస్ అవుతుంది మీనా. ఇప్పుడు నా చిన్న కోడల్ని నాకు కాకుండా నీ తేనె వంటి మాటలతో నీ వైపు తిప్పుకున్నావు. ఈరోజు ఏదో గొడవ జరిగిందని రోహిణి కూడా నీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నావా అని ప్రభావతి దారుణంగా మాట్లాడేసి వెళ్ళిపోతుంది.
మీ నా ఒంటరిగా కూర్చుని బాధ పడిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన బాలు రెండు చెప్పులు చేతపట్టుకొని మీనా అంటూ అరుస్తూ వస్తాడు. ఏంటి ఏంటండీ.. ఈ చెప్పుతో నన్ను కొట్టు అని మీనా చేతిలో చెప్పులు పెడతాడు. అయ్యో రామ రామ ఏంటి మీరు ఎలా అంటున్నారు అని మీనా అంటుంది. రెండోసారి ఈ లక్షలు మింగినోడు భోజనం చేయకుండా ఆకలితో ఉంటాడని వాడి కోసం బిరియాని కొని తీసుకొని వెళ్ళాను. ఆకును కూడా వదలకుండా నాకి షాపుని సొంతం చేసుకోవడానికి నా కోసం బిర్యానీ తీసుకొచ్చావా అని అన్నాడు అక్కడ నా చెప్పుతో కొట్టుకోలేక ఇక్కడికి వచ్చి కొట్టు అని అంటున్నానని బాలు అంటాడు. ఇక మీనా కూడా రోహిణి అన్నమాట బాలుతో చెప్పడంతో వీళ్లిద్దరికి ఇంక ఏ సహాయం చేయకూడదు అని ఇద్దరు ఫిక్స్ అవుతారు.
ఉదయం లేవగానే మనోజ్ వచ్చి రోహిణి అని తలుపు కొడుతూ ఉంటాడు. రోహిణి మాత్రం తలుపు తీయదు. అయితే మీనా కూడా అక్కడికి రావడంతో ఏమైంది అని అడుగుతుంది. వెళ్లి కాఫీ చేయమని చెప్పాను కదా నువ్వు వెళ్లి కాఫీ చెయ్యు అని మీనా కి చెప్తుంది ప్రభావతి. ఏంటండీ రోహిణి తలుపు తీయలేదు ఏమైనా చేసుకుంటుందా అని కంగారు పడిపోతుంది మీనా. తలుపు చాలాసేపు కొట్టిన తర్వాత రోహిణి నిద్రలేచి బయటకు వస్తుంది. తలుపు ఇంతగా కొడుతున్న నీకు నిద్ర ఎలా పట్టింది అని ప్రభావతి అడుగుతుంది. అరే నువ్వు లోపలికి వెళ్లి రెడీ అయ్యి వెంటనే కిందకు రాని ప్రభావతి అంటుంది. రోహిణి తలుపు వేస్తుంటే తలుపు వేసి ఇవన్నీ మార్చాలని అనుకుంటున్నావా ఈ ఇంట్లో తలుపు వేయాల్సిన అవసరం లేదు అని రోహిణి ప్రభావతి అంటుంది.ఆ మాటకు రోహిణి సీరియస్ అవుతుంది.
రోహిణి ఇలాంటి పనులు చేస్తుందని అస్సలు ఊహించలేదు కదా అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈయన రోహిణి ఇలాంటి పని చేసిందంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను అని పార్వతి అంటుంది. సుమతి శివ కూడా మమ్మల్ని చాలా అవమానించింది ఆ రోహిణికి ఇలా జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటారు. అయితే రోహిణి గుణ దగ్గరికి చాలాసార్లు వచ్చిందని శివ భయంకరమైన నిజాన్ని బయటపెడతాడు. చాలాసార్లు లక్షలకు లక్షలు డబ్బులు తీసుకుంది అని అనగానే అన్ని డబ్బులు ఈవిడ ఏం చేసింది అని మీ నాకు అనుమానం మొదలవుతుంది. అసలు రోహిణి బాగోతం ఏంటో అర్థం కావడం లేదు అని అనుకుంటారు.
బాలుకి రోహిణి గుణ దగ్గరకి డబ్బులు తీసుకుంది అని మీనా చెబుతుంది. అన్ని డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చింది ఎవరికిచ్చింది నాకు ఏదో అనుమానంగా ఉంది అని బాలు కూడా అంటాడు. ఇక రోహిణి సత్యం గదిలోకి వెళ్లి మావయ్య నన్ను క్షమించండి. మీ కొడుకు బాగుపడాలని ఇలా చేశాను అని ఎంతగా చెప్తున్నా సరే.. సత్య మాత్రం అయిపోయింది కదమ్మా ఇక ఎవరిని క్షమించాల్సిన అవసరం లేదు అని అంటాడు. అత్తయ్య నన్ను ఎంతగా అవమానించిందో మీరు కూడా చూశారు కదా మావయ్య. క్షమించాను అని ఒక్క మాట చెప్పండి నేను సంతోషంగా ఉంటాను అని సత్యంని అడుగుతుంది రోహిణి. నేను మీ అత్తయ్య అంతగా నమ్మింది తన నమ్మకాన్ని నువ్వు పోగొట్టావు కాబట్టే తను చాలా బాధతో నిన్ను కొట్టింది అని సత్యం అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read : ఒక్కరోజుకు లక్ష తీసుకుంటున్న హీరోయిన్స్.. వంటలక్క ఎంతంటే..?