Vijay Support: కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ తన ఉదారతను చాటుకున్నారు. సాధారణంగా స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉంటుంది. కానీ, తోటి నటీనటుల పట్ల తనకున్న గౌరవాన్ని విజయ్ మరోసారి నిరూపించుకున్నారు. నటి త్రిష, సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘కరుపు’ (Karuppu) కోసం విజయ్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే విజయ్, త్రిషలు వారి అనుబంధం గురించి అందరికీ తెలిసిందే.
తమిళనాడులో పెద్ద సినిమాల విడుదల సమయంలో థియేటర్ల కేటాయింపు, షోల సమయాల విషయంలో కఠినమైన నిబంధనలు ఉంటాయి. ముఖ్యంగా విజయ్ వంటి టాప్ హీరో సినిమా థియేటర్లలో ఉన్నప్పుడు, ఇతర సినిమాలకు ప్రాధాన్యత లభించడం కష్టం. అయితే, ‘కరుపు’ సినిమా క్రేజ్ దృష్ట్యా, ఆ చిత్రానికి ఉదయం 9 గంటల ప్రత్యేక షోలు ప్రదర్శించుకోవడానికి విజయ్ ప్రత్యేకంగా అంగీకరించినట్లు తెలుస్తోంది.
విజయ్, త్రిషల కాంబినేషన్ కు కోలీవుడ్‌లో ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. ‘గిల్లి’ నుంచి ఇటీవలి ‘లియో’ వరకు వీరిద్దరూ వెండితెరపై మ్యాజిక్ చేశారు. వీరి మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహబంధం కారణంగానే, త్రిష సినిమాకు తన వంతు సహకారం అందించాలని విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అలాగే సూర్యతో కూడా విజయ్‌కు మంచి అనుబంధం ఉంది. ప్రస్తుతం విజయ్ తన రాజకీయ ప్రయాణం (తమిళగ వెట్రి కళగం – TVK) పై దృష్టి పెట్టారు. ప్రస్తుతం తమిళనాడు సీఎంగా సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. తన సినిమా కెరీర్ ముగిసిన తరుణంలో, తోటి నటీనటులకు మద్దతుగా నిలవడం ద్వారా ఆయన ఇండస్ట్రీలో ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.